Home /News /business /

WHY ZOHO FOUNDER SRIDHAR VEMBU SELECTED FOR PADMA SHRI AWARD HERE IS HIS PROFILE STORY NK

Sridhar Vembu: ఎవరీ శ్రీధర్ వెంబు? కేంద్రం ఈయనకు పద్మశ్రీ ఎందుకిస్తోందో తెలుసా?

శ్రీధర్ వెంబు (image courtesy - twitter)

శ్రీధర్ వెంబు (image courtesy - twitter)

Republic Day 2021: 54 ఏళ్ల శ్రీధర్ వెంబు ఏం సాధించారు? ఆయనను పద్మశ్రీ అవార్డుకు కేంద్రం ఎంపిక చేయడం వెనక ఉన్న బలమైన కారణం ఏంటి? తెలుసుకుందాం.

  Zoho founder Sridhar Vembu: మీరు ఎప్పుడైనా జోహో (Zoho) లోగో చూసే ఉంటారు. 1996లో ఎడ్వెంట్‌నెట్ పేరుతో ప్రారంభమైన ఓ కంపెనీ... క్రమంగా ప్రపంచ సాఫ్ట్‌వేర్ కంపెనీగా ఎదిగింది. 2009లో జోహో కార్పొరేషన్ పేరుతో గుర్తింపు పొందింది. దీని ప్రధాన కార్యాలయం ఇప్పుడు చెన్నైలో ఉంది. ప్రస్తుతం దానికి 6కోట్ల మంది కస్టమర్లు, క్లైంట్లూ ఉన్నారు. ఈ కంపెనీని ప్రారంభించినది ఎవరో కాదు 54 ఏళ్ల శ్రీధర్ వెంబు. తన సోదరుడితో కలిసి ప్రారంభించారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ రంగంలో శ్రీధర్ వెంబు చేసిన కృషిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా... ఇవాళ ఈ అవార్డును ఆయనకు ఇవ్వబోతున్నారు.

  ప్రస్తుతం జోహో కంపెనీకి లెవీస్, అమెజాన్, ఫిలిప్స్, వర్ల్‌పూల్, ఓలా, జియోమీ, జొమాటో వంటి చాలా కంపెనీలు క్లైంట్లుగా ఉన్నాయి. రోజురోజుకూ ఎదుగుతున్న ఈ కంపెనీ... ప్రస్తుతం బిలియల్ డాలర్లకు చేరింది. అంటే మన రూపాయిల్లో రూ.7293 కోట్లు.


  మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ఎన్నో సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీలు ఉండగా... వాటికి పోటీ ఇస్తూ జోహో ఎదిగిన తీరు అద్భుతం. ఇంతలా నమ్మకాన్ని నిలబెట్టకోవడానికి కారణం... ఈ కంపెనీ అందిస్తున్న సర్వీసుల్లో ఎక్కడా రాజీ పడకపోవడమే. విలువల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదనీ... ధైర్యంగా అడుగులు వేయడం, సరైన సమయంలో కస్టమర్లు రావడం వంటివి అంశాలు తమ కంపెనీ విజయానికి దోహద పడ్డాయని శ్రీధర్ వెంబు తెలిపారు. "యుద్ధంలో ఓడిపోతే మరణిస్తాం... అదే వ్యాపార యుద్ధంలో ఓడిపోతే... బతికే ఉంటాం... కాబట్టి... వ్యాపార యుద్ధంలో పోరాటం కాస్త తేలికే" అంటున్నారాయన.

  తమ లాంటి కంపెనీలు రావాలంటే... ప్రభుత్వాలు ప్రోత్సాహం అందించాలని శ్రీధర్ చెబుతున్నారు. గ్రామ గ్రామాలకూ బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం వస్తుండటం మంచి పరిణామం అన్నారు. ఈ విషయంలో ప్రైవేట్ రంగ కంపెనీలు జోరుగా ఉన్నాయన్నారు.


  గ్రామానికి తిరుగుపయనం:
  IIT మద్రాస్‌లో గ్రాడ్యుయేట్ చేసిన శ్రీధర్... అమెరికా... న్యూజెర్సీ రాష్ట్రంలోని ప్రిన్స్‌టన్ యూనివర్శిటీలో చదువుకున్నారు. అలాంటి ఆయన ఆశ్చర్యంగా కరోనా సమయంలో... తమిళనాడులోని ఓ చిన్న ఊరైన తెంకాసికి వచ్చేశారు. ఒత్తిడిని తగ్గించుకుంటూ పనిచేయడం మేలన్నారు. తన ఉద్యోగులు కూడా తనలాగే చేయాలని కోరారు.

  వాట్సాప్‌కి పోటీగా యాప్:
  తాజాగా వాట్సాప్‌కి పోటీగా జోహో... ఓ యాప్ తయారుచేసింది. దాని పేరు అరత్తాయ్ (Arattai) అంటే... తమిళంలో బాతాఖానీ, చిట్ చాట్ అనే అర్థం వస్తుంది. జనవరిలో ఈ యాప్ ప్రారంభించిన జోహో... ముందుగా తన ఉద్యోగులకే ఇచ్చింది. ఈ యాప్‌లో వాయిస్, వీడియో చాట్ చేసుకునేందుకు వీలుంది. దీన్ని తయారుచేయడానికి తమకు 8 ఏళ్లకు పైగా సమయం పట్టిందని శ్రీధర్ తెలిపారు.

  ఇది కూడా చదవండి: Vastu Shastra: ఇంట్లో ఈ వస్తువులు ఉంటే అరిష్టం... నెగెటివ్ ఎనర్జీతో రోగాలు

  స్కూల్స్ కూడా:
  విద్యాభివృద్ధికి కూడా బాటలు వేస్తున్న శ్రీధర్... జోహో స్కూల్స్‌ని 16 ఏళ్ల కిందటే ప్రారంభించారు. ప్రధానంగా ఈ స్కూళ్లలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Republic Day 2021

  తదుపరి వార్తలు