ఫిక్సడ్ డిపాజిట్లు (FD) అత్యంత ఎక్కువ వడ్డీ ఇస్తూ, చాలా సురక్షితమైన పొదుపు పథకాలుగా పాపులర్ అయ్యాయి. కానీ మీకు తెలుసా ఇంతకంటే సురక్షితమైన పథకాలు కూడా ఉన్నాయని. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా ఉంటూనే ఎఫ్డీ కంటే ఎక్కువ మొత్తంలో మీకు వడ్డీని అందించేవిగా గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి. వీటికి ప్రభుత్వం వంద శాతం గ్యారెంటీ ఇస్తుంది. ఇలాంటి విషయాలపై మనదేశంలో అత్యధికులకు కనీసం అవగాహన లేకపోగా.. మనదేశంలో 99శాతం మందికి ఎఫ్డీలపై అవగాహన ఉందని సెబీ (SEBI) సర్వేలో తేలింది. వీటిపై కాస్త ఆసక్తి చూపితే చాలు మంచి రిటర్న్స్ కళ్లచూడచ్చు. ఎమర్జెన్సీల కోసం కొంత మొత్తాన్ని ఎఫ్డీలో పొదుపు చేసుకుంటే అత్యవసరాలకు మీరు ఈ ఎఫ్డీని బ్రేక్ చేసి ఉపయోగించుకోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ మొత్తాలను ఎఫ్డీల్లో దాచితే మీకు పెద్దగా లాభాలు రాకపోగా భవిష్యత్ అవసరాలకు ఇది సరిపోకపోవచ్చు. కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ గా ఎఫ్డీని దాచుకుని మిగతా మొత్తాన్ని ఇలాంటి గవర్నమెంట్ బాండ్స్ వంటివాటిలో దాచుకోవటం చాలామంచి ఆప్షన్.
రిస్కు లేకుండా..
ఏమాత్రం రిస్కు లేకుండా ఉండే గవర్నమెంట్ బాండ్స్ ను కొనటం మంచిదని ఆర్థిక నిపుణులు పదేపదే సూచిస్తున్నారు. ప్రభుత్వ బాండ్లను మూడు రకాలుగా సొంతం చేసుకోవచ్చు. గిల్ట్, మనీ మార్కెట్ ఫండ్స్, లో డ్యూరేషన్ ఫండ్స్ రూపంలో ఇవి మ్యూచువల్ ఫండ్స్ (mutual funds) ద్వారా లభిస్తాయి. ఇక రెండవ విధానానికి వస్తే ఎక్స్చేండ్ ల నుంచి డైరెక్ట్ గా వీటిని కొనుగోలు చేయవచ్చు. NSE బాండ్ ఆక్షన్ ప్లాట్ ఫాం ల ద్వారా రీటైల్ ఇన్వెస్టర్లు గవర్నమెంట్ బాండ్స్ కొనవచ్చు. మూడవ ఆప్షన్ బ్రోకర్ ద్వారా వీటిని కొనటం. బ్రోకర్ల ద్వారా కొనటాన్ని ఆర్థిక నిపుణులు ఎంకరేజ్ చేయరు కాబట్టి ఇది చిట్టచివరి ఆప్షన్ గానే ఉంటోంది. కానీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా గవర్నమెంట్ బాండ్స్ కొనటం అన్నిటికంటే ఉత్తమమైన మార్గం, ఇలా చేస్తే మీకు అత్యవసరమైనప్పుడు మెచ్యూరిటీ కంటే ముందే వీటిని మీరు అమ్ముకోవచ్చు. ఇలాంటి గవర్నమెంట్ బాండ్ మ్యూచువల్ ఫండ్ కొనాలంటే మీకు క్రెడిట్ రేటింగ్ (Credit rating) గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. డీఫాల్ట్ రిస్క్ అస్సలు ఉండదు కనుక మీరు వీటిని నిశ్చింతగా కొనచ్చు.
పన్ను పోటు తప్పించుకోవచ్చు
వీటిలో డ్యూరేషన్ రిస్క్, సింపుల్ టర్మ్స్, ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఉన్న పథకాల్లో అయితే రీఇన్వెస్ట్మెంట్ రిస్క్, కాన్సన్ట్రేషన్ ఉంటాయి. కాన్సట్రేషన్ రిస్క్ నుంచి తప్పించుకోవటానికి 4-5 బాండ్లను ఎంపిక చేసి వాటిలో పెట్టుబడి పెడితే సరి. 10 ఏళ్ల కాంస్టంట్ మెచ్యూరిటీ గిల్ట్ ఫండ్స్ ద్వారా ఇంట్రెస్ట్ రేట్ ను లాక్ కూడా చేసే వెసులుబాటు ఉంది. ఇన్ఫ్లేషన్ రేటును బట్టి బాండ్ ఈల్డ్స్ ఉంటాయి. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల సవరణ ప్రభావం వీటిపై పడుతుంది. గిల్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో పొదుపు చేస్తే పన్ను (Tax) పోటు తక్కువ. కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకునేముందు ఆర్థిక నిపుణులను సంప్రదించటం మరవద్దు. అంతేకాదు వీటిపై మీకు పూర్తి అవగాహన లేకపోతే తప్పుడు నిర్ణయాలు తీసుకున్నామని భవిష్యత్తులో బోరుమనాల్సి వస్తుంది. గిల్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బు పెట్టుబడిగా పెడితే రాబడి బాగుండటంతో పాటు అడ్వాన్స్ టాక్స్ ను గతంలోలా చెల్లించాల్సిన అవసరం ఉండదు. హయ్యర్ ట్యాక్స్ బ్రాకెట్స్ లో ఉన్నవారికి ఇది అత్యంత సురక్షితమైన విధానం ఎందుకంటే ఇది డెట్ కేటెగెరీలోకి వస్తుంది.
Published by:Krishna Adithya
First published:January 27, 2021, 11:32 IST