65 లారీల బంగారం కొన్నదెవరు? ఒక్కసారిగా ఎందుకు కొన్నారు?

Gold Business : చేతికి ఓ ఉంగరమో, మెడలో ఓ గోల్డ్ చైనో ఉందంటే చాలు... ఆ ఆకర్షణే వేరు. అవి కూడా లేనివారు మన దేశంలో కోట్ల మంది ఉన్నారు. అలాంటిది టన్నుల కొద్దీ బంగారాన్ని కొంటున్నదెవరో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: February 17, 2019, 8:19 AM IST
65 లారీల బంగారం కొన్నదెవరు? ఒక్కసారిగా ఎందుకు కొన్నారు?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఈమధ్య ప్రపంచ దేశాల బ్యాంకులు తమ దగ్గర ఉన్న డబ్బుతో బంగారం బాగా కొంటున్నాయి. ఇందుకు కొన్ని కారణాలున్నాయి. అప్పుల వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేలా ఉంది. వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి... ప్రస్తుతం అమెరికా ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అమెరికాకూ చైనాకూ పడట్లేదు. యూరప్‌లో బ్రెగ్జిట్ సమస్య తీవ్రమవుతోంది. ఈ పరిస్థితులన్నీ కలిసి... త్వరలోనే మరో ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని సృష్టించే ప్రమాదం ఉంది. అందుకే ప్రపంచ బ్యాంకులు 2018లో 65 లారీలలో పట్టేంత బంగారం కొన్నాయి. లెక్కల్లో చెప్పాలంటే... 651 టన్నుల బంగారం కొనేశాయి. 2017లో కొనుగోళ్లతో పోల్చితే... అది 74 శాతం ఎక్కువ. 1971లో అప్పటి అమెరికా అధ్యక్షుడు గోల్డ్‌ స్టాండర్డ్‌ రద్దు చేయడంతో ఆ సంవత్సరం బంగారం కొనుగోళ్లు భారీగా జరిగాయి. ఆ తర్వాత ఒకే సంవత్సరంలో ఎక్కువగా బంగారం కొన్నది 2018లోనే అంటే... ఏ రేంజ్‌లో బ్యాంకులు కొంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.

గతేడాది రష్యా కేంద్ర బ్యాంకు అత్యధికంగా 274 టన్నుల గోల్డ్ కొనేసింది. ఆ తర్వాత టర్కీ 51.5 టన్నులు, కజకిస్తాన్‌ 50 టన్నులు కొన్నాయి. మన ఆర్‌బీఐ 40 టన్నులు కొంది. అందువల్ల ఆర్బీఐ దగ్గర 598 టన్నుల బంగారం నిల్వలున్నాయి.

gold, central banks, gold reserves, gold buying, gold price, gold rate, gold hike, pure gold, total gold in rbi, rbi gold, బంగారం నిల్వలు, బంగారం ధర, బంగారం రేటు, బంగారం కొనుగోళ్లు
ప్రతీకాత్మక చిత్రం


ఆర్థిక మాంద్యానికీ, బంగారానికీ లింక్ ఏంటి ? : ఏ ఆర్థిక వ్యవస్థైనా నిలబడాలంటే, బంగారం నిల్వలే దిక్కు. ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. బంగారం ధర మరింత ఎక్కువవుతోంది. 2008లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు సరైన బంగారం నిల్వలు లేని దేశాలన్నీ నానా ఇబ్బందులు పడ్డాయి. ఇప్పుడు ముందుగానే జాగ్రత్త పడుతున్నాయి.

పెరుగుతున్న బంగారం ధర : మూడేళ్లుగా 10 గ్రాముల బంగారం ధర రూ.30,000- 32,500 మధ్య ఉంది. ఈమధ్య మాత్రం 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రూ.34,000 దాటింది. ఆ తర్వాత హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఈ సంవత్సరం ధర మరింత పెరుగుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు.

ప్రపంచంలో ఎక్కువ బంగారం నిల్వలు ఉన్నది అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్ దగ్గరే. అక్కడ 800 లారీల్లో పట్టేంత బంగారం ఉంది. మొత్తం 8,133 టన్నుల బంగారం నిల్వలున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో జర్మనీ, ఇటలీ దేశాల కేంద్ర బ్యాంకులు ఉన్నాయి. భారత దేశం పదో స్థానంలో ఉంది. ఐతే మన దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండటం వల్ల మనం బంగారం నిల్వలపై ఎక్కువగా దృష్టి సారించట్లేదు.

 Video : కర్ణాటకలోని ఈ ఏనుగుల సంరక్షణా కేంద్రాన్ని చూసి తీరాల్సిందే.
First published: February 17, 2019, 8:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading