హోమ్ /వార్తలు /బిజినెస్ /

Real Estate: కరోనా కాలంలో పుంజుకున్న రియల్ ఎస్టేట్.. కారణాలివే..

Real Estate: కరోనా కాలంలో పుంజుకున్న రియల్ ఎస్టేట్.. కారణాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా మహమ్మారి అనంతరం పరిస్థితులు మారాయి. ఉపాధి విషయంలో వ్యవసాయ రంగం తర్వాత రెండో స్థానాన్ని రియల్ ఎస్టేట్ రంగం ఆక్రమించింది. ప్రజలు సొంతింటి కొనుగోళ్లకు ప్రాముఖ్యతనివ్వడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడూ వ్యవసాయమే అగ్రస్థానంలో ఉంటూ వచ్చింది. సేవా రంగం పుంజుకుంటున్నప్పటికీ అగ్రికల్చర్ సెక్టారే ముందంజలో ఉంది. అయితే మహమ్మారి అనంతరం పరిస్థితులు మారాయి. ఉపాధి విషయంలో వ్యవసాయ రంగం తర్వాత రెండో స్థానాన్ని రియల్ ఎస్టేట్ రంగం ఆక్రమించింది. ఇందుకు కారణం లేకపోలేదు. మహమ్మారి కాలంలో ప్రజలు సొంతింటి కొనుగోళ్లకు ప్రాముఖ్యతనిస్తున్నారు. ఫలితంగా రియల్ ఎస్టేట్ సెక్టార్‌కు అధిక డిమాండ్ ఏర్పడింది. కరోనా ప్రభావంతో అద్దె ఇంట్లో ఎదుర్కొనే అనిశ్చితి కంటే యాజమాన్యపు హక్కు ఉండే సొంతిళ్లకే ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతోపాటు ఇంటి వద్దే సురక్షితంగా ఉండాలి అనే భావన సైతం చాలామందిలో పెరిగిందని స్టెర్లింగ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ ఎండీ శంకర్ శాస్త్రి తెలిపారు. ఈ రంగం 250 అనుబంధ పరిశ్రమలతో అనుసంధానమైన ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో దీనికి దాదాపు 6 నుంచి 7 శాతం వాటా ఉండగా.. 2025 నాటికి 13 శాతానికి చేరుకుంటుందని శంకర్ వివరించారు. అతిపెద్ద సంపద సృష్టికర్తల్లో రియల్ ఎస్టేట్ రంగం ఒకటని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం గృహనిర్మాణాదారులను, గృహ రంగాన్ని ప్రోత్సహించడానికి కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టింది. వీటిపై శంకర్ శాస్త్రి అనేక విషయాలను పంచుకున్నారు.

Business Ideas: కరోనా వేళ డిమాండ్ పెరుగుతున్న వ్యాపారం ఇదే...లక్షల్లో ఆదాయం మీ సొంతం

హోంలోన్లపై తక్కువ వడ్డీలు..

ప్రస్తుతం బ్యాంకులు అందించే హోంలోన్(Home Loan) వడ్డీ రేట్లు దశాబ్ద కాలంలోనే అత్యల్పంగా ఉన్నాయి. గృహ కొనుగోలుదారులకు ఇది పెద్ద ప్రోత్సాహకంగా మారింది. తక్కువ రుణ వడ్డీ రేట్ల వల్ల ఇంటి వ్యయంలో చాలా వరకు తగ్గుతుంది. ఇది మీ సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి అనువైన సమయం. ఆర్బీఐ కూడా గృహ రుణాలు తక్కువ ఖర్చులో ఉండాలని రెపో రేట్లు తగ్గించింది. అలాగే రియల్ ఎస్టేటులో డిమాండ్.. వడ్డీ రేట్ల తీవ్రతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అవి కొనుగోలుదారుల నెలవారీ బడ్జెట్ పై ప్రభావం చూపుతాయి.

సురక్షితమైన, స్పష్టమైన ఆస్తి..

రియల్ ఎస్టేట్ ఎల్లప్పుడూ సురక్షితమైన ఆస్తి వర్గం కింద ఉంటుంది. కోవిడ్-19 తర్వాత ప్రతి ఒక్కరూ ఆరోగ్యం, పరిశుభ్రత, సామాజిక దూరాన్ని పరిగణనలోకి తీసుకొని సొంతింటిని కొనుగోలు చేయాలనుకుంటున్నారు. ఫలితంగా ఇది రెసిడెన్షియల్ రియల్ ఎస్టేటుకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఈ ఏడాది గృహాలకు డిమాండ్ పెరగడానికి భద్రతాపరమైన కారణాలతో పాటు స్టాక్ మార్కెట్లలో అస్థిరత కూడా ఒక కారణం. ఇది రియల్ ఎస్టేటును సురక్షితమైన పెట్టుబడి వర్గంగా మార్చింది.

అద్భుతమైన ఆఫర్లు, ఆకర్షణీయమైన లభ్యత..

ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి ఇది అనువైన సమయమని చెప్పడానికి అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. ప్రాపర్టీ వ్యాల్యూయేషన్ వాస్తవికంగా చూస్తే దిగువ స్థాయిలో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీ తక్కువగా ఉంది. డెవలపర్లు సౌకర్యవంతమైన పేమెంట్ స్కీంలు, ఖర్చు ఆదా ప్రోత్సాహకాలు లాంటి ఇతర ఆఫర్లను కూడా ఇస్తున్నారు. ఇవన్నీ అధిక ధరతో మీరు ఆస్తిని కొనుగోలు చేయలేరని స్పష్టం చేస్తున్నాయి. డెవలపర్లు ఈ ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. వీటి ద్వారా మీ సేవింగ్స్ భద్రంగా ఉంటాయి.

రెడీ మూవ్-ఇన్ ప్రాపర్టీలకు ప్రాధాన్యత..

మార్కెట్లో రెడీ-టూ-మూవ్(RTM) ప్రాపర్టీలకు అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న గృహాలతో సమానంగా RTM ఆస్తుల ధరలు ఉన్నాయి. గతంలో సరఫరాను పరిమితం చేసేవారు. ఇపుడు పరిస్థితి మారింది. ప్రీమియం ప్రొడక్టుల కోసం చూసే గృహ కొనుగోలుదారులకు సానుకూల వాతావరణం ఏర్పడింది. విల్లాస్ పై కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇదే సమయంలో సకల సౌకర్యాలున్న ఇండిపెండెంట్ హౌజ్‌ల కోసం చూస్తున్నారు.

ఇళ్లను అప్ గ్రేడ్ చేస్తున్నారు..

కస్టమర్ల ఆకాంక్షలు, వారి జీవనశైలిని అప్ గ్రేడ్ చేయాలనే కోరిక కచ్చితంగా లగ్జరీ గృహాలపై ఆసక్తిని పెంచుతోంది. నిర్దిష్ట ధరలో ఇంటి కోసం చూస్తున్నవారు మల్టీ ఫంక్షనల్ గృహాల కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఇప్పుడే పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారు.

క్యాపిటల్ అప్రిసియేషన్ కారణంగా అధిక డిమాండ్..

ఆకర్షణీయమైన అద్దె, రాబడులు, క్యాపిటల్ అప్రిసియేషన్ లాంటి కారణాలు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలుదారుల ఆసక్తిని పెంచాయి. స్థిరాస్తి విలువ కాలక్రమేణా పెరుగుతూ ఇతర పెట్టుబడులను అధిగమిస్తోంది. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడం మిమ్మల్ని మీ సంపదను కాపాడుకోవడానికి అనుమతిస్తోంది. సంక్షోభం సమయంలో ఇంటి విలువను ఎల్లప్పుడూ అద్భుతమైన స్టాండ్ బైగా మార్చుతోంది.

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సానుకూలంగా అంచనా వేసింది. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో అధిక డిమాండ్ కొనసాగిస్తుందని చెప్పింది. గత ఏడాది అధిక రిస్క్ పెట్టుబడి సాధనాలు అస్థిర ప్రభావాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. అనంతరం రియల్ ఎస్టేట్ రంగం సురక్షితమైన, స్థిరమైన పెట్టుబడి నిరూపించింది.

First published:

Tags: Real estate, Real estate in Hyderabad

ఉత్తమ కథలు