హోమ్ /వార్తలు /బిజినెస్ /

ఇప్పుడు అందరూ ఈ క్రికెటర్ వెనకే.. ఆ విషయాల్లో తోపు మరి!

ఇప్పుడు అందరూ ఈ క్రికెటర్ వెనకే.. ఆ విషయాల్లో తోపు మరి!

PC : BCCI

PC : BCCI

Hardik Pandya Brand Value | క్రికెటర్లు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించడం వల్ల భారీ మొత్తాన్ని పొందుతూ ఉంటారు. ఇటీవల కాలంలో ఒక క్రికెటర్ బ్రాండ్ వ్యాల్యూ బాగా పెరిగింది. ఆయన ఎవరో.. ఎందుకు ఇప్పుడు బ్రాండ్లు ఆయన వెనక పడుతున్నాయో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Hardik Pandya | హార్దిక్ పాండ్యా పాపులారిటీ గత కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తోంది. హైప్రొఫైల్ టాక్ షోలో వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ఇటీవల ఆసియా కప్ (Asia Cup) మ్యాచ్‌ల వరకు చూస్తే ఈయన లైఫ్ రోలర్ కోస్టర్ మాదిరి తిరిగిందని చెప్పుకోవచ్చు. ఇండియన్ క్రికెట్ (Cricket) టీమ్‌లోకి ఈయన రాకతో ప్రపంచానికి ఒక ఆల్ రౌండర్ దొరికాడని తెలిసింది. జీవితంలో అప్ అండ్ డౌన్స్ సహజమే. ఇందుకు ఈయన కూడా అతీతుడు ఏమీ కాదు. అయినా కూడా ఈయన ప్రాముఖ్యత మసకబారలేదు.

  ఈయన బ్రాండ్ పాపులారిటీ కూడా పెరుగుతూనే వచ్చింది. ప్రస్తుతం ఈయన 15 బ్రాండ్లకు ప్రచారకుడిగా ఉన్నారు. సిన్ డెనిమ్, బోట్, గల్ఫ్ ఆయిల్ ఇండియా, మాన్‌స్టర్ ఎనర్జీ, టాకో బెల్, ఎంఎక్స్ టకాటక్, ఒప్పొ మొబైల్స్ , బ్రిటానియా ఇలా పలు రకాల బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నారు.

  గ్యాస్ సిలిండర్ వాడే వారికి గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఆఫర్లు

  ఇటీవలనే హార్దిక్ పాండ్యా విలన్ బ్రాండ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఇది లైఫ్‌స్టైల్ బ్రాండ్. అలాగే ఈయన మరో ఐదు బ్రండ్లతో కూడా ఒప్పందం చేసుకున్నారు. ఎందుకు ఈయన వెంటే బ్రాండ్లు పడుతున్నాయో ఒకసారి తెలుసుకుందాం.

  హార్దిక్ పాండ్యాకు సోషల్ మీడియాలో పాపులారిటీ ఎక్కువగా ఉంది. బ్రాండ్లకు కావాల్సింది ఇదే. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కలిపి చూస్తే ఈయనకు 41 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనే 22 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉండటం విశేషం. సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఎక్కువగా ఉన్న భారత క్రికెటర్ల విషయానికి వస్తే ఈయన మూడో స్థానంలో ఉన్నారు. కోహ్లి, రోహిత్ శర్మ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

  భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి రూ. 4 వేలు ఢమాల్..

  అంతేకాకుండా ఈయన ఇమేజ్ గ్రాఫ్ కూడా బాగా పెరిగింది. ఆడంబరమైన యువ క్రికెటర్ స్థాయి నుంచి ఇప్పుడు కుటుంబ మనిషి వరకు ఆయన గమనం అనేది బ్రాండ్‌లకు సరైన ఎంపికగా కనిపిస్తోంది. అంతేకాకుండా గుజరాత్ టైటన్స్ టీమ్‌ను నడిపించిన తీరు ఈయనను నమ్మకమైన నాయకుడిగా నిలిపాయి. ఇంకా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడంలో కూడా హార్డిక్ పాండ్యా తన మార్క్ చూపించారు. ఆయన పాపులారిటీని కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి రోజుకు దాదాపు రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా బ్రాండ్ వ్యాల్యూలో విరాట్ కోహ్లిని మించిన వారు లేరు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Asia Cup 2022, Cricket, Hardik Pandya, Rohit sharma, Virat kohli

  ఉత్తమ కథలు