Home /News /business /

WILL TETRA PACK OF FROOTI APPY BE BANNED FROM JULY 1 HERE DETAILS NS GH

Single-Use Plastic: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై ప్రభుత్వం నిషేధం.. జులై 1 నుంచి ఫ్రూటీ, అప్పీ టెట్రా ప్యాక్స్ బ్యాన్ అవుతాయా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వచ్చే నెల నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్(Single-Use Plastic) వస్తువులపై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో ఫ్రూటీ, రియల్, ట్రోపికానా, మాజా వంటి కూల్ డ్రింక్స్‌ కంపెనీలకు సవాలు ఎదురుకానుంది.

వచ్చే నెల నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (Single-Use Plastic) వస్తువులపై నిషేధం విధించడంతో ఫ్రూటీ, రియల్, ట్రోపికానా, మాజా వంటి కూల్ డ్రింక్స్‌ కంపెనీలకు సవాలు ఎదురుకానుంది. గతంలో ఫ్రూటీ, అప్పీ యాజమాన్య కంపెనీ పార్లే ఆగ్రో కూడా ప్లాస్టిక్ స్ట్రాల‌పై నిషేధాన్ని (Plastic Ban) అమలు చేయడానికి గడువును ఆరు నెలలు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్లాస్టిక్ స్ట్రాలతో సహా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లపై ప్రభుత్వం విధించిన నిషేధం 2022 జులై 1 నుంచి అమల్లోకి రాబోతోంది. ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని చెబుతూ పార్లే ఆగ్రో ఎఫ్‌ఎంసీజీ(ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్), కూల్‌ డ్రింక్స్‌ విభాగంలోని పరిశ్రమల మొత్తం వ్యాపారాలపై ‘ప్రతికూల ప్రభావం’ చూపుతుందని పేర్కొంది. ప్లాస్టిక్ స్ట్రాల వాడకంపై ప్రభుత్వం నేతృత్వంలోని నిషేధాన్ని పార్లే ఆగ్రో ఆమోదించినప్పటికీ, నిషేధం అమలును ఆరు నెలలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది.

నిషేధాన్ని వాయిదా వేయాలని పర్యావరణ మంత్రిత్వ శాఖను కోరిన అమూల్
దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పేపర్ స్ట్రాల తగినంత లభ్యత లేని కారణంగా ప్లాస్టిక్ స్ట్రాలపై విధించిన నిషేధాన్ని ఒక సంవత్సరం వాయిదా వేయాలని ప్రముఖ డెయిరీ సంస్థ అమూల్ పర్యావరణ మంత్రిత్వ శాఖను కోరింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్ట్రాలపై ప్రతిపాదిత నిషేధంపై పర్యావరణ కార్యదర్శికి లేఖ రాసినట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(GCMMF) ఎండీ ఆర్ ఎస్ సోధి గత నెలలో తెలిపారు. GCMMF దాని పాలు, ఇతర పాల ఉత్పత్తులను అమూల్ బ్రాండ్ క్రింద మార్కెట్ చేస్తుంది. అమూల్‌కు రోజుకు 10-12 లక్షల ప్లాస్టిక్ స్ట్రాలు అవసరం.
Highway Hypnosis: డ్రైవింగ్ చేసే వారికి అలర్ట్.. మీకీ సమస్య ఉందా? చెక్ చేసుకోండిలా..

కూల్‌డ్రింక్స్‌ తయారీదారులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?
PLA స్ట్రాల కాగితం వంటి పర్యావరణ అనుకూల ఎంపికలకు తయారు చేసేందుకు, ఆల్కహాల్ లేని పానీయాల తయారీదారులకు కనీసం 6-8 నెలల సమయం పడుతుంది. భారతదేశం సంవత్సరానికి ఇంటిగ్రేటెడ్ ప్లాస్టిక్ స్ట్రాల‌తో దాదాపు 6 బిలియన్ ప్యాక్‌ల పేపర్ ఆధారిత పానీయాల కార్టన్‌లను ఉత్పత్తి చేసి విక్రయిస్తోందని పార్లే ఆగ్రో తెలిపింది. స్థానిక భారతీయ తయారీదారు ద్వారా బయోడిగ్రేడబుల్ PLA స్ట్రాల లేదా పేపర్ స్ట్రాల వంటి ప్రత్యామ్నాయాలను అందించడానికి అందుబాటులో ఉన్న సామర్థ్యం రోజుకు 1.3 మిలియన్ యూనిట్లు. ఇది వాస్తవ అవసరాల కంటే చాలా తక్కువ.

శీతల పానీయాల విక్రయంపై ఎలా ప్రభావం చూపుతుంది?
చిన్న టెట్రా ప్యాక్‌లలో విక్రయించే పానీయాల సరఫరా గొలుసు దెబ్బతింటుంది. అంతేకాకుండా ప్లాస్టిక్ స్ట్రాల స్థానంలో పేపర్ స్ట్రాలను దిగుమతి చేసుకోవడం వల్ల పానీయాల తయారీదారులు భారీ దిగుమతి, లాజిస్టిక్స్ ఖర్చులను భరించవలసి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Central Government, Plastic Ban

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు