హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Idea: ఐస్‌క్రీమ్ బిజినెస్‌తో లక్షల్లో ఆదాయం.. ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి

Business Idea: ఐస్‌క్రీమ్ బిజినెస్‌తో లక్షల్లో ఆదాయం.. ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Idea: వేసవిలో ఐస్‌క్రీమ్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మండుటెండల్లో చల్లచల్లని వ్యాపారం చేసి నెలనెలా వేల రూపాయలు సంపాదించవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఎండాకాలం (Summer) ప్రారంభమయింది. మీకు ఒక వేళ ఉద్యోగం లేకపోయి..ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే.. అందుకు ఐస్‌క్రీమ్ పార్లర్ (Ice Cream Parlour) బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే వేసవిలో ఐస్‌క్రీమ్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మండుటెండల్లో చల్లచల్లని వ్యాపారం చేసి నెలనెలా వేల రూపాయలు సంపాదించవచ్చు. వ్యాపార నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఈ వ్యాపారంలో నష్టాలు కూడా తక్కువగానే ఉంటాయి. అంతేకాదు తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించవచ్చు. షాప్ నిర్వహణకు స్థలం ఉంటే.. రూ.10వేల పెట్టుబడితో కూడా ఐస్‌క్రీమ్ పార్లర్ ఏర్పాటు చేయవచ్చు. కాస్త పెద్దగా పెట్టాలనుకుంటే మాత్రం ఇంకాస్త ఎక్కువ ఖర్చవుతుంది. ఎండాకాలం మాత్రమే కాదు.. చలికాలంలో కూడా ఐస్‌క్రీమ్‌కు డిమాండ్ పెరుగుతోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటున్నారు.

ఐస్‌క్రీమ్ పార్లర్ ప్రారంభించడానికి ముందుగా మీకు ఫ్రీజర్ కావాలి. ఇంట్లో లేదా ఎక్కడైనా దుకాణాన్ని అద్దెకు తీసుకోని దీనిని ప్రారంభించవచ్చు. లేదంటే పూర్తిస్థాయి ఐస్‌క్రీమ్ పార్లర్ ప్రారంభించాలనుకుంటే... 400 నుంచి 500 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా సరిపోతుంది. ఇందులో 5 నుంచి 10 మందికి సీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ముందుగా తక్కువ స్థాయిలో వ్యాపారం ప్రారంభించాలి. అది బాగా నడిస్తే.. మీ వ్యాపారాన్ని మరింతగా వృద్ధి చేసుకోవచ్చు.

Scheme Amount Refund: పొరపాటున ఆ స్కీమ్ డబ్బులు మీ అకౌంట్‌లోకి వచ్చాయా? వెనక్కి ఇచ్చేయాలి

మీరు ఐస్ క్రీం వ్యాపారం చేయడానికి అమూల్ ఐస్ క్రీమ్ పార్లర్ ఫ్రాంచైజీని కూడా తీసుకోవచ్చు. దీని కోసం కనీసం 300 చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుంది. మీకు తగినంత స్థలం ఉండి.. వ్యాపారం ప్రారంభించేందుకు డబ్బు ఉంటే.. ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి retail@amul.coopకి ఇమెయిల్ చేయవచ్చు. ఇది కాకుండా http://amul.com/m/amul ఓపెన్ చేసి దరఖాస్తు చేయవచచు. ఒకవేళ దీని గరించి పూర్తి సమాచారం కావాలంటే దగ్గర్లో ఉన్న ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వెళ్లి తెలుసుకోవచ్చు. పెట్టుబడి ఖర్చులు, మార్జిన్, ఆదాయానికి సంబంధించి వివరణాత్మక సమాచారాన్ని పొందవచ్చు.

ఐస్‌క్రీమ్ పార్లర్ ఏర్పాటు చేసేందుకు FSSAI నుండి లైసెన్స్ పొందాలి. ఇది 15 అంకెల రిజిస్ట్రేషన్ నంబర్. మీరు తయారు చేసే ఆహార పదార్థాలు FSSAI నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయన లేదా అని నిర్ధారిస్తుంది. 2022 నాటికి దేశంలో ఐస్ క్రీం వ్యాపారం ఒక బిలియన్ డాలర్లను దాటుతుందని ట్రేడ్ బాడీ ఫిక్కీ ఒక నివేదికలో పేర్కొంది. అంతలా దీనికి డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో బాగా వృద్ధి చెందుతోంది. మీరు ఐస్‌క్రీమ్ పార్లర్ ప్రారంభిస్తే బాగా ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. పెళ్లి సీజన్‌లో గిరాకీ మరింత పెరుగుతుంది. ఐస్‌క్రీమ్ పార్లర్ ద్వారా నెలకు రూ.30 నుంచి 50 వేల వరకు ఆదాయం పొందవచ్చు.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

First published:

Tags: Business, Business Ideas, Hyderabad, Local News

ఉత్తమ కథలు