హోమ్ /వార్తలు /బిజినెస్ /

UAN Number లేకుండా PF విత్ డ్రా చేసుకోవడం సాధ్యమే...ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి...

UAN Number లేకుండా PF విత్ డ్రా చేసుకోవడం సాధ్యమే...ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కొన్ని సందర్భాల్లో UAN నెంబర్ లేకుండానే, పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు. UAN నెంబ‌రు లేకుండా PF బ్యాలెన్స్‌ను ఏవిధంగా విత్‌డ్రా చేసుకోవచ్చో చూద్దాం. PF ను విత్‌డ్రా చేసుకునేందుకు, నేరుగా ఆన్‌లైన్‌లో గానీ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

Provident Fund లేదా EPF అనేది  ఉద్యోగి అతడు పనిచేసే సంస్థ వేతనంలో కొంత మొత్తం జమచేస్తారు. అందులో ఉద్యోగి వాటా, అలాగే కంపెనీ వాటా ఉంటాయి. ఉద్యోగి నెల జీతం నుంచి ప్రతి నెల ఈ మొత్తం డిడ‌క్ట్ అవుతుంది. అయితే ఈ మొత్తం కూడా ఉద్యోగి ప‌దవీ విర‌మ‌ణ అనంత‌రం పొందవచ్చు. మన దేశంలో చాలా మంది రిటైర్డ్  ఉద్యోగులు ఈ మొత్తంతోనే జీవితం వెళ్లబుచ్చుతున్నారు. ఈపీఎఫ్ సంస్థ ఈ నిధులను నిర్వహిస్తుంది. అంతేకాదు పొదుపు చేసిన మొత్తానికి వడ్డీ కూడా చెల్లిస్తుంది. ఇద్దరి నుంచి 12 శాతం స‌మాన కాంట్రీబ్యూష‌న్ ఉంటుంది. ప్ర‌తీ ఉద్యోగి, త‌న ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం వ‌డ్డీతో స‌హా పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. మ‌న దేశంలో చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు పీఎఫ్‌ ను ఫిక్స్ డ్ డిపాజిట్లలో వేసి క్వార్టర్లీ, లేదా ఇయర్లీ మొత్తాన్ని బ్యాంకులో వేసుకొని జీవితం గడపు ఫించ‌ను మొత్తంపై ఆధార‌ప‌డి జీవిస్తున్నారు. అయితే ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని విత్‌డ్రా చేసుకునేందుకుగానూ UAN Number కావాల్సి ఉంటుంది. ఈ UAN Number సంస్థ ద్వారా పొందాలి.

కానీ చాలా మంది ఉద్యోగులకు, త‌మ PF విత్‌డ్రా చేసుకునేందుకు కావ‌ల‌సిన UAN నెంబ‌రు పొందడం చాలా పెద్ద సమస్యగా మారింది. కానీ కొన్ని సందర్భాల్లో UAN నెంబర్ లేకుండానే, పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు. UAN నెంబ‌రు లేకుండా PF బ్యాలెన్స్‌ను ఏవిధంగా విత్‌డ్రా చేసుకోవచ్చో చూద్దాం. PF ను విత్‌డ్రా చేసుకునేందుకు, నేరుగా ఆన్‌లైన్‌లో గానీ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. Online పద్ధతిలో విత్ డ్రా చేసుకోవాలంటే మాత్రం ఆధార్‌, పాన్‌, బ్యాంక్ ఖాతా నెంబ‌ర్ల‌తో  యూఏఎన్‌ కనెక్ట్ అయి ఉండాలి. అయితే UAN నెంబ‌రు లేక‌పోయినా, ఆఫ్‌లైన్‌ ప‌ద్ద‌తి ద్వారా పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

ఇందుకోసం ఆధార్ బేస్డ్ కాంపోసిట్ క్లెయిమ్ ఫార‌మ్‌, లేదంటే నాన్ ఆధార్ కాంపోసిట్ క్లెయిమ్ ఫార‌మ్‌ను గానీ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లెయిమ్ ఫార‌మ్‌ను పూర్తి చేసి, పీఎఫ్ విత్‌డ్రా ద‌ర‌ఖాస్తుతో పాటు రీజ‌న‌ల్ పీఎఫ్ ఆఫీసులో, అటెస్టేష‌న్ లేకుండా ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ఒక‌వేళ మీరు నాన్‌- ఆధార్ కాంపోసిట్ ఫార‌మ్‌తో ద‌ర‌ఖాస్తు చేస్తే అటెస్టేష‌న్ చేయించాలి. అయితే అటెస్టేష‌న్ తప్పనిసరి, ఇందుకోసం బ్యాంకు మేనేజ‌ర్‌తో గానీ, గెజిటెడ్ ఆఫీస‌ర్‌, మేజిస్ట్రేట్‌తో గానీ అటెస్టేష‌న్ చేయించి స్థానిక రీజినల్ EPFO ఆఫీసులో ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఈపీఎఫ్ విత్‌డ్రాల‌ను ఉద్యోగంలో ఉన్న‌ప్పుడు గానీ ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం గానీ విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ప‌ద‌వీవిర‌మ‌ణ త‌రువాత గానీ, రెండు నెల‌ల‌కు పైబ‌డి నిరుద్యోగిగా ఉన్న‌ప్పుడు గానీ పూర్తిస్థాయి విత్‌డ్రా చేసుకునేందుకు అనుమ‌తిస్తారు.

First published:

Tags: EPFO

ఉత్తమ కథలు