• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • WHY YOU SHOULD AVOID CASH IN THESE TRANSACTIONS MK GH

Cash Payments: క్యాష్ చెల్లింపులు చేస్తున్నారా...అయితే ఇన్‌కం టాక్స్ కొత్త రూల్స్ ఇవే..

Cash Payments: క్యాష్ చెల్లింపులు చేస్తున్నారా...అయితే ఇన్‌కం టాక్స్ కొత్త రూల్స్ ఇవే..

(ప్రతీకాత్మక చిత్రం)

Cash Payments: రూ.2 లక్షలకు మించిన క్యాష్ ట్రాన్సాక్లన్లపై ప్రస్తుతం నిషేధం ఉంది. సందర్భం ఏదైనా సరే, నగదు రూపంలో చెల్లించాల్సిన మొత్తం మాత్రం రూ.2 లక్షలకు మించకూడదు. అయితే కరోనా కారణంగా ఈ పరిమితిని ఇన్‌కం ట్యాక్స్ విభాగం సడలించింది.

  • Share this:
ఆదాయ పన్ను శాఖ మరో కొత్త నిర్ణయంతో వార్తల్లో నిలుస్తోంది. కరోనా రోగుల వైద్య చికిత్సకు నగదు రూపంలో చెల్లించాల్సిన మొత్తంపై ఉన్న పరిమితిని సంస్థ సడలించింది. వాస్తవానికి వివిధ రకాల నగదు చెల్లింపులపై ఇన్‌కం ట్యాక్స్ విభాగం ఒక కన్నేసి ఉంచుతుంది. రూ.2 లక్షలకు మించిన క్యాష్ ట్రాన్సాక్లన్లపై ప్రస్తుతం నిషేధం ఉంది. సందర్భం ఏదైనా సరే, నగదు రూపంలో చెల్లించాల్సిన మొత్తం మాత్రం రూ.2 లక్షలకు మించకూడదు. అయితే కరోనా కారణంగా ఈ పరిమితిని ఇన్‌కం ట్యాక్స్ విభాగం సడలించింది. అత్యవసర వైద్య సేవలకు చెల్లించే మొత్తం రూ.2 లక్షలకు మించినా ఫర్వాలేదని చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి మే 30 వరకు కరోనా బాధితులు హాస్పిటళ్లలో నగదు రూపంలో చెల్లించే మొత్తంపై ఉన్న పరిమితిని సంస్థ రద్దు చేసింది.

ఉదాహరణకు, ఒక వ్యక్తి రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేశాడనుకుందాం. ఈ సందర్భంలో.. ఆభరణాల కొనుగోలు ధర, ఆదాయపు పన్ను విభాగం అనుమతించిన పరిమితికి మించి ఉంది. ఫలితంగా కొనుగోలుదారుడు ఈ లావాదేవీకి నగదు రూపంలో డబ్బు చెల్లించే అవకాశం ఉండదు. కానీ తాజా నోటిఫికేషన్లో మాత్రం ఈ నిబంధనలను అధికారులు పక్కన పెట్టారు. తాజా నోటిఫికేషన్ ప్రకారం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి, డబ్బు ఇచ్చే వ్యక్తికి సంబంధించిన ఆధార్, పాన్ వివరాలను అందించాల్సి ఉంటుంది. డబ్బు చెల్లించేవారు రోగితో తమకు ఉన్న సంబంధాన్ని తెలియజేయాలని కూడా నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో వివిధ రకాల లావాదేవీలు పరిమితిని దాటితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వీటిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

లోన్లు, ఆస్తిపై పరిమితులు
ఎవరైనా వ్యక్తులు ఒక ఆర్థిక సంస్థ లేదా స్నేహితుడి నుంచి లోన్ తీసుకుంటుంటే, నగదు పరిమితి రూ.20,000 కంటే ఎక్కువగా ఉండకూడదు. లోన్ రీపేమెంట్ విషయంలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది. రూ.20,000 మించిన లోన్ రీపేమెంట్ మొత్తాన్ని బ్యాంకుల ద్వారా మాత్రమే చెల్లిచాలనే నిబంధన ఉంది. ఆస్తుల లావాదేవీలకు కూడా అత్యధికంగా రూ.20,000 మాత్రమే నగదు రూపంలో చెల్లించాలి. వాటిని అమ్మే వ్యక్తి అడ్వాన్స్ తీసుకుంటున్నప్పటికీ, పరిమితి మాత్రం మారదు.

వ్యాపార ఖర్చులు
వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు సైతం పెద్ద మొత్తంలో నగదు రూపంలో చెల్లింపులకు అనుమతించకూడదు. ఒక వ్యాపార సంస్థ అధిపతి లేదా యజమాని గరిష్టంగా రూ.10,000 కంటే ఎక్కువ నగదుతో లావాదేవీలు చేస్తే, ఆ ఖర్చులను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు. తరుగుదల (డిప్రిషియేషన్) రూపంలో క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉండదు.

ట్యాక్స్ సేవింగ్ ఇన్‌స్ట్రుమెంట్లు
ట్యాక్స్ ప్లానింగ్ విషయంలో ప్రజలు అవగాహన పెంచుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ పేమెంట్లను నగదు రూపంలో చెల్లించకూడదు. బీమా ప్రీమియాన్ని నగదు రూపంలో చెల్లించిన సందర్భంలో, సెక్షన్ 80D ప్రకారం లభించే ప్రయోజనాలు పొందే అవకాశం ఉండదు. ఈ చెల్లింపులు కచ్చితంగా బ్యాంకింగ్ వ్యవస్థల ద్వారానే జరగాలనే నియమం ఉంది. నిర్దేశించిన పరిమితికి మించిన లావాదేవీలను నగదు రూపంలో స్వీకరించేందుకు సంస్థలు అనుమతించకూడదు. ఈ బాధ్యత రిసీవర్‌పై ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భంలో ఆదాయపు పన్ను విభాగం రిసీవర్‌పై జరిమానా విధిస్తుంది. పరిమితికి మించి నగదు చెల్లింపులను స్వీకరించిన మొత్తాన్ని జరిమానాగా విధించవచ్చు. ఇలా తీసుకున్న మొత్తాన్ని సంబంధిత సంస్థలు బ్యాంకులో వేసినా కూడా శిక్ష నుంచి తప్పించుకోలేరు. అందువల్ల ఈ నియమ నిబంధనలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Published by:Krishna Adithya
First published:

అగ్ర కథనాలు