హోమ్ /వార్తలు /బిజినెస్ /

భారతదేశ ఆత్మనిర్భరతకు దూసుకుపోతున్న ఫిన్‌టెక్ రంగం కీలకమవుతుందా?

భారతదేశ ఆత్మనిర్భరతకు దూసుకుపోతున్న ఫిన్‌టెక్ రంగం కీలకమవుతుందా?

భారతదేశ ఆత్మనిర్భరతకు దూసుకుపోతున్న ఫిన్‌టెక్ రంగం కీలకమవుతుందా?

భారతదేశ ఆత్మనిర్భరతకు దూసుకుపోతున్న ఫిన్‌టెక్ రంగం కీలకమవుతుందా?

నవీకరణ మరియు ప్రజాస్వామ్యీకరణ ద్వారా భారతదేశం ఈ విధంగా డిజిటల్ చెల్లింపులు మరియు ఈ కామర్స్ లను రూపుదిద్దుతోంది.

  • Advertorial
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

డిజిటల్ చెల్లింపుల విషయం లో భారతదేశం ప్రపంచం లో అగ్రగామి అన్నది నిర్వివాదం. ఇటీవలి ACI ప్రపంపంచ వ్యాప్త నివేదిక అనుసారం, 2021 సంవత్సరం లో భారతదేశం 48.6 బిలియన్ల మేర డిజిటల్ లావాదేవీలు నిర్వహించింది - ఇది చైనా కంటే దాదాపుగా 3 రేట్లు మరియు యూ యస్, కెనడా, యూకే, ఫరాన్స్ మరియు జర్మనీ ల మొత్తం లావాదేవీలకంటే దాదాపుగా 7 రెట్లు (7.5 బిలియన్ ).

ప్రపంచం మొత్తం లోనే అతి పెద్దదైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) 2023 నాటికి సుమారుగా 59 బిలియన్ పరిమాణం కు చేరుతుందని అంచనా. నేషనల్ పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (NPCI) UPI ఏర్పరచడానికి సన్నద్ధం అయినప్పుడు వారి దృష్టి సీదాసాదా: బాంకుల మధ్య సహవర్తి-సహవర్తి మరియు వ్యక్తి-నుండి- వ్యాపారవేత్త లావాదేవీల కొరకు ఒక వినిమయసీమ ఏర్పాటు చేయాలన్నది వారి వాంఛ.

UPI సఫలత వృత్తాంతము

UPI ఎందుకు జయప్రదం అయింది? ప్రముఖంగా చెల్లింపుల లో సౌఖ్యం, లావాదేవీ లో భద్రతా మరియు వీలు వలన వినిమయదారులు నగదు చెల్లింపుల కంటే UPI లావాదేవీలను ఇష్టపడతారు. ఇతర లబ్ధుల తో బాటూ చెల్లింపులు అందుకునే వారికి చెక్కు విఫలత సమస్యలు, నకిలీ నోట్లు, సరైన చిల్లర చెల్లింపులు, పెద్ద మొత్తం లో నగదు ఉంచుకోవడం మరియు బాంకులో జమ చెయ్యడం వంటి సమస్యలను ఇది నిర్మూలిస్తుంది. UPI భౌతిక లావాదేవీల ప్రక్రియను కూడా పూర్తిగా తీసివేసేసింది. తద్వారా బాంకు శాఖలు మరియు ఏటీఎం లకు వెళ్లే అవసరం భారీగా తగ్గించింది. తత్కారణంగా బాంకు శాఖలలో రద్దీ తగ్గుదల మరియు వేగవంతమైన సేవల అందింపుకు దారి తీసింది.

డిజిటల్ లావాదేవీల కొరకు వినియోగించే PayTm, Google Pay, Phonepe మరియు BHIM ల తో సహా పలు ఏప్స్ తో UPI వ్యవస్థ సమ్మర్దమైనది. UPI స్వీకరణకు ఇది ఒక అత్యంత ఘనమైన చోదనం అయింది: UPI వ్యవస్థను వాడుకోవడానికి ప్రస్తుతం వాడుకలో వున్నఏప్స్ స్వీకరించడం ద్వారా వ్యాపారులు మరియు బాంకులు వారి సొంత చెల్లింపు విధానాలు ఏర్పాటుచేసుకోవడానికి ధనం వెచ్చించ వలసిన అవసరం లేదు.

అంతర్జాతీయ వేదికలో స్వీకరణకు ఇది కూడా కారణం. NPCI అంతర్జాతీయ సంస్థ అయిన NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL) RuPay ఆధారిత క్రెడిట్ కార్డులు మరియు UPI స్వీకరణకొరకు 30 కంటే అధిక దేశాల తో సంప్రదింపులు నెరపుతున్నది. సింగపూర్ లో ఆ దేశపు సత్వర చెల్లింపు వ్యవస్థ అయిన PayNow ను UPI తో అనుసంధానించే కార్యక్రమాన్ని RBI మరియు Monetary Authority of Singapore చేపట్టారు.

UPI పతాక ప్రమాణానికి కారణం దాని విశ్వసనీయత మరియు అగ్రశ్రేణి స్థాయి నమ్మిక. SIPs నుండి చెల్లింపు ద్వారాల వరకు ఏ ఆర్ధిక ఉత్పత్తుల స్వీకరణకైనా విశ్వసనీయత మరియు నమ్మిక మూలం. భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ కల సాకారం చేసుకోవడానికి భారతదేశానికి కావలసినది దేశపు వ్యవస్థ నుండి అదే స్థాయి విశ్వసనీయత మరియు నమ్మిక.

QCI లబ్ధులు

భారత వ్యాపారాలకు ఈ స్థాయి వాసి, నమ్మిక మరియు విశ్వసనీయత ఏర్పడడానికి The Quality Council of India ఒక వెన్నెముక వంటిది. QCI విధానం రెండు రకాలు: ఒకటి, వ్యాపారాలకు ప్రమాణాలు, శిక్షణా కార్యక్రమాలు మరియు ఆధికారిక మైన గుర్తింపు అందుబాటులో ఉంచడం ద్వారా వాటి క్షమత పెంపుదలకు సహాయపడుతుంది. రెండు, వ్యాపారాల అంతర్గత విధానాలు మరియు వ్యవస్థల క్షుణ్ణ సమీక్ష జరిపి తీసుకోవలసిన చర్యలను సూచించే మదింపుదారుల కూటమి ఏర్పాటు చేసింది.

ఆర్ధిక రంగం లో వాసి గురించిన స్మృతి మరియు వినిమయదారుల రక్షణ తీసుకొచ్చే నిమిత్తం క్యూసిఐ పలు పరిశ్రమ స్థాయి ప్రమాణాలకు శ్రీకారం చుట్టింది. ది నేషనల్ ఎక్రెడిటేషన్ బోర్డు ఫర్ సర్టిఫికేషన్ బాడీస్ (NABCB) వద్ద Information Technology Service Management Systems (ITSMS), Information Security Management Systems (ISMS), Quality Management Systems (QMS), Trustworthy Digital Repository Management Systems (TDRMS) తో బాటుగా పలు గుర్తింపు పథకాలు వున్నాయి.

ఈ రూపానికి స్పష్టమైన లబ్ధులు వున్నాయి. భారత వ్యాపారాలు ప్రపంచ ప్రమాణాల స్థాయి లో వున్నాయన్న విషయం వివిధ దేశాల ఎక్రెడిటేషన్ సంస్థల తో బహుపక్షీయ సంబంధాల ఉనికి అంతర్జాతీయ కూటములకు తేటతెల్లం చేస్తుంది. ప్రపంచ వ్యాపారంలో పాల్గొనడం, మరియు ప్రభుత్వాల నడుమ ఉభయ పక్ష మరియు బహుపక్షీయ అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు ఇది దోహదం చేస్తుంది. అంతే కాకుండా మన ఉత్పత్తులు మరియు సేవలకు ఇది పోటీ పటిమ అందిస్తుంది.

నియంత్రణాధికారులు మరియు ప్రభుత్వ సంస్థల సాంకేతిక యోగ్యతలను NABCB ఎక్రెడిటేషన్ రూఢి చేస్తుంది. తద్వారా వారు నియంత్రించే మరియు ఆమోదించే ఉత్పత్తులు మరియు సేవల పైన నమ్మకం అభివృద్ధి చేస్తుంది. జాతీయ నియంత్రణాధికారులు మరియు చట్ట సంబంధిత సంస్థల మధ్య సామరస్యత నెలకొల్పడం లో కూడా దోహద పడుతుంది.

ఎక్రెడిటేషన్ ప్రపంచ స్థాయి ప్రమాణాలకు దీటుగా ఉండడానికి నియమితకాలిక పరీక్షల ద్వారా నిరంతర అభివృద్ధి , మరియు గుర్తింపు మార్గదర్శక సూత్రాల గురించిన సమయానుసార సమాచార లభ్యత అందుబాటులోకి తెస్తుంది. విపత్తు నిర్ధారణ ప్రమాణాల అంతర్భాగం కనుక అంతర్జాతీయ ప్రమాణాలకు దీటైన విపత్తు నిర్వహణా రూపం ఇది సృష్టిస్తుంది.

నబీసీబీ గుర్తించిన ఉత్పత్తులు మరియు సేవల ప్రామాణ్యత మరియు విశ్వసనీయతలను ప్రభుత్వం, పరిశ్రమ మరియు వినిమయదారులు గుర్తిస్తారు. ఒక విధంగా, ఎక్రెడిటేషన్ ప్రక్రియ తో నే ఈ ఉత్పత్తులు ఒక స్థాయి నమ్మిక, విశ్వసనీయత మరియు వినిమయదారుల నమ్మకము సంక్రమించుకుంటాయి.

ఈ రూపం సృష్టి ద్వారా ఫిన్ టెక్ అంకుర సంస్థలు ప్రామాణికత, విశ్వసనీయత కలిగిన ఉత్పత్తులు మరియు సేవలు అభివృద్ధి చేసేందుకు వీలుగా QCI కావలి మార్గాలను సృష్టిస్తుంది. 2.3.4 శ్రేణి నగరాల వినిమయదారులు కూడా ఈ పరిష్కారాలకు అలవాటు పడుతున్నారన్న నిజం ఎవ్వరిని ఆశ్చర్య పరచదు. ప్రపంచం లో భారతదేశం అత్యంత అధికమైన ఫిన్ టెక్ స్వీకరణ కలిగి వుంది.

ఈ పర్యావరణం యొక్క సాఫల్యత మిగతా ప్రపంచానికి భారతదేశపు ఫిన్ టెక్ పరిష్కారాలు తులమానికంగా వున్నాయి అన్న విషయం గమనిస్తే తెలుస్తుంది. భారత యూనికారం ల పట్టిక మనోజ్ఞమైనది: Paytm, Acko Insurance, BharatPe, BillDesk, Digit Insurance, PhonePe, Pine Labs, Razorpay, Policybazaar, MobiKwik, Zeta, Zerodha, CRED, Slice, CredAvenue, Groww, OneCard, Open, Oxyzo, CoinSwitchKuber, CoinDCX, మరియు Chargebee. అన్ని పరిశ్రమల అంచనాల ప్రకారం, ఈ ధోరణి పెరుగుదల వైపే కొనసాగుతుంది.

ఇప్పుడు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ద్వారా QCI UPI సాఫల్యతను విస్తరిస్తోంది. డిజిటల్ చెల్లిపులకు UPI ఏ విధమైనదో అదే విధంగా భారతదేశం లో ONDC ఈ కామర్స్ కు. వారు ఏ ప్లాటుఫారం లేదా యాప్ వినియోగిస్తున్నా అమ్మకందారుల మరియు కొనుగోలుదారులకు ఉనికి మరియు ఇరువురూ లావాదేవీలు జరుపుకోవడానికి వీలు కల్పించే లక్ష్యం తో ది డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) ONDC పథకం ప్రారంభించింది.

ONDC ప్రారంభం ఈ కామర్స్ లోని గాదె లను భగ్నం చేయగలదని ఆశ. దేశవ్యాప్తంగా వినిమయదారులను చేరుకొని విస్తరించే విధంగా వర్తకులు ఒకే యాప్ ద్వారా చేరి బహుళ ఈ కామర్స్ విపణుల లో వ్యాపారం నిర్వర్తించే విధంగా ONDC ప్లాటుఫారం సహాయపడుతుంది. చెల్లింపులు, బట్వాడా, ఆన్లైన్ ఉనికి, బిల్లింగ్ మరియు మార్కెటింగ్ వంటి వివిధ ఇతర సేవలను ఒకే ఒక ప్లాటుఫారం ద్వారా అందించి తద్వారా వర్తకులు మరియు వినిమయదారులకు సారళ్యం చేకూరే వెసులుబాటును ఇది కల్పిస్తుంది. ఇది కేవలం పోటీ పెంచడమే కాకుండా పెద్ద వర్తకుల వలే వాణిజ్య ప్రకటన మరియు మార్కెటింగ్ సత్తా లేని లఘు వ్యాపారులకు ఒక బహిరంగ మరియు సమస్థలి ఏర్పాటుచేస్తుంది.

భారతదేశం లో ఫిన్ టెక్ మరియు చిల్లర వాపారాలకు రెంటికి ఇది ఒక పెద్ద అవకాశంగా ఎదిగే క్షమత కలిగివుంది. అధిక ఖర్చు చేసే పెద్ద వ్యాపారస్తులకు ఈ కామర్స్ ప్లాటుఫార్ములు అందించే ఇతర లబ్ధులు లేదా వరణాత్మక అన్వేషణ లేదా వాణిజ్య ప్రకటన ల వంటి సదుపాయాల సహాయం లేకుండానే ఉత్తమ ఉత్పత్తులు, సంతుష్ట వినిమయదారులు మెరిసే విధంగా యోగ్యత ఆధారంపైన నడిచే వ్యవస్థను పోయందిసి సృష్టించే దిశగా ఆశిస్తోంది. తమ సొంత లాభాలపై దృష్టి నిలిపే విదేశీ లేదా వ్యక్తిగత విపణుల పైన ఆధారం ఖండించే స్వగృహ విపణి ఖచ్చితంగా ఆర్ధిక వ్యవస్థకు మేలు చేకూర్చగలదు.

రాబోయే 5 సంవత్సరాల లోనే 900 మిలియన్ కొనుగోలుదారులు, 1.2 మిలియన్ అమ్మకందారులను ONDC చేర్చుకో ఆశిస్తోంది మరియు స్థూల విక్రయ విలువ $48 బిలియన్ సాధించాలని ఆశిస్తోంది. MSME వ్యాపారస్తులు, విశేషముగా ZED ప్రమాణీకరణ ప్రక్రియలో వున్న వారికి భారతదేశ విపణులు లో ఒక ప్రముఖ స్థానం అందుకొని తద్వారా ప్రపంచ స్థాయిలో కూడా ఎదిగే అవకాశం కలిగించే పటిమ ONDC ప్లాటుఫారం కు వున్నది.

భారతదేశం ఒక బృహత్‌ విపణి. మన జనాభానే మనలను ఒక గొప్ప ఆకర్షణ శక్తిగా చేస్తుంది. కానీ దానిని ఎదిగే రాబడుల తో కలిపితే, అన్ని పరిమాణాల వ్యాపారాలకు భారతదేశ విపణి ప్రపంచం మొత్తం లో తప్పక అందుకోవాల్సిన విపణిగా రూపుదిద్దుకుంటుంది.

నాణ్యత నమ్మకం తో బాటుగా వుండే పటిష్టమైన రూపం అందించడం ద్వారా మరియు అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు కలిగిన ఉత్పత్తులు అందించే విపణి సృష్టి ద్వారా క్యూసిఐ అందరికి లబ్ది చేకూర్చే ఒక ధర్మమైన వృత్తం ఏర్పరుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలకు అనుగుణంగా దేశీయ ఉత్పత్తులు ఎదగడానికి వ్యాపారస్తులకు సహాయం అందుతున్నది మరియు వాటి ప్రోత్సాహమే ఏకైక లక్ష్యంగా గల విపణులు వారికి అందుబాటు లోనికి వస్తాయి. మరొక పక్క, భారతీయ వినిమయదారులకు అధిక నాణ్యత గల వస్తువులు మరియు సేవలు అందుబాటులోకి వస్తాయి, తద్వారా విదేశీ సేవాదారుల పైన భారదేశపు ఆధారం తగ్గుతుంది.

వ్యవస్థలో వున్న ద్రవ్య రాసి ఆధారంగా ఒక ఆర్ధిక వ్యవస్థ యొక్క ప్రమాణం నిర్ధారించబడుతుంది. భారతదేశపు అత్యుత్తమ వ్యాపారాలను దేశపు 1 బిలియన్ కంటే అధికంగా వున్న జనాభా తో ముడివెయ్యడం ద్వారా QCI యొక్క గుణవత్థా సి ఆత్మనిర్భరత భారతదేశపు $5 ట్రిలియన్ ఆర్ధిక వ్యవస్థ లక్ష్యం వైపు పురోగమిస్తోంది.

QCI గురించిన మరిన్ని వివరాలు మరియు భారదేశపు గుణవత్థా సి ఆత్మనిర్భరత చొరవ మరియు మన జీవితాలపైన దాని ప్రభావాల గురించి తెలుసుకోవడానికి https://www.news18.com/qci/ సందర్శించండి.

First published:

Tags: BHIM UPI, Fintech, UPI, Upi payments

ఉత్తమ కథలు