Home /News /business /

WINTER SHOPPING STORE SALE STARTED IN AMAZON FROM JANUARY 11 DEALS DISCOUNT OFFERS AK GH

Amazon Winter Shopping Store సేల్ ప్రారంభం.. వాటిపై 60 శాతం వరకు డిస్కౌంట్​

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Amazon: శీతాకాలం​ ప్రారంభమవ్వడంతో ‘వింటర్ షాపింగ్ స్టోర్ సేల్’​ను ప్రకటించింది అమెజాన్. ఈ సీజన్‌లో ఎక్కువగా ఉపయోగించే గీజర్లు, రూమ్ హీటర్లు, ఎలక్ట్రిక్ కెటిల్స్ వంటి పరికరాలపై 60 శాతం వరకు డిస్కౌంట్​ అందిస్తోంది.

ఈ–కామర్స్​ దిగ్గజం అమెజాన్ ఇటీవల ఫెస్టివల్​ సేల్స్​తో పాటు ప్రత్యేక సేల్స్​ను కూడా నిర్వహిస్తోంది. ప్రస్తుతం శీతాకాలం​ ప్రారంభమవ్వడంతో ‘వింటర్ షాపింగ్ స్టోర్ సేల్’​ను ప్రకటించింది. ఈ సీజన్‌లో ఎక్కువగా ఉపయోగించే గీజర్లు, రూమ్ హీటర్లు, ఎలక్ట్రిక్ కెటిల్స్ వంటి పరికరాలపై 60 శాతం వరకు డిస్కౌంట్​ అందిస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్​ జనవరి 11 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో బ్లాంకెట్లు, క్విల్ట్స్, రిక్లైనర్లు, కంఫర్టర్లు, బెడ్లు, వంట సామాను, డిన్నర్‌ వేర్‌లను డిస్కౌంట్​పై కొనుగోలు చేయవచ్చు. మరోవైపు, ఎఫ్​పీఎల్​ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ జారీ చేసిన అమెజాన్ వన్​కార్డ్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లపై 10 శాతం ఇన్​స్టంట్ డిస్కౌంట్​ను కూడా పొందవచ్చు. ఈ సేల్​లో వాటర్ హీటర్లు, స్మార్ట్ ప్లగ్‌లతో పాటు క్యాస్రోల్, ఫ్లాస్క్‌లపై కూడా ఆఫర్లు ప్రకటించింది.

అమెజాన్​ వింటర్ షాపింగ్ స్టోర్ సేల్​లో బజాజ్, క్రాంప్టన్‌తో సహా వివిధ బ్రాండ్లకు చెందిన వాటర్ హీటర్లపై ఆకట్టుకునే డీల్స్​ అందిస్తుంది. బజాజ్​ న్యూ శక్తి 15 లీటర్​ వాటర్​ హీటర్​ అసలు ధర రూ. 10,450 వద్ద ఉండగా.. దీన్ని కేవలం రూ. 5,899 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇక, క్రాంప్టన్ అమెకా 15L వాటర్ హీటర్ అసలు ధర రూ. 11,500 వద్ద ఉండగా.. దీన్ని కేవలం రూ. 6,599 వద్ద కొనుగోలు చేయవచ్చు.

జనవరి 11తో ముగియనున్న వింటర్​ సేల్​..
వింటర్​ షాపింగ్​ స్టోర్​ సేల్​లో రూమ్ హీటర్లపై కూడా ఆఫర్లు ప్రకటించింది. మార్ఫీ రిచర్డ్స్ ఓఎఫ్​ఆర్​ 09 2000 -వాట్ ఆయిల్ ఫిల్డ్ రేడియేటర్ అసలు ధర రూ. 7,330 వద్ద ఉండగా.. దీన్ని కేవలం రూ. 4,469 వద్ద కొనుగోలు చేయవచ్చు. జనవరి 11న ముగియనున్న ఈ సేల్​లో బజాజ్, ఓర్పాట్, హావెల్స్​కు చెందిన వాటర్​ హీటర్లు, అమెజాన్ స్మార్ట్ ప్లగ్స్ వంటి పరికరాలపై కూడా డిస్కౌంట్​ అందిస్తోంది.

ఇది కూడా చదవండి

Cars: ఈ కార్లు కావాలంటే క్యూలో ఉండాల్సిందే.. ఎన్ని రోజులు వెయిట్ చేయాలో తెలుసా..

RBI New Rule: డెబిట్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌ విధానంలో కొత్త మార్పులు.. జనవరి 1 నుంచి అమల్లోకి..

ఎనర్జీ మానిటరింగ్‌తో కూడిన విప్రో 16A వైఫై స్మార్ట్ ప్లగ్​ను కేవలం రూ. 999 వద్ద విక్రయిస్తోంది. ఇక, కేర్‌వ్యూ యాంటీ పొల్యూషన్ N95 రీయూజబుల్ ఫేస్ మాస్క్‌లు, సోలిమో మైక్రోఫైబర్ రివర్సిబుల్ కంఫర్టర్, మిల్టన్ థర్మోస్టీల్ ఫ్లిప్ లిడ్ ఫ్లాస్క్, జిమ్‌ ఐటెమ్స్​పై కూడా డిస్కౌంట్లు అందిస్తోంది. మీ కార్ల కోసం ఉపయోగించే ఫాగ్ లైట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు, మైక్రోఫైబర్ క్లాత్‌లను కూడా ఆఫర్​పై కొనుగోలు చేయవచ్చు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Amazon

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు