హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Rate: బంగారం తులం రూ.75వేలు వైపు పరుగులు...కరోనా దెబ్బకు పసిడి ప్రియుల హాహాకారం...

Gold Rate: బంగారం తులం రూ.75వేలు వైపు పరుగులు...కరోనా దెబ్బకు పసిడి ప్రియుల హాహాకారం...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు బంగారం ధర 1600 డాలర్ల వైపు పరుగులు తీస్తోంది. అంటే గత సంవత్సరం డిసెంబర్ 16న ఔన్సు బంగారం ధర 1472 డాలర్లు ఉండగా. ప్రస్తుతం 1583 డాలర్లకు ఎగిసింది. అంటే ఏకంగా 100 డాలర్లు పెరిగింది.

Gold Rate: కరోనా ప్రభావం బంగారంపై ప్రత్యక్షంగా ఉంటుందా అంటే అవుననే బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే స్టాక్ మార్కెట్లకు కరోనా వైరస్ దెబ్బతో విలవిలలాడుతున్నాయి. ముఖ్యంగా ఆసియా మార్కెట్లు నెత్తురోడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారంవైపు మదుపుదారులు చూపు చూస్తున్నారు. గతంలో సైతం అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ జరిగినప్పుడు సైతం పెట్టుబడులన్నీ బంగారం వైపు తరలివెళ్లాయి. అయితే ప్రస్తుతం సైతం అలాంటి పరిస్థితులే తలెత్తుతున్నాయి. ముఖ్యంగా చైనా కమోడిటీ మార్కెట్స్ లో అటు చాంద్రమాన కొత్త సంవత్సరం బ్రేక్ తర్వాత తొలి సెషల్ లో ర్యాలీ కనిపించింది. ముఖ్యంగా ఇన్వెస్టర్లు కరోనా వైరస్ భయాలతో ఉత్పత్తి మందగించిందని, అంచనాకు వస్తున్నారు. ఫలితంగా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ ఇప్పటికే 8 శాతం పతనమైంది. ఇది గడిచిన 4 సంవత్సరాల్లోనే భారీ పతనం కావడం గమనార్హం. మరోవైపు పరిస్థితి దిగజారకుండా ఇప్పటికే పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా దాదాపు 174 బిలియన్ డాలర్లు( రూ. 12 లక్షల కోట్లు) స్టాక్ మార్కెట్‌లలోకి ఇంజెక్ట్ చేసేందుకు సిద్ధపడుతోంది. గతంలో సార్స్ వైరస్ కన్నా ప్రస్తుత కరోనా వైరస్ మరింత భీతావహ స్థితి కల్పించనుందనే అంచనాలు వెలువడుతున్నాయి. అటు చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం ప్రభావితం చేసే శక్తిగా ఉంది. ఫలితంగా దీని ప్రభావం అంతర్జాతీయ వాణిజ్యంపై స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు చైనా జీడీపీ సైతం 2020లో 5.6శాతానికి పరిమితం కానుంది. అయితే చైనా ఈక్విటీ మార్కెట్లలోని బేరిష్ ట్రెండ్ అటు బంగారానికి మాత్రం బుల్లిష్ ధోరణిని పెంచుతున్నాయి. అయితే ప్రస్తుతం అంత తొందరగా బంగారం వైపు మదుపరులు తమ పెట్టుబడులు తరలించకపోయినప్పటికీ, భవిష్యత్తులో మాత్రం పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగారం మరింత ధర పెరుగుతుందనే వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మన దేశీయ బులియన్ మార్కెట్లపై దీని ప్రభావం ప్రత్యక్షంగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు బంగారం ధర 1600 డాలర్ల వైపు పరుగులు తీస్తోంది. అంటే గత సంవత్సరం డిసెంబర్ 16న ఔన్సు బంగారం ధర 1472 డాలర్లు ఉండగా. ప్రస్తుతం 1583 డాలర్లకు ఎగిసింది. అంటే ఏకంగా 100 డాలర్లు పెరిగింది.  ఫలితంగా అటు దేశీయంగా సైతం బంగారం ధరలు ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు ఇప్పటికే దేశీయంగా 24 కేరట్ల ధర 42 వేల పై చిలుకే పలుకుతుండగా, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ఊపందుకుంటే మాత్రం అత్యంత వేగంగా బంగారం ధర తులం రూ.1 లక్ష దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంచనాలు వెలువడుతున్నాయి.

First published:

Tags: Gold, Gold jewell, Gold price down, Gold prices, Gold rate hyderabad, Gold shops

ఉత్తమ కథలు