Home /News /business /

WILL GOVERNMENT OF INDIA GIVE SOVEREIGN GUARANTEE FOR LIC POLICIES AFTER LIC IPO CHECK HERE FOR DETAILS SS

LIC IPO: ఐపీఓ తర్వాత మీ ఎల్ఐసీ పాలసీకి ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుందా? తెలుసుకోండి

LIC IPO: ఐపీఓ తర్వాత మీ ఎల్ఐసీ పాలసీకి ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుందా? తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

LIC IPO: ఐపీఓ తర్వాత మీ ఎల్ఐసీ పాలసీకి ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుందా? తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

LIC IPO | ఎల్ఐసీ పాలసీలకు సావరిన్ గ్యారెంటీ (Sovereign Guarantee) అంటే ప్రభుత్వ హామీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. మరి ఎల్ఐసీ ఐపీఓ తర్వాత కూడా పాలసీహోల్డర్లకు సావరిన్ గ్యారెంటీ లభిస్తుందా? తెలుసుకోండి.

    త్వరలో లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) రాబోతోంది. ఇన్స్యూరెన్స్ రంగ దిగ్గజ కంపెనీ అయిన ఎల్ఐసీ ఐపీఓ ఎప్పుడు వస్తుందా అని ఇన్వెస్టర్లు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. భారతీయ ఇన్వెస్టర్లు మాత్రమే కాదు... విదేశీ ఇన్వెస్టర్లు కూడా ఎల్ఐసీ ఐపీఓ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాదే ఎల్ఐసీ ఐపీఓ (LIC IPO) రానుంది. అయితే ఈ ఐపీఓ ద్వారా ప్రభుత్వం ఎంత శాతం వాటాలను అమ్మనుంది? ఒక షేర్ ధర ఎంత ఉంటుంది? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ ఐపీఓలో ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు కూడా వాటా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. పాన్ కార్డ్ వివరాలను అప్‌డేట్ చేయాలంటూ తమ పాలసీహోల్డర్లను కోరుతోంది ఎల్ఐసీ. ఇలా అన్ని రకాల వార్తలతో ఎల్ఐసీ ఐపీఓ మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

    భారతదేశంలో ఎల్ఐసీ అతిపెద్ద ఇన్స్యూరెన్స్ కంపెనీ. ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు చాలానే ఉన్నా ఎల్ఐసీ దరిదాపుల్లోకి కూడా చేరుకోలేకపోతున్నారు. ఇందుకు కారణం... ఎల్ఐసీ పాలసీకి సావరిన్ గ్యారెంటీ (Sovereign Guarantee) ఉంటుంది. అంటే సార్వభౌమ హామీ అని అర్థం. సూటిగా చెప్పాలంటే మీరు తీసుకునే ఎల్ఐసీ పాలసీకి, మీరు చెల్లించే డబ్బులకు కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీ ఉంటుంది. ఈ గ్యారెంటీ ఉంది కాబట్టే ప్రజలు ఎల్ఐసీ పాలసీ తీసుకోవడానికే మొగ్గు చూపిస్తుంటారు. ప్రభుత్వ బ్యాంకులపై నమ్మకం ఉన్నట్టుగానే ప్రభుత్వానికి చెందిన ఇన్స్యూరెన్స్ కంపెనీ అయిన ఎల్ఐసీని నమ్ముతుంటారు. ఎల్ఐసీ చట్టం 1956 ప్రకారం ఈ విశ్వాసం మరింత బలపడుతుంది.

    LIC IPO Alert: ఎల్ఐసీ పాలసీ ఉందా? ఐపీఓలో కోటా కావాలంటే ఈ వివరాలు అప్‌డేట్ చేయండి

    మరి ఎల్ఐసీ ఐపీఓ ద్వారా కేంద్ర ప్రభుత్వం వాటాలు అమ్మితే సావరిన్ గ్యారెంటీ ఉంటుందా అన్న అనుమానాలు పాలసీహోల్డర్లలో ఉన్నాయి. ఈ విషయంలో పాలసీహోల్డర్లు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎల్ఐసీ ఐపీఓ తర్వాత కూడా పాలసీహోల్డర్లకు కేంద్ర ప్రభుత్వ సావరిన్ గ్యారెంటీ కొనసాగుతూ ఉంటుంది. అంటే గతంలో ఎల్ఐసీని నమ్మినట్టుగానే ఇకపైనా నమ్మకం కొనసాగించొచ్చు. ఎల్ఐసీ పాలసీలకు కేంద్ర ప్రభుత్వ సావరిన్ గ్యారెంటీ ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

    LIC Premium: ఈపీఎఫ్ఓ డబ్బులతో ఎల్ఐసీ ప్రీమియం చెల్లించండి ఇలా

    ఎల్ఐసీ ఐపీఓలో పాలసీహోల్డర్లకు 10 శాతం కోటా లభించే అవకాశం ఉంది. అది కూడా ఐపీఓ ధర కన్నా పాలసీహోల్డర్లకు డిస్కౌంట్ ధరకే షేర్లు లభించే అవకాశం ఉంది. దీంతో ఎల్ఐసీ పాలసీహోల్డర్లు ఇప్పటికే డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేసతున్నారు. ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడానికి డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరి. ఎల్ఐసీ పాలసీహోల్డర్ల సంఖ్య 25 కోట్లకు పైనే ఉంది. ఈ లెక్కన ఎల్ఐసీ ఐపీఓ కోసమే లక్షల్లో కొత్త డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ అవుతాయని అంచనా.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: LIC, Personal Finance

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు