హోమ్ /వార్తలు /బిజినెస్ /

LPG Cylinder: గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? దీని వెనక అంత పెద్ద కారణం ఉందా?

LPG Cylinder: గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? దీని వెనక అంత పెద్ద కారణం ఉందా?

గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది?

గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది?

Gas Cylinder | గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? అయితే మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు ఎందుకని ఎరుపు రంగులోనే ఉంటాయి? దీని వెనక ఉన్నా విషయం ఏంటో తెలుసుకుందాం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  LPG Cylinder Price | దేశంలో దాదాపు అన్ని ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు (Gas Cylinder)ఉంటాయి. ప్రతి రోజూ వీటితో పని ఉంటుంది. ఇంట్లో ఫుడ్ తయారు చేసుకోవాలంటే కచ్చితంగా ఎల్‌పీజీ (LPG) సిలిండర్ ఉపయోగించాల్సిందే. మనం చాలా ఇళ్లలో సిలిండర్లను చూస్తూనే ఉంటాం. దాదాపు మీరు చూసిన ప్రతి సిలిండర్ ఎరుపు రంగులోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ అంశం గురించి ఆలోచించారు. గ్యాస్ సిలిండర్ ఎందుకని ఎరుపు రంగులోనే ఉంది? ఈ ఎరుపు రంగు వెనక ఆ ముఖ్యమైన కారణం ఉందని మీకు తెలుసా? అయితే అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

  ఎరుపు రంగును హెచ్చరికకు చిహ్నంగా చూస్తాం. ఎల్‌పీజీ సిలిండర్‌లో కూడా మండే వాయువు ఉంటుంది. ఈ కారణంగానే సిలిండర్ వల్ల కూడా ప్రమాదం ఉంటుందని తెలుసుకోవాలి. కస్టమర్ల భద్రత కోసం గ్యాస్ సిలిండర్లకు ఎరుపు రంగు వేస్తారు. ఇది కాకుండా మనం సైన్స్ గురించి మాట్లాడుకుంటే.. ఎరుపు రంగు చాలా బాగా కనిపిస్తుంది. దూరంగా ఉన్నా కూడా ఎరుపు రంగును మిగతా వాటి కన్నా బాగా చూడొచ్చు. అంటే ఎరుపు రంగు హెచ్చరికకు చిహ్నం కనుక దూరం నుంచి కూడా ప్రమాదాలు గుర్తించొచ్చు. అందుకే సిలిండర్‌కు ఎరుపు రంగు వేస్తారు.

  Bank అకౌంట్ ఉన్న వారికి అలర్ట్.. ఈ 7 రకాల సర్వీసులకు డబ్బులు చెల్లించాల్సిందే!

  గ్యాస్ సిలిండర్‌ను తయారు చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎల్‌పీజీ వాసన ఉండదు. మండే స్వభావం ఉంటుంది. వాసన లేకపోతే ఎల్‌పీజీ లీక్ అవుతుందా? లేదా? అని గుర్తించడం కష్టం అవుతుంది. అప్పుడు ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని నివారించడానికి ఇథైల్ మోర్కాంప్టన్ కలిపి వాసన వచ్చేలా చేస్తారు. అప్పుడు గ్యాస్ లీక్ అయితే మనకు వెంటనే తెలుస్తుంది. వాసన రావడంతో గ్యాస్ లీక్ అవుతోందని తెలుసుకోవచ్చు. ఇలా పలు జాగ్రత్తల నడుమ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను తయారు చేస్తారు.

  డబ్బు సంపాదించాలనుకునే వారికి అద్భుత అవకాశం.. సెప్టెంబర్ 14న మిస్ అవ్వొద్దు!

  కాగా ఇకపోతే దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు గరిష్ట స్థాయిల్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. రాష్ట్రం ప్రాతిపదికన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు మారుతూ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఎల్‌పీజీ గ్యాస్ ధరలు రూ. 1100 వద్ద ఉన్నాయి. ఇటీవల కాలంలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గుతూ వస్తోంది. కానీ 14 కేజీల వంట గ్యాస్ ధర మాత్రం ప్రతి నెలా అక్కడే స్థిరంగా ఉంటోంది. దీని వల్ల సామాన్యులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Gas, LPG, LPG Cylinder, LPG Cylinder New Rates, Lpg Cylinder Price

  ఉత్తమ కథలు