హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tata Motors: టాటా మోటార్స్ కు టెస్లా బూస్ట్..దూసుకెళ్లిన స్టాక్ ధర...ఇన్వెస్టర్లకు బంగారు బాతు..

Tata Motors: టాటా మోటార్స్ కు టెస్లా బూస్ట్..దూసుకెళ్లిన స్టాక్ ధర...ఇన్వెస్టర్లకు బంగారు బాతు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టెస్లా వాహనాలను భారతదేశంలో విక్రయించడానికి టాటా మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకోబోతోందని మీడియాలో కొన్ని కథనాలు రావడంతో ఒక్కసారిగా టాటా మోటార్స్ షేర్లు ఊపందుకున్నాయి.

  స్టాక్ మార్కెట్లో టాటా మోటార్స్ షేరు రయ్ రయ్ మంటూ దూసుకెళ్లింది. ముఖ్యంగా టాటా మోటార్స్ షేర్లు బాగా పెరిగి, అప్పర్ సర్క్యూట్ స్థాయిని తాకాయి. గత ఎనిమిది ట్రేడింగ్ సెషన్లలో టాటా మోటార్స్ షేరు దాదాపు 25 శాతం పెరిగింది. నేడు 227 వద్ద ప్రారంభమై మధ్యాహ్నం 12.21 గంటలకు 22.10 పాయింట్లతో 10.02 శాతం పెరిగి 242.75 స్థాయిని తాకింది. అయితే మార్కెట్ ముగిసే సమయానికి టాటా మోటార్స్ షేరు విలువ 7.52 శాతం లాభపడి 237.25 వద్ద స్థిరపడింది. అయితే టాటా మోటార్స్ ఈ స్థాయిలో అప్పర్ సర్క్యూట్ తాకడం వెనుక టెస్లాతో ఒప్పందం కుదుర్చుకోబోతోందనే వార్తలు బలంగా పనిచేశాయి. అంతకు ముందే యుఎస్ కంపెనీ టెస్లా అధికారికంగా భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే టెస్లా 2021లో భారతదేశంలో తన వ్యాపారాన్ని ప్రారంభిస్తుందని కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ధృవీకరించారు. అయితే టెస్లా వాహనాలను భారతదేశంలో విక్రయించడానికి టాటా మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకోబోతోందని మీడియాలో కొన్ని కథనాలు రావడంతో ఒక్కసారిగా టాటా మోటార్స్ షేర్లు ఊపందుకున్నాయి. ఈ ఒప్పందం కింద టాటా మోటార్స్‌ సౌకర్యాలను టెస్లా ఉపయోగించుకోనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  మరోవైపు అటు స్టాక్స్ మార్కెట్లో కూడా టాటా మోటార్స్ షేర్ ధర ఊపందుకుంది. టాటా మోటార్స్ స్టాక్ 52 వారాల గరిష్టానికి చేరుకుంది. ఇదిలా ఉంటే టెస్లాతో టాటా మోటార్స్ ఒప్పందం కుదుర్చుకోనుందనే వార్తలను ఏ సంస్థ కూడా ఇంకా ధృవీకరించలేదు. స్పెక్యులేషన్స్ పక్కన పెడితే, ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్చిలో కనిష్ట స్థాయికి పడిపోయిన తరువాత, కంపెనీ షేర్లు ఇప్పటివరకు 250 శాతం పెరిగాయి. అలాగే టాటా మోటార్స్ దేశీయంగానూ, అటు చైనాలో జెఎల్ఆర్ వాహనాలు ఊహించిన దాని కంటే ఎక్కువ సేల్స్ నమోదు చేశాయి.

  ముఖ్యంగా జనవరి 11 న, టాటా మోటార్స్ యాజమాన్యంలోని జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్) 2020 కొరకు తన అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది, ఇది కోవిడ్ -19 మహమ్మారి ఫలితంగా పెద్ద విజయాన్ని సాధించింది, అయితే చైనాలో అమ్మకాలు బలంగా ఉండటంతో కంపెనీ రికవరీ సంకేతాలను సూచించింది. 2020 క్యాలెండర్ సంవత్సరానికి జాగ్వార్ ల్యాండ్ రోవర్ రిటైల్ అమ్మకాలు 425,974 వాహనాలు నమోదు కాగా, 2019లో 23.6 శాతం తగ్గాయి, ఇది పరిశ్రమపై COVID-19 ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది, ముఖ్యంగా సంవత్సరం మొదటి భాగంలో రెండు నెలలకు పైగా ప్లాంట్లు మూసివేయడం ప్రతికూల ప్రభావాన్ని చూపింది.

  2020 డిసెంబర్ 31 తో ముగిసిన త్రైమాసికంలో రిటైల్ అమ్మకాలు 128,469 వాహనాలు, అంతకుముందు త్రైమాసికంలో విక్రయించిన 113,569 వాహనాల కంటే 13.1 శాతం ఎక్కువ నమోదు అయ్యాయి. అయితే గత ఏడాది ఇదే కాలంలో 9 శాతం తగ్గాయి. మునుపటి త్రైమాసికంలో చైనా అమ్మకాలు 20.2 శాతం, సంవత్సరానికి 19.1 శాతం పెరగడంతో చైనా అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నాయని కంపెనీ తెలిపింది.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Business, Stock Market, Tata Group

  ఉత్తమ కథలు