WILL MARUTI AND OTHER COMPANIES WILL HALT SMALL CARS DUE TO GOVERNMENT NEW POLICY HERE IS THE REASON AK
Maruti: మారుతిలోని ALTO, Wagon R కార్ల తయారీ ఆగిపోతుందా ?.. కారణం ఏంటి ?
ప్రతీకాత్మక చిత్రం
Small Cars: మరో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లను జోడించడం వల్ల ధర రూ.17,600 పెరుగుతుంది. అదనపు ఎయిర్‌బ్యాగ్‌లకు అనుగుణంగా కంపెనీలు కారు డిజైన్‌ను కూడా సవరించాల్సి ఉంటుందని, కొన్ని సందర్భాల్లో ధర మరింత ఎక్కువగా ఉండవచ్చని జాటోలోని భారత అధ్యక్షుడు రవి భాటియా అన్నారు.
జనవరిలో భారతదేశంలోని వాహన తయారీదారులు తమ కొత్త ప్యాసింజర్ వాహనాలన్నింటిలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయాలని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముసాయిదాను సిద్ధం చేశారు. పెరిగిన భద్రత కారణంగా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కార్ల కొనుగోలుదారులకు బాగా నచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని కొందరు కార్ల తయారీదారులు ఇష్టపడలేదు. ప్యాసింజర్ కార్లలో(Passenger Cars) ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను (Air Bags) తప్పనిసరి చేయడం వల్ల వాహనం ధర పెరుగుతుందని, ఇది వాటి అమ్మకాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని వారు భావిస్తున్నారు. ఇటువంటి చర్య తక్కువ ధర కార్ల అమ్మకాలను దెబ్బతీస్తుందని.. ఇప్పటికే అధిక ధరలతో పోరాడుతున్న కంపెనీలపై చాలా ఒత్తిడిని కలిగిస్తుందని మారుతీ సుజుకీ(Maruti Suzuki) ఛైర్మన్ ఆర్సి భార్గవ అన్నారు.
కరోనా కారణంగా చిన్న వాహనాల అమ్మకాలు తగ్గుతూనే ఉంటాయని.. పెద్ద, ఖరీదైన వాహనాలకు డిమాండ్ పెరుగుతుందని భార్గవ భయపడ్డారు. చిన్న కార్లు ఆటోమేకర్‌కు పెద్దగా లాభపడవని మరియు భారతదేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ చిన్న కార్లను అసాధ్యమైతే వాటిని నిలిపివేయడానికి వెనుకాడదని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో భార్గవ తెలిపారు. భారతదేశం దాదాపు 3 మిలియన్ యూనిట్ల వార్షిక విక్రయాలతో ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద వాహన మార్కెట్.
మారుతీ సుజుకీ దేశంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థ. దేశంలోని చాలా కార్లు రూ.4 లక్షల నుంచి రూ.7 లక్షల సెగ్మెంట్లో అమ్ముడవుతున్నాయి. అందులో హ్యాచ్ బ్యాక్ కార్ల సంఖ్య అత్యధికం. ఆటో మార్కెట్ డేటా ప్రొవైడర్ జాటో డైనమిక్స్ ప్రకారం.. అన్ని కార్లలో డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లను అందించడం ఇప్పటికే తప్పనిసరి.
మరో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లను జోడించడం వల్ల ధర రూ.17,600 పెరుగుతుంది. అదనపు ఎయిర్‌బ్యాగ్‌లకు అనుగుణంగా కంపెనీలు కారు డిజైన్‌ను కూడా సవరించాల్సి ఉంటుందని, కొన్ని సందర్భాల్లో ధర మరింత ఎక్కువగా ఉండవచ్చని జాటోలోని భారత అధ్యక్షుడు రవి భాటియా అన్నారు. మార్పులు చేయడం సాధ్యమేనా ? మోడల్‌ను ఎక్కువ ధరకు విక్రయించాలా ? వద్దా ? అని కంపెనీలు నిర్ణయించుకోవాలని ఆయన తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.