#BoycottSurfExcel ... ట్విట్టర్‌లో ఎందుకీ హ్యాష్ ట్యాగ్... అసలేం జరిగింది?

#BoycottSurfExcel హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో పెద్ద వివాదమే నడుస్తోంది. ఇది మతపరమైన వివాదం కావడంతో కలకలం రేగుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: March 10, 2019, 2:12 PM IST
#BoycottSurfExcel ... ట్విట్టర్‌లో ఎందుకీ హ్యాష్ ట్యాగ్... అసలేం జరిగింది?
సర్ఫ్ ఎక్సెల్ యాడ్‌లో ఓ దృశ్యం (Image : YouTube)
Krishna Kumar N | news18-telugu
Updated: March 10, 2019, 2:12 PM IST
కుంభమేళా యాడ్‌పై పాజిటివ్ రెన్సాన్స్‌తోపాటూ... తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హిందుస్థాన్ యూనీ లివర్ కంపెనీ... తాజాగా తన సర్ఫ్ ఎక్సెల్ ప్రొడక్ట్‌పై కూడా నెటిజన్ల ఆగ్రహం చూస్తోంది. అసలేం జరిగిందంటే... హిందువుల పండుగైన హోలీకి సంబంధించి సర్ఫ్ ఎక్సెల్ బ్రాండ్ ఓ యాడ్ రూపొందించి... యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసింది. రెండు వారాల్లోనే 77 లక్షల వ్యూస్‌తో ఆ యాడ్ దుమ్ము రేపింది. ఐతే... ఆ యాడ్‌పై ఇప్పుడు హిందూ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన సర్ఫ్ ఎక్సెల్ ప్రొడక్టును నిషేధించాలంటూ... ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా్రు కొందరు. దానికోసం ఏకంగా #BoycottSurfExcel హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశారు.


యాడ్‌తో సమస్యేంటి : ఇందులో ఓ చిన్నారి... తన వీధిలో పిల్లలు తనపై హోలీ రంగులు వేస్తుంటే... ఇంకా ఇంకా వెయ్యమని రెచ్చగొడుతుంది. దాంతో పిల్లలంతా... తమ దగ్గరున్న అన్ని రంగులనూ ఆ చిన్నారిపై చల్లుతారు. చివరకు వాళ్ల దగ్గరున్న రంగులన్నీ అయిపోతాయి. ఆ తర్వాత ఓ ముస్లిం చిన్నారిని పాప ఇంట్లోంచీ బయటకు రమ్మంటుంది. ఆ చిన్నారిని సైకిల్‌పై ఎక్కించుకుని మసీదు దగ్గర వదిలేస్తుంది. ఈ యాడ్‌ చివర్లో మరక మంచిదే అని చెప్పడం వివాదమైంది. హిందువులు మరకలు పూసుకుంటుంటే... ముస్లింలు స్వచ్ఛంగా ఉంటున్నారన్నట్లు ఈ యాడ్ ఉందని హిందుత్వవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాల్ని దెబ్బతీసిన సర్ఫ్ ఎక్సెల్ ని బాయ్‌కాట్ చెయ్యాలని పిలుపిస్తున్నారు.




సర్ఫ్ ఎక్సెల్ బ్రాండ్ మాత్రం... హిందూ-ముస్లింల ఐకమత్యాన్ని చాటేలా తమ యాడ్ ఉందని అంటోంది. హిందువులు ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా పండుగలు చేసుకుంటారనీ, కలిసి మెలిసి ఉంటారనీ... అదే విషయాన్ని యాడ్‌లో చెప్పామన్నది సర్ఫ్ ఎక్సెల్ నుంచీ వస్తున్న వాదన. దీనికి ముందు ఇదే హిందుస్థాన్ యూనీ లివర్ కంపెనీ బ్రాండైన రెడ్ లేబుల్ విషయంలోనూ ఇలాంటి వివాదాస్పద యాడ్ చేసి... తర్వాత మార్పులు చేసింది HUL. మొత్తానికి ఇలాంటి వివాదాస్పద యాడ్లు తియ్యడమెందుకు... ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య సమస్యలు సృష్టించడమెందుకని ట్విట్టర్‌లో మండిపడుతున్నారు నెటిజన్లు.

 

ఇవి కూడా చదవండి :

Emergency Numbers : ఈ అత్యవసర నెంబర్లు... మీ దగ్గర ఉన్నాయా?

ఏప్రిల్ 2 నుంచీ గూగుల్ ప్లస్ లేనట్లే... ఆ తర్వాత ఏం జరుగుతుందంటే...

లోక్‌సభ ఎన్నికలకు ఈసీ సిద్ధం... ఇవాళ సాయంత్రమే నోటిఫికేషన్

ఆండ్రాయిడ్ గేమ్స్ ని కంప్యూటర్ లో ఆడాలా? ఇదిగో ఫ్రీ ఆప్షన్
First published: March 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...