అలా జరిగితే ఉద్యోగుల జీతాల్లో 50శాతం కోత.. బజాజ్ ఎండీ కీలక వ్యాఖ్యలు

దేశంలోనే అత్యధిక కరోనా కేసులున్న మహారాష్ట్రలో బజాజ్ ప్లాంట్ ఉంది. ఔరంగాబాద్‌లోని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో ఉన్న ఈ ప్లాంట్‌లోనూ చాలా మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటి వరకు ఐదుగురు సిబ్బంది మరణించారు.

news18-telugu
Updated: July 6, 2020, 3:43 PM IST
అలా జరిగితే ఉద్యోగుల జీతాల్లో 50శాతం కోత.. బజాజ్ ఎండీ కీలక వ్యాఖ్యలు
రాజీవ్ బజాజ్
  • Share this:
కరోనా లాక్‌డౌన్ ఎన్నో కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. నష్టాలను పూడ్చుకునేందుకు ఉద్యోగులను కూడా తొలగిస్తున్నాయి. ప్రస్తుతం అన్‌లాక్-2 ఉన్నందున.. ఇప్పుడిప్పుడే కంపెనీలు గాడిన పడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటోంది. ఈ క్రమంలో బజాజ్ ఎండీ రాజీవ్ బజాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పెరుగుతున్న కేసుల దృష్ట్యాల కేంద్రం మళ్లీ లాక్‌డౌన్ పెడితే.. కంపెనీలు మరింత నష్టాల్లో కూరుకుపోతాయని అన్నారు. అలా జరిగితే ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోత విధించాల్సి వస్తుందని తెలిపారు. CNBC-TV18తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు రాజీవ్ బజాజ్.

లాక్‌డౌన్‌లో మా ఉద్యోగుల జీతాల్లో ఎలాంటి కోత విధించలేదు. కానీ ఇప్పుడు మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తే మాత్రం. వేతనాలను భారీగా తగ్గించాల్సి ఉంటుంది. జీతాల్లో 50శాతం మేర కోత విధించాల్సి వస్తుంది.
రాజీవ్ బజాజ్


పరిశ్రమల్లో పనిచేసే వారు కరోనా బారినపడి చనిపోతారని భావించడం కరెక్టు కాదని ఆయన అన్నారు. ఇప్పటికే కంటోన్మెంట్ జోన్లలో ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయని.. కరోనా బారిన పడిన ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడంతో ఉత్పత్తిపై ప్రభావం చూపుతోందని తెలిపారు. కాగా, దేశంలోనే అత్యధిక కరోనా కేసులున్న మహారాష్ట్రలో బజాజ్ ప్లాంట్ ఉంది. ఔరంగాబాద్‌లోని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో ఉన్న ఈ ప్లాంట్‌లోనూ చాలా మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటి వరకు ఐదుగురు సిబ్బంది మరణించారు.
Published by: Shiva Kumar Addula
First published: July 6, 2020, 3:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading