WHY BANKS REJECT HOME CAR PERSONAL LOAN APPLICATION EVEN WHEN CREDIT SCORE IS HIGH HERE IS THE REASON NS GH
Loans: క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉన్నా లోన్ రావట్లేదా? అయితే, ఈ అంశాలపై లుక్కేయండి
ప్రతీకాత్మక చిత్రం
అత్యంత విశ్వసనీయమైన క్రెడిట్ బ్యూరో సంస్థల నుంచి పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌ల ఆఫర్ల వరకు మార్కెట్లో క్రెడిట్ స్కోర్లు కీలకం అయ్యాయి. ఈ క్రెడిట్ స్కోర్‌తో ప్రయోజనం ఏంటి? రుణగ్రహీతలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలు తెలుసుకోవడం అవసరం.
అత్యంత విశ్వసనీయమైన క్రెడిట్ బ్యూరో సంస్థల నుంచి పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌ల ఆఫర్ల వరకు మార్కెట్లో క్రెడిట్ స్కోర్లు కీలకం అయ్యాయి. ఈ క్రెడిట్ స్కోర్‌తో ప్రయోజనం ఏంటి? రుణగ్రహీతలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలు తెలుసుకోవడం అవసరం. క్రెడిట్ స్కోర్, అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఆయా సంస్థలు రుణాలు మంజూరు చేస్తాయి. రుణాల కోసం దరఖాస్తు చేసిన సమయంలో ఆయా సంస్థలు వివిధ పద్ధతుల్లో క్రెడిట్ స్కోర్ల(Credit Scores)ను లెక్కిస్తాయి. బ్యాంకులను మొండి బకాయిల బారి నుంచి తప్పించడానికి వినియోగదారుల వివరాలను రిస్క్ మేనేజర్లు అంచనావేస్తారు. రిస్క్ మేనేజర్లు అందించిన వివరాల మేరకు రుణాలు ఇవ్వాలా? లేదా? అనే అంశాన్ని బ్యాంకులు నిర్ణయిస్తాయి. జనరల్ స్టేట్మెంట్లో పేర్కొనని అంశాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. థ్రెషోల్డ్ నుంచి కొంచెం దూరంగా ఉన్నప్పటికీ దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది. రుణాల మంజూరు సమయంలో పరిశీలించే అంశాలను తెలుసుకోండి..
ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అండ్ మంత్లీ ఇన్కమ్
స్థిరంగా ఉద్యోగం చేయడం, లోన్ రీపేమెంట్(Loan Repayment) నిబంధనలను కవర్ చేయడానికి అవసరమైన ఆదాయాన్ని సంపాదించడం వంటివి రుణాల మంజూరు విషయంలో పరిశీలించే ప్రధాన అంశాలు. రుణం కోసం చేసుకొనే దరఖాస్తులో కెరీర్ , ఫైనాన్స్‌కు సంబంధించిన అనేక ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ క్రెడిట్ స్కోర్‌ను లలెక్కించడానికి ఉపయోగపడుతాయి. కట్-ఆఫ్ సక్రమంగానే ఉంటుంది. కానీ ప్రమాదకరంగా తోచే అంశాలు ఉంటే ఆటోమేటిక్‌గా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది.
ముందస్తు సమాచారం
క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు రుణ దరఖాస్తుదారుకు చెందిన సాంప్రదాయ సమాచారాన్ని పరిగణించవు. కానీ బ్యాంకులు పరిగణించవచ్చు. గతంలో జరిగిన తప్పిదాల నుంచి బయటపడటం కష్టం. ఎప్పుడైనా దివాళా తతీసిఉన్నా, సక్రమంగా చెల్లింపులు జరపకున్నా ఆర్థిక సంస్థల రికార్డుల్లో నమోదై ఉంటుంది. అది మీ రుణాల మంజూరుపై ప్రభావం చూపుతుంది. అందుకే రుణాలు, ఇతర బ్యాంకు చెల్లింపులను ఎప్పటికప్పుడు సక్రమంగా చెల్లించేలా ప్రణాళికలు ఉండాలి.
తరచుగా రుణాలు తీసుకునే సమస్య
ఒకే సమయంలో లోన్ కోసం చాలా బ్యాంకులను సంప్రదించినా, ఏదైనా కారణంతో దరఖాస్తులలో ఒకటి తిరస్కరణకు గురైనా అది ప్రభావం చూపుతుంది. పరస్పరం ప్రయోజనం పొందుతున్నందున బ్యాంకు నిబంధనలకు కట్టుబడి ఉండటం ఎల్లప్పుడూ ఉత్తమం. మీ అభ్యర్థనను అంగీకరించాలా? లేదా? అనేది రిలేషన్షిప్ మేనేజర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అదే విధంగా మీరు ఓ ఆర్థిక సంస్థ నుంచి ఇప్పటికే రుణం పొంది, కొత్త రుణం కోసం దరఖాస్తు చేస్తే, అధిక పరపతి కారణంగా ఆమోదం పొందే అవకాశాలు తగ్గిపోతాయి. మీరు ఇప్పటికే రుణ ఖాతాని కలిగి ఉన్నప్పుడు క్రెడిట్ కార్డ్‌లపై రుణాలు పొందే అవకాశాలు కూడా తక్కువ.
బ్యాంక్ పాలసీ
అన్నీ సక్రమంగా ఉన్నా.. రుణం కోసం దరఖాస్తు చేసిన సమయానికి.. ఒక వేళ రుణాలు మంజూరు చేసే పరిమితి సదరు బ్యాంకులో పూర్తయి ఉంటే.. తిరస్కరించడానికి బ్యాంక్ మీ స్కోర్‌ను హేతుబద్ధీకరించవచ్చు. రుణాలకు సంబంధించిన వివరాల కోసం బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల వివరాలను కూడా పపరిశీలించే అవకాశం ఉంది.
CIBIL రిపోర్ట్
ఆయా సెక్షన్ల కింద మంచి స్కోర్, కామెంట్స్ ఉంటే సిబిల్ రిపోర్టును కూడా పరిగణిస్తారు. తిరిగి చెల్లించాల్సిన రుణాలను ఆలస్యం చేసినా, చెల్లింపులు ఆపేసినా, పన్నులు చెల్లింపుల్లోనూ జాప్యానికి కారణమైనా సిబిల్ రిపోర్ట్‌పై ప్రభావం ఉంటుంది. రుణాల మంజూరు అంశంలో సిబిల్ రిపోర్ట్ కూడా కీలకం.
కీలకమైన నిష్పత్తులు
ససదరు వ్యక్తి ఆస్తులు చాలా వరకు తాకట్టు లేదా తనఖా పెట్టినా అది మీ రుణభారాన్ని చూపుతుంది. బ్యాంకు భద్రత కోసం మీ ఆస్తిని స్వాధీనం చేసుకొనే అవకాశం లేదని తెలిస్తే.. అన్నీ సక్రమంగా ఉన్నా, దరఖాస్తును బ్యాంకు రిజెక్ట్ చేస్తుంది. సెక్యూర్డ్-టు-సెక్యూర్డ్ లోన్ నిష్పత్తి కూడా రుణాలు మంజూరు చేయడానికి హామీ ఇచ్చేలా అనుకూలంగా ఉండాలి. దరఖాస్తుదారు EMI నుంచి ఆదాయ నిష్పత్తి గురించి తెలుసుకోవాలి, ఇది రుణ దరఖాస్తును అంచనా వేయడంలో కీలకం.
రుణాల మంజూరులో పాటించాల్సిన నిబంధనలు, మార్గదర్శకాలను బ్యాంకులు కఠినంగా అమలు చేస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండటం ఎప్పుడూ మేలు చేస్తుంది. కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డ్ బిల్లులలో క్రెడిట్ స్కోర్లను చేర్చడం కూడా ప్రారంభించాయి. క్రెడిట్ స్కోర్‌ను ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే రుణాలు మంజూరు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.