పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రతీ రోజు రికార్డులు తిరగరాస్తూ సెంచరీ వైపు పరుగులు తీస్తోంది పెట్రోల్ ధర.

పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రతీ రోజు రికార్డులు తిరగరాస్తూ సెంచరీ వైపు పరుగులు తీస్తోంది పెట్రోల్ ధర.

 • Share this:
  ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.86.72. నిన్నటికి ఈ రోజుకు 16 పైసలు పెరిగింది. ఇలా పెట్రోల్ రేటు పెరుగుతుంటే మరో రెండు మూడు నెలల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తేడా పైసల్లోనే ఉన్నా... వరుసగా పెట్రోల్ ధరలు పెరుగుతుండటం చూస్తుంటే సెంచరీకి చేరువ కావడానికి ఎక్కువ రోజులు సమయం పట్టేలా లేదు. లీటర్ డీజిల్ ధర రూ.75.54 దగ్గరే ఉంది. గత ఐదు నెలల్లో లీటర్ పెట్రోల్‌పై సుమారు రూ.5, లీటర్ డీజిల్‌పై రూ.6.35 పెరగడం సామాన్యులపై భారం మోపినట్టైంది. వరుసగా 10 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గట్లేదు.

  ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి?
  పెట్రోల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోవడమే. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.71.24. అంటే ప్రతీ డాలర్‌కు మనం చెల్లించాల్సింది రూ.71.24 అన్నమాట. మనం క్రూడ్ ఆయిల్ కొనేందుకు డాలర్ల రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో రూపాయి విలువ పతనం అవుతున్నకొద్దీ అదనంగా చెల్లించాల్సిందే. దీనికి తోడు గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. సోమవారం క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ 77.37 డాలర్లు ఉంటే... మంగళవారం క్రూడాయిల్ 78.05 డాలర్లు. రూపాయి పతనానికి తోడు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో దెబ్బ మీద దెబ్బ పడ్డట్టవుతోంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.

  why petrol prices rising?, పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

  రూపాయి విలువ పతనానికి అంతర్జాతీయ అంశాలు కారణమవుతున్నాయని, దాంతో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని కేంద్ర పెట్రోలియం, సహజవనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెబుతున్నారు. కారణాలేవైనా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. బండి బయటకు తీయాలంటేనే వణికిపోవాల్సిన పరిస్థితి. పెట్రోల్, డీజిల్‌పై ధరలు పెరగడం పరోక్షంగా రవాణా రంగంపై పడుతుంది. ఫలితంగా ఆహారపదార్థాలు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అందుకే పెట్రోల్‌, డీజిల్‌ని కూడా జీఎస్‌టీలోకి తీసుకురావాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

  ఇవి కూడా చదవండి:

  కరెన్సీ నోట్లతో రోగాలొస్తాయా?

  థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌కి కొత్త రూల్స్

  యాపిల్ ఈవెంట్‌కు కౌంట్‌డౌన్ షురూ!

  ఏటీఎంలో డబ్బులు రాకపోతే ఇలా చేయండి!

  Photos: రూపాయి విలువ పతనానికి కారణమేంటీ?
  Published by:Santhosh Kumar S
  First published:

  అగ్ర కథనాలు