Wipro: అప్పుడు వారానికి రూ.2 సంపాదన.. ఇప్పుడు వేల కోట్ల వ్యాపారం.. విప్రో 75 ఏళ్ల ప్రయాణం

(ప్రతీకాత్మక చిత్రం)

The Story of Wipro: 53 ఏళ్ల పాటు అలుపెరగని కృషితో విప్రోని అంచెలంచెలుగా దిగ్గజ కంపెనీగా మార్చిన అజీమ్‌ ప్రేమ్‌జీ 2019 జులై 31న ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

  • Share this:
ఐటీ దిగ్గజం విప్రో (Wipro) అధినేత అజీమ్​ ప్రేమ్​జీ (Azim Premji) గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరిగా మాత్రమే కాదు దాతృత్వంలోనూ అగ్రస్థానంలో నిలిచి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అజీమ్​ ప్రేమ్​జీ. విప్రో వ్యాపారాన్ని వంటనూనెల తయారీ నుంచి వివిధ వ్యాపారాలకు విస్తరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంది. తాజాగా ఈ దిగ్గజ సంస్థ 75వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా విప్రో 75 ఏళ్ల వ్యాపార ప్రయాణం గురించి రాసిన ‘ద స్టోరీ ఆఫ్‌ విప్రో (The Story of Wipro)’ పుస్తకాన్ని అజీమ్‌ ప్రేమ్‌జీ విడుదల చేశారు. దీన్ని వెస్ట్‌లాండ్‌ పబ్లికేషన్స్‌ ప్రచురించింది. విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ తమ కంపెనీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవేమిటో తెలుసుకుందాం.

విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ తాత బియ్యం ట్రేడింగ్‌ (Rice Trading) వ్యాపారాన్ని ప్రారంభించి వారానికి రూ.2 సంపాదించేవారు. తరువాత అతను దాన్ని బియ్యం వ్యాపార రంగంలో అతిపెద్ద కంపెనీగా నిలబెట్టారు. ఇది 75 ఏళ్ల కాలంలో బిలియన్ డాలర్ల విలువైన బహుళ వ్యాపారాల సంస్థగా అవతరించింది. ఈరోజు విప్రో అగ్రసంస్థగా ఎదిగిందంటే దానికి కారణం తన తాత 'నిజాయితీ' అనే వ్యాపార సూత్రం పాటించడమేనని అజీమ్ ప్రేమ్‌జీ చెప్పారు.

Flipkart Xtra: ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌ట్రాతో 4000 పార్ట్ టైం జాబ్స్

ఆ తర్వాత తన తండ్రి మహమ్మద్ హుస్సేన్ హషమ్ ప్రేమ్‌జీ.. తన తాత వారసత్వాన్ని కొనసాగించారని తెలిపారు. తన తండ్రి 21 ఏళ్ల వయసులో ట్రేడింగ్ కంపెనీ బాధ్యతలు చేపట్టారని.. తన తల్లి గుల్బనూ ప్రేమ్‌జీ పిల్లల ఆసుపత్రిని నిర్మించడానికి అహర్నిశలు పోరాటం చేశారని చెప్పుకొచ్చారు. ఆసుపత్రి నిర్మాణం కోసం తన తల్లి చేసిన అలుపెరగని పోరాటం చూసి.. ఒకే విధానంపై నిలబడే అలవాటును చిన్నతనంలోనే అలవర్చుకున్నానని అన్నారు. వైద్యురాలైన తన తల్లి చిన్న పిల్లల కోసం ఆర్థోపెడిక్‌ ఆసుపత్రి నిర్మించేందుకు ఢిల్లీకి వెళ్లి మరీ విరాళాలు సేకరించారని వెల్లడించారు. ఆమె నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని తెలిపారు.

LIC Policy: ఎల్ఐసీ పాలసీ ఉందా? మీకు ఈ ఛాన్స్ మరో నెల మాత్రమే

డిసెంబర్ 29, 1945న అజీమ్ తండ్రి మహమ్మద్ హుస్సేన్ వంట, రిఫైన్డ్ ఆయిల్ తయారీ కోసం మహారాష్ట్రలోని అమల్నర్‌లో వెస్ట్రన్ ఇండియా ప్రొడక్ట్స్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. 1966లో ప్రేమ్‌జీ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో తండ్రి చనిపోయారు. దాంతో ప్రేమ్‌జీ స్వదేశానికి తిరిగొచ్చి కంపెనీ పగ్గాలు స్వీకరించారు. అప్పటికి అతని వయసు కేవలం 21 ఏళ్లే! కంపెనీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రేమ్‌జీ తన తాత, తండ్రులకు భిన్నంగా ఆలోచించారు.

Audi e-tron GT: ఆడి నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు లాంచ్.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే

విప్రో సంస్థను 1989 ఐటీ విభాగంలోకి విస్తరించారు. కన్స్యూమర్ కేర్, లైటింగ్, ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఇంజనీరింగ్, జీఈ హెల్త్‌కేర్ విభాగాల్లోకి కూడా ఆయన తన సంస్థను విస్తరించారు. 2000వ సంవత్సరంలోనే విప్రో 1 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని సంపాదించి సంచలనం సృష్టించింది. అలాగే న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలోకి లిస్ట్ అయింది. 2021 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ ఆదాయం 8.1 బిలియన్ డాలర్లు.

Pearl Farming: గిరిజన ప్రాంతాల్లో ముత్యాల ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి..

53 ఏళ్ల పాటు అలుపెరగని కృషితో విప్రోని అంచెలంచెలుగా దిగ్గజ కంపెనీగా మార్చిన అజీమ్‌ ప్రేమ్‌జీ 2019 జులై 31న ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసేందుకు మరింత సమయాన్ని వెచ్చించే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తరువాత ఆయన కుమారుడు రిషద్‌ ప్రేమ్‌జీ, విప్రో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ బాధ్యతలు చేపట్టారు. దాతృత్వానికి మారుపేరుగా నిలుస్తున్న ప్రేమ్‌జీ ఎడెల్‌గీవ్‌ హురున్‌ ఇండియా దాతృత్వ జాబితా 2020 ప్రకారం.. రూ.7904 కోట్లు విరాళంగా ఇచ్చారు.
Published by:Shiva Kumar Addula
First published: