హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Coins: బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారా..? అయితే.. బెస్ట్ ఆప్షన్ ఇదే.. ఓ లుక్కేయండి

Gold Coins: బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారా..? అయితే.. బెస్ట్ ఆప్షన్ ఇదే.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలా మంది భారతీయులకు గోల్డ్‌, లాంగ్‌ టర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్. కానీ ఎలాంటి రూపంలో బంగారం కొనుగోలు చేస్తున్నామనేది తెలుసుకోవాలి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియాలో బంగారం (Gold) అనేది ఒక విలువైన ఇన్వెస్ట్‌మెంట్ (Investment) అలంకరణ వస్తువుగానే ఉండే గోల్డ్, ఇప్పుడు మంచి లాభాలను ఆర్జించే పెట్టుబడి మార్గంగా నిలుస్తోంది. చాలా మంది భారతీయులకు గోల్డ్‌, లాంగ్‌ టర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్. కానీ ఎలాంటి రూపంలో బంగారం కొనుగోలు చేస్తున్నామనేది తెలుసుకోవాలి. బంగారు ఆభరణాలు లేదా నాణేలు, కడ్డీల రూపంలో ఫిజికల్‌ గోల్డ్‌ లభిస్తుంది. వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో డిజిటల్‌ గోల్డ్‌ను (Digital Gold) కూడా కొనుగోలు చేయవచ్చు. అయితే కేవలం బంగారం కొనాలనే సెంటిమెంట్‌కు కట్టుబడకుండా.. తిరిగి బంగారాన్ని విక్రయించేటప్పుడు నష్టపోకుండా చూసుకోవాలి. ఇలాంటి నష్టాలకు దూరంగా ఉండాలంటే, గోల్డ్‌ కాయిన్లు ఇన్వెస్ట్‌మెంట్‌కు బెటర్‌ ఆప్షన్‌ అని నిపుణులు సూచిస్తున్నారు.

హాల్‌మార్క్ బంగారమే కొనాలి

హాల్‌మార్క్‌తో కూడిన స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం అనేది దీర్ఘకాలికంగా బంగారంలో పెట్టుబడి పెట్టగల మార్గాలలో ఒకటి. హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛత, సున్నితత్వాన్ని గుర్తించే పద్ధతిని సూచిస్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హాల్‌మార్కింగ్‌ చేస్తుంది. భారతదేశంలోని చాలా విక్రయ సంస్థలు తమ ప్రొడక్ట్‌ను హాల్‌మార్క్ చేయవు. కాబట్టి హాల్‌మార్క్ చేసిన బంగారాన్ని విక్రయించే సంస్థలనే సెలక్ట్‌ చేసుకోవాలి.

Digital Gold: ధంతేరాస్ రోజు డిజిటల్ గోల్డ్‌ కొంటారా? స్వచ్ఛమైన బంగారం అందించే బెస్ట్‌ యాప్స్, వెబ్‌సైట్స్ ఇవే

కాయిన్స్ ఎందుకు బెస్ట్?

బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినప్పుడు, బంగారానికి మాత్రమే కాకుండా ఆభరణాల డిజైన్‌, తయారీకి కూడా ధర చెల్లించాలి. బంగారాన్ని ఆభరణంగా మార్చడానికి మేకింగ్ ఛార్జీలు వసూలు చేస్తారు. ఇది అదనపు ఖర్చు. దీన్ని తిరిగి విక్రయించే సమయంలో బంగారం విలువకు మాత్రమే నగదు పొందుతారు. ఛార్జీలు లేదా డిజైన్ ఖర్చులు వదులుకోవాలి. మేకింగ్ ఛార్జీలు కేవలం బంగారు ఆభరణాలకే కాదు, అన్ని విలువల బంగారు నాణేలకు కూడా వర్తిస్తాయి. నాణేల విషయంలో మేకింగ్‌ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. ఆభరణాన్ని కొనుగోలు చేయడంతో పోల్చినప్పుడు ఓవర్‌హెడ్స్ ధర తక్కువగా ఉంటుంది. అందుకే సెక్యూరిటీ, ష్యూరిటీ కోసం నాణేలు కొనుగోలు చేయడం మంచిదని బంగారం, వజ్రాభరణాల వ్యాపార సంస్థ, పోప్లీ గ్రూప్ డైరెక్టర్ రాజీవ్ పోప్లీ మనీకంట్రోల్‌తో చెప్పారు.

నాణేలకూ హాల్‌మార్క్‌

గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ కొనుగోలు చేస్తే ఇతర అదనపు ఛార్జీలు తగ్గుతాయి. బంగారం మార్కెట్ ధర తెలిస్తే.. విక్రయించే సమయంలో కచ్చితంగా ఎంతకు అమ్మవచ్చో అంచనా వేయవచ్చు. నాణేలు 0.5 gm లేదా 1 gm వంటి చిన్న విలువలలో అందుబాటులో ఉన్నాయి. పెద్ద 100 gm లేదా 1,000 gm బార్‌లను కూడా కొనుగోలు చేయవచ్చు. నాణేలు, బార్‌లు కూడా హాల్‌మార్క్, స్టాంప్‌తో ఉంటాయి. కొనుగోలు చేసే ముందు తనిఖీ చేయాలి.

స్వచ్ఛత ముఖ్యం

స్వచ్ఛత స్థాయి కూడా ధరపై ప్రభావం చూపుతుంది. స్వచ్ఛతను కారట్ ద్వారా కొలుస్తారు. 995, 999, సూపర్ రిఫైన్డ్ 9,999 అనే మూడు ప్రాధాన్య స్థాయిలు ఉన్నాయని పోప్లీ వివరించారు. ఎక్కువ స్వచ్ఛతకు అధిక వ్యయం కావచ్చు. కొన్నిసార్లు బంగారు నాణేలు లేదా ఆభరణాలను కరిగించి కొత్త ఆభరణాన్ని తయారు చేసినప్పుడు, 22k హాల్‌మార్క్ ఉన్న ముక్క తక్కువ స్వచ్ఛతకు కరిగిపోయే అవకాశం ఉందని కపాడియా హెచ్చరించారు.

తెలుసుకోవాల్సిన విషయాలు

గోల్డ్ కాయిన్స్ కొనాలని భావించేవారు ముందుగా నాణెం మార్కెట్ ధరను తెలుసుకోవాలి. ఉదాహరణకు అక్టోబర్ 12న 99.9% స్వచ్ఛత కలిగిన 24K బంగారం మార్కెట్ ధర 10 గ్రాములకు రూ.52,230. అయితే 1 gm నాణెం ధర కనీసం 10%-15% ఎక్కువగా ఉంది. ఎక్కడ కొనుగోలు చేశారనే దానిపై ఆధారపడి 10 gm నాణెం ధర కనీసం 6%-1 5% ఎక్కువగా ఉంటుంది.

నాణేలు విభిన్న డిజైన్లతో వస్తాయి. సంక్లిష్టమైన డిజైన్‌ ఉన్న వాటితో అధిక మేకింగ్ ఖర్చు ఉంటుందని స్వతంత్ర జ్యువెలరీ డిజైనర్, డిజైన్ జ్యువెల్స్ వ్యవస్థాపకురాలు నేహా జెస్రానీ కపాడియా మనీకంట్రోల్‌తో చెప్పారు. అటువంటి నాణేల ద్వారా బంగారంపై సాధారణ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు, వెతుకుతున్న డినామినేషన్‌కు సంబంధించిన వివిధ ధరలను తెలుసుకోవాలి.

First published:

Tags: Gold, Gold coins, Investments

ఉత్తమ కథలు