చాలా సార్లు, క్రిప్టో పెట్టుబడిదారులు మార్పులకు ఆలస్యంగా ప్రతిస్పందిస్తుంటారు. దానికి తోడు, కాయిన్లను సొంతం చేసుకోవడం, అనివార్య మార్పుల రెండూ ముడిపడి ఉన్నందున ఇవి కాలక్రమేణా మీ క్రిప్టో ఆస్తులపై భారీ ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఇలాంటి వలయంలో చిక్కుకోకుండా క్రిప్టోతో పని చేయడానికి ఒక మార్గం ఉంటే అది ఎలా ఉంటుంది. క్రిప్టోను కొనుగోలు చేసినా లేదా అమ్మినా, కొన్నిసార్లు పనులు చేయడానికి వేగవంతమైన మార్గమే ఉత్తమ మార్గం.
ZebPayతో మీ క్రిప్టో మార్పిడి, ఇది ఇప్పుడు సాధ్యమవుతుంది. ఇందుకు ప్లాట్‌ఫారమ్ QuickTrade ఫీచర్‌కు థ్యాంక్స్, క్రిప్టో పెట్టుబడిదారులు ఎటువంటి ట్రాన్సాక్షన్ ఫీజు లేకుండా క్రిప్టో ఆస్తులను ఇన్స్టెంట్గా కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. ఇప్పుడు ఇది ఎలా పని చేస్తుందో చూద్దాం.
ఓపెన్ బుక్ ట్రాన్సాక్షన్లు Vs QuickTrade -
ముందుగా, ఓపెన్ బుక్ ట్రాన్సాక్షన్ల గురించి మీకున్న సందేహాలను, ఇంకా ఇది QuickTrade నుండి ఎలా భిన్నమైనదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మునుపటి సిస్టమ్, కొనుగోలుదారులు, విక్రేతల మధ్య సరఫరా ఇంకా డిమాండ్ ద్వారా పనిచేస్తుంది. అందువల్ల, మీరు నిర్దిష్ట ధర వద్ద 'డిప్‌ను కొనాలని' చూస్తున్నా లేదా మీరు కోరుకున్న ధరకు నిర్దిష్ట ఆస్తిని అమ్మాలన్నా, డిమాండ్ లేదా సరఫరా మీ అభ్యర్థనకు తగినట్టుగా మారేవరకు మీరు వేచి ఉండవలసి ఉంటుంది.
QuickTrade ఈ వెయిటింగ్ పీరియడ్‌ను తొలగిస్తుంది మరియు ఆర్డర్లు సరిపోయే వరకు వేచి ఉండకుండా కొనుగోలు మరియు అమ్మకం ఆర్డర్లను తక్షణమే నెరవేరుస్తుంది. QuickTrade యొక్క మరొక పెద్ద ప్రయోజనం ఏమిటంటే దీనిలో ఎటువంటి ట్రాన్సాక్షన్ ఫీజు విధించబడదు, ఇంకా ఎటువంటి ముందస్తు షరతులు ఉండవు, కాబట్టి క్రిప్టో ఆస్తులను కొనుగోలు చేయడం మరియు అమ్మడం అనేది ఇప్పుడు మరింత లాభదాయకమైన ప్రతిపాదన.
ZebPay అందించే QuickTrade ఫీచర్–
QuickTradeను ఉపయోగించడానికి, మీరు కొనుగోలు చేయాలనుకునే లేదా అమ్మాలనుకునే క్రిప్టో పెయిర్‌ను ఎంచుకుని, ZebPayలో లాగానే ఇన్స్టెంట్ ఆర్డర్ చేయండి. మీ ఆర్డర్‌ను అందుకున్నాక, మార్పిడి మీ వివరాలను మరియు బ్యాంక్ ఖాతాను ధృవీకరిస్తుంది.
ZebPay తన యూజర్లను అస్థిర ధరల కదలికలు మరియు అవాంఛిత ఆశ్చర్యాల నుండి రక్షించడానికి రేట్లు మరియు సర్క్యూట్ పరిమితులను కూడా ధృవీకరిస్తుంది. ఇది మీ QuickTrade ఆర్డర్ యొక్క ట్రాన్సాక్షన్ దశలో అవాంఛనీయ సంఘటనలను నివారిస్తుంది. ఈ దశ పూర్తయిన తర్వాత, కొనుగోలు లేదా అమ్మకం ఆర్డర్ విజయవంతంగా అమలు చేయబడుతుంది మరియు మీరు మీ ఖాతాలో ఇది కనబడుతుంది.అంతే. మీకు ఇష్టమైన క్రిప్టో ఆస్తులను కొనడం లేదా విక్రయించడంలో దీని కంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
QuickTradeను ఎలా ఉపయోగించాలి-
ఇప్పుడు మీరు దాని ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు, ఇక్కడ మీరు మీ ప్రయోజనం కోసం QuickTradeను ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం . ZebPay app యాప్‌ను తెరిచి, QuickTrade విభాగానికి వెళ్లండి.
ఇక్కడ నుండి, మీరు మీ క్రిప్టో ఆస్తులను కొనుగోలు చేస్తున్నా లేదా అమ్ముతున్నా, మొత్తం ప్రక్రియ అనేది కేవలం రెండు క్విక్ సులభమైన దశలలో జరుగుతుంది. మీరు క్రిప్టోను కొనుగోలు చేస్తుంటే, మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న క్రిప్టోకు మొత్తం లేదా INR సమానమైన మొత్తాన్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు QuickBuy బటన్‌ను క్లిక్ చేయండి, ఇక్కడ మీరు మీ ట్రేడ్ సారాంశాన్ని చెక్ చేసుకోవచ్చు. మీ సెక్యూరిటీ PINను ఎంటర్ చేసి స్క్రీన్‌పై ఉన్న అన్ని వివరాలను వెరిఫై చేసి, ట్రాన్సాక్షన్‌ను నిర్ధారించండి.
మీరు క్రిప్టోను అమ్ముతున్నట్లయితే, మీరు అమ్మాలనుకుంటున్న కాయిన్ మొత్తాన్ని లేదా INRకు సమానమైన మొత్తాన్ని ఎంటర్ చేయాలి. QuickSell బటన్‌ను నొక్కి, ఆపై ట్రేడ్ సారాంశం విభాగంలో అన్ని వివరాలను వెరిఫై చేయండి. మీ సెక్యూరిటీ PIN మరియు voilaతో ట్రాన్సాక్షన్‌ను నిర్ధారించండి, అంతే మీరు దీన్ని పూర్తి చేసినట్టే.
కొన్ని సమయాల్లో, “అందించిన ధర గడువు ముగిసింది, దయచేసి కొత్త ధరను పొందడానికి మళ్లీ ఆర్డర్ చేయండి" , అని ఒక ఎర్రర్ మెసేజ్‌ను మీరు చూడవచ్చు. సిస్టమ్‌లో ఆర్డర్ ధర మారినప్పుడు ఇది జరుగుతుంది, ట్రాన్సాక్షన్‌ను కొనసాగించడానికి ధరలలో సర్దుబాటుకు దారి తీస్తుంది. ఎగువున కుడి వైపున ఉన్న యాప్‌లో ఎప్పుడైనా యూజర్లు తమ QuickTradeను చెక్ చేసుకోవచ్చు.
QuickTrade ప్రస్తుతం ZebPayలో BTH, ETH మరియు MATIC వంటి టోకెన్లకు వర్తిస్తుంది. ZebPayలో సులభంగా ఉపయోగించగల QuickTrade ఫీచర్ గురించి ఇక్కడ తెలుసుకోండి.
(This Is a Partnered Content)
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.