హోమ్ /వార్తలు /బిజినెస్ /

Will Planning: ఆస్తులను పంచేందుకు వీలునామా రాస్తున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి..

Will Planning: ఆస్తులను పంచేందుకు వీలునామా రాస్తున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వీలునామా రాయడం అంటే కోరుకున్న విధంగా ఆస్తుల పంపకాన్ని కాగితంపై రాయడం మాత్రమే కాదు. ఆస్తులను ఎలా పంపిణీ చేయాలి? ఎలా చేస్తే సక్రమంగా బాధ్యతలు నెరవేర్చినట్లు నమ్ముతాం అనేవి పరిశీలించి డాక్యుమెంట్‌లు సిద్ధం చేయాలి.

ప్రజలు సంపదను సృష్టించేందుకు సంవత్సరాలుగా కష్టపడి పని చేస్తారు కానీ.. వారి తర్వాత తాము కోరుకొన్న వారు ఆ సంపదను(Money) ఆనందించేలా ప్లాన్‌(Plan) చేయడంలో శ్రద్ధ పెట్టరు. ఆస్తుల వీలునామా(ఎస్టేట్ ప్లానింగ్- Estate Planning) రాయకుండా.. ప్లాన్‌ చేసే అంత ఆస్తులు లేవు, చిన్న కుటుంబం(Small Family), నామినీలుగా ఉన్నారు వంటి కారణాలు చెబుతారు. వాస్తవానికి ఏదైనా ఆస్తి ఉండి.. అది తమకు ప్రియమైన వారు ఆనందించాలనే కోరిక ఉంటే ఆస్తుల వీలునామా ప్లాన్(Plan) చేయాలి. వీలునామా రూపొందించేటప్పుడు తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే..

* తక్కువ ప్రాధాన్యం ఇవ్వద్దు

చాలా మందికి ఎస్టేట్ ప్లానింగ్ ఒక ముఖ్యమైన అంశంగా కనిపించదు. ప్లానింగ్‌ ప్రారంభించినప్పటికీ, పూర్తి చేయడంలో వెనకపడవచ్చు. జీవితంలో దాని అవసరం అంతగా కనిపించకపోవడంతో ఎక్కువ మంది పట్టించుకోరు. వైద్యపరమైన అవసరాలు, వ్యాపారం లేదా కుటుంబ సమస్యల కారణంగా, ఆస్తుల సమస్యలు, నిర్వహణ సౌలభ్యం వంటి వాటికి వీలునామా ఉపయోగపడుతుంది. జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు కాబట్టి, ఆస్తుల విషయాల్లో న్యాయ, కుటుంబ సమస్యలు లేకుండా ముందే వీలునామా రాయడం మంచిది.

Bank FDs: HDFC బ్యాంక్ vs ICICI బ్యాంక్ vs SBI.. మూడు బ్యాంకుల తాజా ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇవే..


* కాగితంపై రాయడం మాత్రమే కాదు

వీలునామా రాయడం అంటే కోరుకున్న విధంగా ఆస్తుల పంపకాన్ని కాగితంపై రాయడం మాత్రమే కాదు. ఆస్తులను ఎలా పంపిణీ చేయాలి? ఎలా చేస్తే సక్రమంగా బాధ్యతలు నెరవేర్చినట్లు నమ్ముతాం అనేవి పరిశీలించి డాక్యుమెంట్‌లు సిద్ధం చేయాలి. న్యాయ సంబంధ చిక్కులు రాకుండా కూడా జాగ్రత్త పడాలి. ఉదాహరణకు వీలునామాలో ఆస్తులన్నీ తప్పనిసరిగా జీవిత భాగస్వామికి చెందాలని వీలునామాలో పేర్కొని ఉండవచ్చు. కానీ మీరు మీ తల్లితో కలిసి ఆస్తులను కలిగి ఉంటే లేదా మీరు మీ పిల్లలను కొన్ని ఆస్తులకు నామినేట్ చేసి ఉండవచ్చు. ఇలాంటివి ఆస్తుల బదిలీలో జాప్యం నెలకొనేలా చేస్తాయి.

* ఆస్తుల వివరాల డాక్యుమెంట్‌ ఉంచుకోవాలి

ఇటీవల రెగ్యులేటర్లు విడుదల చేసిన డేటా ప్రకారం.. బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు, ఇన్సూరెన్స్ కంపెనీలు మొదలైన వాటిలో దాదాపు రూ.80,000 కోట్ల డబ్బు క్లెయిమ్ చేయకుండా ఉంది. వీలునామా రాయడంలో ఉన్న లోపాలతో క్లెయిమ్‌ చేయకుండా ఆస్తులు ఉండిపోతున్నాయి. ఆస్తులను ఎలా పంపిణీ చేయాలి అనే దాని గురించి తెలియజేయడానికి వీలునామా రాసి ఉంటారు. అయితే కార్యనిర్వాహకుడు (వీలునామాలో పేర్కొన్న విధంగా ఆస్తులు పంపిణీ చేసే బాధ్యత ఉన్నవారు), ఆస్తులను పొందే లబ్దిదారులు.. సంబంధించిన ఆస్తులను ఎలా గుర్తించాలి? ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, తదితర వివరాలు తెలియకపోతే పంపిణీ చేయడం కష్టమవుతుంది. అందువల్ల సంబంధిత వాటాదారులు సులభంగా ఆస్తులను పొందడానికి ఆస్తుల జాబితాను సిద్ధం చేయడం అవసరం.

* వీలునామా గురించి వాటాదారులకు తెలియజేయండి

చాలా మంది వ్యక్తుల సాధారణ ధోరణి వారి వీలునామాను రహస్యంగా ఉంచడం. అటువంటి విషయాలను గోప్యంగా ఉంచడం మంచి పద్దతి అయినప్పటికీ, ఆస్తులను స్వీకరించవలసిన లబ్ధిదారులకు, ఆస్తులను బదిలీ చేయడంలో సహాయపడే కార్యనిర్వాహకులకు కూడా తెలియకుండా ఉండకూడదు. వీలునామా అనేది ఒక వ్యక్తి వ్యక్తిగత పరిస్థితిని ప్రతిబింబిస్తుంది కాబట్టి, ఏ సమాచారం ఎలా వెల్లడి చేయాలి, ఎంత మేరకు బయటపెట్టాలి అనేది అంచనా ఉండాలి. అయితే అయోమయాన్ని తగ్గించడానికి సంబంధిత వాటాదారులకు మాత్రం తెలియజేయాలి.

Realme Narzo 50 5G: డైమెన్సిటీ ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ...రియల్‌మీ నార్జో 50 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ ఈరోజే

* 'DIY' విధానాన్ని అనుసరించడం మానుకోండి

ఒక మంచి వీలునామాను.. పన్ను, నియంత్రణ పరమైన చిక్కులను పరిగణనలోకి తీసుకొని రూపొందించాలి. ప్లాన్‌ను రూపొందించే వ్యక్తికి మాత్రమే కాకుండా, లబ్ధిదారులకు కూడా కొన్ని న్యాయపరమైన పరిమితులు ఉంటాయి. ఇలాంటి అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రొఫెషనల్‌ని సంప్రదించడం ఉత్తమం. డూ ఇట్‌ యువర్‌పెల్ఫ్‌(DIY) అనే పద్ధతిని మానుకోవాలి. వీలునామా ప్రణాళిక ఒక క్లిష్టమైన ప్రక్రియ. DIY విధానంలో లోపాలు చిన్నవిగా ఉండవచ్చు, అయితే చాలా విస్తృతమైన పరిణామాలు ఉండవచ్చు.

First published:

Tags: Assets, Money, Property, Real estate

ఉత్తమ కథలు