Home /News /business /

WHY HEALTH INSURANCE PREMIUMS ARE ON THE RISE KNOW THESE IMPORTANT DETAILS TO FACE IT NS GH

Health insurance: హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఈ ప్రభావాన్ని ఎలా ఎదుర్కొనాలంటే?

1. ఇన్వెస్ట్‌మెంట్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ (Investment Linked Life Insurance Policies) అనేవి పాలసీ హోల్డర్లకు అధిక రాబడిని అందిస్తాయని కంపెనీలు, ఏజెంట్లు పేర్కొంటారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఎవరైనా వ్యక్తులు లైఫ్ ఇన్సూరెన్స్ (Life Insurance) స్కీమ్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం.. ప్రభుత్వం ప్రమోట్ చేసిన బీమా కంపెనీ పెట్టుబడి పెట్టడానికి సురక్షితమైనదని భావించడమే.  (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

1. ఇన్వెస్ట్‌మెంట్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ (Investment Linked Life Insurance Policies) అనేవి పాలసీ హోల్డర్లకు అధిక రాబడిని అందిస్తాయని కంపెనీలు, ఏజెంట్లు పేర్కొంటారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఎవరైనా వ్యక్తులు లైఫ్ ఇన్సూరెన్స్ (Life Insurance) స్కీమ్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం.. ప్రభుత్వం ప్రమోట్ చేసిన బీమా కంపెనీ పెట్టుబడి పెట్టడానికి సురక్షితమైనదని భావించడమే. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

కరోనా మహమ్మారి వివిధ రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపింది. దేశంలోని ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, సంబంధిత సదుపాయాలపై మాత్రమే కాకుండా రోగులు, వారి కుటుంబాల బడ్జెట్‌పై కూడా విపరీతమైన ఒత్తిడికి కారణమైంది.

కరోనా (Corona) మహమ్మారి వివిధ రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపింది. దేశంలోని ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, సంబంధిత సదుపాయాలపై మాత్రమే కాకుండా రోగులు, వారి కుటుంబాల బడ్జెట్‌పై కూడా విపరీతమైన ఒత్తిడికి కారణమైంది. దీంతో గత రెండు సంవత్సరాలుగా ఇన్సూరెన్స్‌(Insurance) కు ప్రాధాన్యం పెరిగింది. సంక్షోభ సమయాల్లో ఆరోగ్య బీమా కవరేజీ ఎంత క్లిష్టంగా ఉంటుందనేది చాలా మంది భారతీయులు గ్రహించారు. ఈ క్రమంలో 2021-22లో ఆరోగ్య బీమా ప్రీమియంలలో 25 శాతం పెరుగుదల కనిపించింది. మరోవైపు, గత రెండేళ్లలో క్లెయిమ్ భారం పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించిన ద్రవ్యోల్బణం పెరిగింది. దీంతోపాటు ప్రీమియం రేట్లు కూడా పెరిగాయి. యజమానులు తమ ఉద్యోగులు, కుటుంబాలకు అందించే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం ధరలు ఏప్రిల్‌లో చాలా వరకు పెరిగాయి. మార్ష్-మెర్సర్ బెనిఫిట్స్ సర్వే (Marsh-Mercer benefits survey) ప్రకారం, భారతదేశంలో ఎంప్లాయర్స్ అందించే వైద్య ప్రయోజనాల ఖర్చులు 2022లో 15 శాతం పెరుగుతాయని అంచనా.

వ్యక్తిగత ఆరోగ్య పాలసీల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. బీమా సంస్థలు రేట్లను పెంచడానికి IRDAI ఇప్పటికే అంగీకరించింది. గత రెండేళ్లుగా పెరిగిన COVID-19-లింక్డ్ క్లెయిమ్ భారం, ఆరోగ్య సంరక్షణ ద్రవ్యోల్బణం పెరగడం దీనికి ప్రధాన కారణమని పరిశ్రమ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అన్ని వయో-వర్గాల్లో రేట్ల పెంపుదల కనిపించవచ్చు. అయితే వయసు పైబడిన వారు, ఇప్పటికే అనారోగ్యాలు ఎదుర్కొంటున్న సీనియర్ సిటిజన్లపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. వారితో పాటు ఇతర పాలసీదారులు కూడా ఈ ప్రీమియం ధరల పెరుగుదలను ఎలా ఎదుర్కోవాలో అర్థం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
Insurance Policies: ఇన్సూరెన్స్ పాలసీ రద్దయిన తర్వాత దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చా? నిపుణుల సూచనలు ఇవే

ఈ విషయం గురించి మనీకంట్రోల్ ప్రతినిధి ప్రీతి కులకర్ణి, టాటా క్యాపిటల్ వెల్త్ మేనేజ్‌మెంట్ హెడ్ సౌరవ్ బసుతో మాట్లాడారు. బసుకు ఆర్థిక సేవల రంగంలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. టాటా క్యాపిటల్‌లో చేరడానికి ముందు ఆయన సిటీ బ్యాంక్‌లో ఉన్నత స్థాయిలో పనిచేశారు. రిటైల్ వ్యాపారాల విభాగానికి నాయకత్వం వహించారు. ఆయన వెల్లడించిన కీలక విషయాలు తెలుసుకుందాం.
Pension Plan: రిటైర్‌మెంట్ సేవింగ్స్ కోసం బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ.. తాజాగా ప్రారంభించిన ప్రముఖ బ్యాంక్..

‘COVID-19 కారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల క్లెయిమ్‌ల సంఖ్య పెరిగింది. రెండు సంవత్సరాలలో ఆసుపత్రిలో చేరిన వారి శాతం పెరిగింది. హాస్పిటలైజేషన్ ఖర్చు పెరిగింది. భారతదేశంలో వార్షిక ఆరోగ్య సంరక్షణ ద్రవ్యోల్బణం 15 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఇది భారత ప్రభుత్వం అంచనా వేసిన 9 శాతం కంటే చాలా ఎక్కువ. ఆరోగ్య బీమా ప్రీమియంలు పెరగడానికి ఈ రెండు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం బీమా ప్రీమియంలు 15 శాతం పెరగవచ్చు. వయసు పైబడిన కస్టమర్లు లేదా ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించని వారు దీనితో ఎక్కువగా ప్రభావితమవుతారు.’ అని సౌరవ్ తెలిపారు.

‘మీ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ గత 2-3 సంవత్సరాలలో మీ ఆరోగ్య ఖర్చులకు సమానంగా ఉండాలి. మీరు కనీసం రూ. 10-15 లక్షల కవర్‌ తీసుకోవాలి. ప్రీమియం రెన్యువల్ కాస్ట్ భరించలేనివి అయితే, హెల్త్ సంజీవని పాలసీ చూడండి. కో-పే ఆప్షన్‌ ఉన్న ప్లాన్‌లు (మీ ఆసుపత్రి బిల్లులో కొంత భాగాన్ని మీరు చెల్లించాల్సి ఉంటుంది), సబ్ లిమిట్స్ వంటివి పరిశీలించవచ్చు. సీనియర్ సిటిజన్‌లు వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాలసీలను పరిగణించవచ్చు. అయితే, ఇవి సమగ్ర ఎంపికలు కావు. ఒకవేళ యజమానులు ఆప్షన్లు అందిస్తే.. వృద్ధులైన తల్లిదండ్రులతో ఉన్న పిల్లలు టాప్-అప్ కవర్, సెల్ఫ్ ఫండెడ్ పేరెంటల్ కవరేజీ తీసుకోవాలి’ అని సౌరవ్ విశ్లేషించారు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Covid health insurence, Health Insurance, Insurance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు