విజయవాడ-సింగపూర్‌ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం

180 సీటర్ విజయవాడ-సింగపూర్‌ నాన్‌-స్టాప్ ఫ్లైట్ వారానికి రెండు సార్లు నడిపేందుకు ఆరు నెలల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.18.35 కోట్లు కేటాయించింది. తొలి నెల సర్వీసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇండిగోకు రూ.3,05,87,220 అడ్వాన్స్ కూడా ఇచ్చింది.

news18-telugu
Updated: December 5, 2018, 11:06 AM IST
విజయవాడ-సింగపూర్‌ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: December 5, 2018, 11:06 AM IST
విజయవాడ ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ ఏవియేషన్ మ్యాప్‌పై చోటు సంపాదించుకుంది. మంగళవారం ఇండిగో ఎయిర్‌బస్ ఏ320 విమానం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి సింగపూర్ బయల్దేరింది. కేంద్ర పౌర విమానయయాన శాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు, సహాయ మంత్రి జయంత్ సిన్హా, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు పలువురి సమక్షంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జెండా ఊపి తొలి ఫ్లైట్‌ను ప్రారంభించారు.

ఇది ఆరంభం మాత్రమే. త్వరలో విజయవాడ నుంచి మరిన్ని అంతర్జాతీయ విమానాల రాకపోకలు సాగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, సింగపూర్ మధ్య ఎయిర్ కనెక్టివిటీతో ఆగ్నేయాసియాకు రాకపోకలు ఇంకా సులువు కానున్నాయి. ఏవియేషన్ రంగం కనెక్టివిటీని పెంచడం మాత్రమే కాదు ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుంది.
వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి


180 సీటర్ విజయవాడ-సింగపూర్‌ నాన్‌-స్టాప్ ఫ్లైట్ వారానికి రెండు సార్లు నడిపేందుకు ఆరు నెలల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.18.35 కోట్లు కేటాయించింది. తొలి నెల సర్వీసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇండిగోకు రూ.3,05,87,220 అడ్వాన్స్ కూడా ఇచ్చింది. మరోవైపు గన్నవరం ఎయిర్‌పోర్టులో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనానికి భూమిపూజ చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రూ.611 కోట్లతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. రూ.161.63 కోట్లతో నిర్మిస్తున్న కొత్త డొమెస్టిక్ టెర్మినల్ భవనాన్ని వచ్చే ఏడాది జనవరి 12న ప్రారంభించనున్నారు.ఇవి కూడా చదవండి:

పేటీఎం వాడుతున్నారా? యాప్‌లో ఇక ఆ ఫీచర్ ఉండదు

సూపర్ ఆఫర్: షావోమీ పోకో ఎఫ్1 పై రూ.5,000 డిస్కౌంట్
Loading...
వయస్సు 7 ఏళ్లు... నెల ఆదాయం రూ.12 కోట్లు... షాకైన సోషల్ మీడియా

ఓటర్ ఐడీ లేదా? ఈ కార్డు ఉంటే ఓటు వేయొచ్చు

జియో చేతికి సావన్ మ్యూజిక్... 90 రోజుల పాటు ఫ్రీ
First published: December 5, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...