ప్రజలకు సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం వివిధ రకాల స్కీమ్స్‌ను లాంచ్ చేసింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) వంటివి పాపులర్ అయ్యాయి. ప్రస్తుతం ఇలాంటి స్కీమ్స్ ప్రయోజనాలు విస్తరించే లక్ష్యంతో పెన్షన్ ఫండ్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (PFRDA) వాలంటరీ ఆల్-సిటిజన్స్ మోడల్ కింద NPS సబ్‌స్క్రైబర్‌ల నుంచి కొన్ని వివరాలు సేకరిస్తోంది. NPS సబ్‌స్క్రైబర్‌ల వ్యక్తిగత ప్రొఫైల్, పెట్టుబడి లక్ష్యాలు, ఇతర విషయాలతోపాటు రిస్క్ తీసుకోగల సామర్థ్యం వంటివి అర్థం చేసుకోవడానికి ఓ సర్వేను నిర్వహిస్తోంది. PPF, ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి సెక్యూర్ ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రూమెంట్స్‌ను ఇష్టపడుతున్నారా? లేదా ఈక్విటీ-లింక్డ్ సేవింగ్ స్కీమ్‌లు (ELSS మ్యూచువల్ ఫండ్స్), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) వంటి మార్కెట్-లింక్డ్ ఇన్‌స్ట్రూమెంట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? వంటి ప్రశ్నలకు సమాధానాలు కోరుతోంది.
NPS ఇన్వెస్ట్‌మెంట్స్, ట్యాక్స్ డిడక్షన్స్
NPS సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ Protean eGov Technologies (గతంలో NSDL) పంపిన ఇమెయిల్‌లో.. ‘డియర్ సబ్‌స్క్రైబర్, స్వచ్ఛంద ప్రాతిపదికన ఒక వ్యక్తికి (ప్రైవేట్ రంగం) పెన్షన్ కవరేజీని విస్తరించే లక్ష్యంతో 2009 సంవత్సరంలో NPS ఆల్ సిటిజన్ మోడల్ ప్రవేశపెట్టారు. ఈ విషయంలో PFRDA నిర్వహిస్తున్న చిన్న సర్వేకు కొన్ని నిమిషాలు కేటాయించి ప్రతిస్పందించాలని అభ్యర్థిస్తున్నాం. స్కీమ్‌ను అమలు చేయడంలో, దాని ప్రయోజనాలను మెరుగుపరచడంలో మీ అభిప్రాయం మాకు ముఖ్యం.’ అని పేర్కొంది.
ఉద్దేశాలు తెలియజేయాలి
ఈ సర్వే సబ్‌స్క్రైబర్‌ల ఇన్‌కం సోర్స్(ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగం), ఏ ట్యాక్స్ శ్లాబ్ పరిధిలోకి వస్తారు, విద్యార్హతల వివరాలను కూడా కోరుతోంది. పాత పన్ను విధానంలో లభిస్తున్న ట్యాక్స్ బెనిఫిట్స్ (సెక్షన్ 80C, 80CCD(1B), 80CCD(2) కింద) కోసం సబ్‌స్క్రైబర్‌లు NPSలో పెట్టుబడి పెడుతున్నారా? మంచి రాబడిని పొందడం కోసం? లేదా పదవీ విరమణ సమయంలో ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు అదుకొనే ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అనే అంశాలను తెలుసుకుంటోంది. సబ్‌స్క్రైబర్‌లకు సెక్షన్ 80CCD(1B) కింద రూ.50,000 వరకు లభిస్తున్న ట్యాక్స్ డిడక్షన్ సరిపోతుందా? ఆ లిమిట్‌ను పెంచితే ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని కూడా పెంచుతారా? అనే వివరాలను సేకరిస్తోంది. సబ్‌స్క్రైబర్‌లు దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఎంచుకునే ఇన్‌స్ట్రూమెంట్స్‌కు రేటింగ్ కూడా ఇవ్వాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, PPF, ELSS, Ulips, NPS వంటి వాటికి ప్రాధాన్యం మేరకు రేటింగ్ కేటాయించాలి.
APYలో పెరుగుతున్న మహిళలు, యువకలు వాటా
2021లో PFRDA దాని వాలంటరీ సబ్‌స్క్రైబర్‌ల వివరాలను వెల్లడించింది. అటల్ పెన్షన్ యోజన సబ్‌స్క్రైబర్‌ల(APY)లో దాదాపు 44 శాతం మంది మహిళలు ఉన్నారని తేలింది. ఆల్-సిటిజన్స్ మోడ్ కింద స్త్రీల వాటా 24 శాతం వద్ద చాలా తక్కువగా ఉంది. పురుషులు 76 శాతంతో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. 2016-17లో మహిళా సబ్‌స్క్రైబర్లు APY బేస్‌లో 38 శాతం ఉన్నారు. ఇది వేగవంతమైన వృద్ధిని సూచిస్తుంది. 2022 ఆగస్టు నాటికి APYలో దాదాపు 44.8 శాతం మంది సబ్‌స్క్రైబర్‌లు 18, 25 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఉన్నారు. 2016 మార్చిలో 29.3 శాతంతో పోలిస్తే యువత వాటా వేగంగా పెరిగింది. మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది నమోదు చేసుకున్నారు. 2021లో చేరిన కొత్త సబ్‌స్రైబర్‌ల సంఖ్యలో 17 శాతం మహారాష్ట్ర నుంచే ఉండటం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: National Pension Scheme