Home /News /business /

WILL ULIPS LOSE SIGNIFICANCE AS MATURITY PROCEEDS NOT TAX FREE HERE DETAILS NS GH

ULIP-TAX: పాత వైభవం కోల్పోనున్న ULIP.. పన్ను పోటుతో యులిప్ సేల్స్ తగ్గుముఖం

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (ULIP) ట్యాక్స్ స్ట్రక్చర్ లో కేంద్రం చేసిన మార్పు చేర్పులతో యులిప్ పై ఆసక్తి చూపేవారి సంఖ్య ఉన్నట్టుండి పడిపోయింది.

యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (ULIP) ట్యాక్స్ స్ట్రక్చర్ లో కేంద్రం చేసిన మార్పు చేర్పులతో యులిప్ పై ఆసక్తి చూపేవారి సంఖ్య ఉన్నట్టుండి పడిపోయింది. యాన్యువల్ ప్రీమియం రెండున్నర లక్షలకు మించి యులిప్ లో పెట్టుబడి పెడితే మాత్రం వారు పన్ను చెల్లించాల్సిందేనంటూ కేంద్ర బడ్జెట్ స్పష్టంచేసింది. దీంతో ఫిబ్రవరి 1, 2021 తరువాత యులిప్ లో పెట్టుబడులు పెట్టాలనుకున్న వారు పూర్తి వివరాలను అర్థంచేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. యులిప్ ను క్యాపిటల్ ఆసెట్ గా కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తోంది కనుక ఇది పన్ను పరిధిలోకి వస్తుంది. ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ లానే ఇవి కూడా ట్యాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ గా లెక్కిస్తారు. యులిప్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాడక్ట్ కావటంతో పాటు రిస్క్ కవరేజ్ కూడా కలిపి ఉంటుంది కనుక వీటిలో పెట్టుబడి పెట్టటం తెలివైన చాయిస్ గా ఇన్వెస్టర్లు భావిస్తారు.

యులిప్ లో వ్యక్తులు పెట్టే పెట్టుబడులను కొంత స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి, మరికొంత బాండ్స్, ఇలాంటి మరిన్ని వాటిపై పెట్టుబడులుగా ఉపయోగిస్తూ.. మిగిలిన మొత్తాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కోసం ఫండ్ మేనేజ్మెంట్ లో కేటాయిస్తారన్నమాట. మిగతా ఎండోమెంట్ ప్లాన్స్ తో పోల్చితే యులిప్ చాలా పారదర్శకంగా ఉన్న వ్యవహారంగా భావిస్తారు. ఎందుకంటే మనం యులిప్ లో చేసే పొదుపును ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు..దానికి ఎంత ఛార్జీలు వసూలు చేస్తున్నారు వంటి వివరాలన్నీ స్పష్టంగా తెలుసుకునే అవకాశం కస్టమర్ కు ఉంటుంది.

సేల్స్ తగ్గటం ఖాయం..
కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లుగా ఇంతకాలం ఆకట్టుకున్న యులిప్ లు ఇక తమ పూర్వ వైభవం కోల్పోతాయని దీనికంతా కారణం వీటిపై కూడా పన్నులు విధించటమేనని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది యులిప్స్ సేల్స్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని దీంతో ఇన్సూరెన్స్ పైనే వ్యక్తులు ఎక్కువ ఫోకస్ పెట్టి, పెట్టుబడులపై పెద్దగా ఆలోచించకుండా కొత్త బడ్జెట్ ప్రభావం చూపుతుందనే అంచనాలున్నాయి. పెద్ద మొత్తంలో యులిప్ లో పెట్టుబడులు పెట్టేవారికి యూనియన్ బడ్జెట్ ఏమాత్రం రుచించలేదు.

పాత కస్టమర్ కు భయం వద్దు..
యులిప్ పాలసీ కోసం ఏటా రెండున్నర లక్షలు మించకుండా ప్రీమియం కడుతుంటే మాత్రం మీరు పన్ను పరిధిలోకి రారు. ట్యాక్స్ సేవింగ్స్ కోసం యులిప్ పాలసీలు కొత్తగా చేసేవారు యులిప్ లు కూడా పన్ని పరిధిలోకి వచ్చాయనే కొత్త నియమాలను గుర్తుంచుకుని పెట్టుబడులు పెట్టడం మంచిది. ఇక ఇప్పటికే యులిప్ లు తీసుకున్న పాత యులిప్ హోల్డర్లు ఈ పన్ను పరిధిలోకి రారు.

కాబట్టి మెచ్యూరిటీతో వచ్చే మొత్తానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. పాలసీ టైంలోనే యులిప్ కస్టమర్ అకాలమరణంపాలైతే నామినీకి దక్కే మొత్తంపైన కూడా పన్ను విధించరు. బడ్జెట్ కు ముందు వరకు యులిప్ పాలసీలు తీసుకున్నవారికి పన్ను బెడద ఉండదు కాబట్టి వారు నిశ్చింతగా ఉండవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Investment Plans, Money, Mutual Funds

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు