హోమ్ /వార్తలు /బిజినెస్ /

Stock Market లో డబ్బులు పెడుతున్నారా...అయితే Cement Stocks గురించి తెలుసుకోండి...

Stock Market లో డబ్బులు పెడుతున్నారా...అయితే Cement Stocks గురించి తెలుసుకోండి...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కోవిడ్-19 (covid-19) కారణంగా ఈ రంగం తీవ్ర ఒడిదుడుకులకు బలయ్యింది. PM Awas Yojana పథకం కింద మధ్యతరగతి వారికి బడ్జెట్ లో ఇల్లు కట్టుకునే సౌలభ్యం లభించటం కూడా రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఊతమిస్తోంది.

సిమెంట్ రంగంలో పెట్టుబడులకు ఇది సరైన సమయమంటూ నిపుణులు చెబుతున్నారు. 3ఏళ్లపాటు నిర్మాణ రంగం కుదేలవుతూ వస్తుండగా రియల్ ఎస్టేట్ (real estate) రంగం కాస్త పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోవిడ్-19 (covid-19) కారణంగా ఈ రంగం తీవ్ర ఒడిదుడుకులకు బలయ్యింది. PM Awas Yojana పథకం కింద మధ్యతరగతి వారికి బడ్జెట్ లో ఇల్లు కట్టుకునే సౌలభ్యం లభించటం కూడా ఈ రంగానికి మంచి ఊతమిస్తోంది. Knight Frank India రిపోర్ట్ ప్రకారం.. మహారాష్ట్రలో 3శాతం స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వటంతో నవంబరు నెలలో విపరీతంగా రియల్ ఎస్టేట్ పుంజుకుంది. గత 9 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఎక్కువ సంఖ్యలో రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు అయ్యాయి. దీంతో రెసిడెన్షియల్ యూనిట్ల అమ్మకాలు ముంబై మహానగరంలో బాగా పుంజుకున్నాయి. కరోనా (corona) నుంచి క్రమంగా కోలుకుంటున్న మార్కెట్లు, ఉద్యోగులు మళ్లీ రొటీన్ లైఫ్ లో పడుతూ, తమ కలల సౌధమైన ఇల్లు కట్టుకునే పనిలో పడుతున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ కళకళలాడుతోందని Knight Frank India ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ వివరిస్తున్నారు. పరిశ్రమలకు అవసరమైన భూమి కొనుగోళ్లు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయి. కోవిడ్-19 కారణంగా వర్చువల్ టూర్లు కల్పిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు సేల్స్ ను పెంచుకునేందుకు బాగానే కసరత్తు చేస్తున్నాయి. ఈ కారణంగా సిమెంట్ స్టాక్స్ కు భారీగా డిమాండ్ పెరుగుతోంది.

చవకగా home loan

హోం లోన్ (home loan) వడ్డీ రేట్లు దిగిరావటంతో రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు రావచ్చనే అంచనాలు జోరుగా ఉన్నాయి. ఈఎంఐలు తగ్గడం, పీఎం ఆవాస్ యోజన ( PM Awas Yojana) కింద పలు ప్రయోజనాలు చేకూరటం, అందుబాటులోకి వస్తున్న ఇంటి ధరలు.. వెరసి రియల్ ఎస్టేట్ కు కొత్త డిమాండ్ పుట్టుకొస్తోంది.

టీకా తో పాజిటివ్ మార్కెట్

అతి త్వరలో మనదేశంలో టీకా అందుబాటులోకి రానుండటం అనే వార్త రియల్ ఎస్టేట్ రంగానికి పాజిటివ్ వైబ్స్ తెచ్చింది. సాధారణ జీవితం గడిపేందుకు, మళ్లీ పాత రోజులు వచ్చేందుకు త్వరలో ముహూర్తం ఉందనే సానుకూల దృక్పథంతో మార్కెట్లకు మంచి జోష్ వచ్చింది.

స్టాక్ ఐడియాస్

ఇండిపెండెంట్ మార్కెట్ ఎక్స్ పర్ట్ సందీప్ సభర్వాల్ చెబుతున్న దానిప్రకారం సిమెంట్ కంపెనీల షేర్లు ఇప్పుడు హాట్ కేక్స్. 2020-2023 ఆర్థికసంవత్సరలో ఈ రంగంలో పెట్టే పెట్టుబడులు మంచి లాభాలు ఆర్జించేందుకు సహకరిస్తాయి. మంచి సిమెంట్ కంపెనీల్లో షేర్లు ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో కొన్ని కంపెనీల షేర్లు మార్కెట్లో టాప్ పిక్ గా ఉండగా మిగతావి ఆతరువాతి స్థానంలో ఉన్నాయి. కొన్ని సిమెంట్ కంపెనీల షేర్లు గురువారం నాటికి 1.3-4.2శాతానికి పడిపోయాయి. దీంతో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CII) దీనిపై దర్యాప్తుకు ఆదేశించింది. Large-caps, mid-cap cement segment, value pickల్లో సిమెంట్ కంపెనీ షేప్లు సమీప భవిష్యత్తులో బాగా పుంజుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Published by:Krishna Adithya
First published:

Tags: Business, Stock Market

ఉత్తమ కథలు