హోమ్ /వార్తలు /బిజినెస్ /

RIL AGM 2020 | ఫేస్ బుక్, గూగుల్.. జియోలో ఎందుకు పెట్టుబడి పెడుతున్నాయి?

RIL AGM 2020 | ఫేస్ బుక్, గూగుల్.. జియోలో ఎందుకు పెట్టుబడి పెడుతున్నాయి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Reliance AGM | టెక్ దిగ్గజాలు, ఫేస్ బుక్, గూగుల్.. జియో ప్లాట్‌ఫామ్స్‌లో వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి.

  ఫేస్ బుక్, గూగుల్. రెండూ తమ తమ విభాగాల్లో పెద్ద కంపెనీలు. ఒకదానితోమరొకటి పోటీ పడుతూ ఉంటాయి. అలాంటి కత్తులు దూసుకునే కంపెనీలు రెండూ భారతీయ టెక్ దిగ్గజం రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెట్టాయి. జియో, ఫేస్‌బుక్ మధ్య ఏప్రిల్ 22న డీల్ కుదిరింది. రిలయెన్స్ జియోలో రూ.43,574 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఫేస్‌బుక్ ఒప్పందం కుదుర్చుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటా కోసం ఈ డీల్ కుదుర్చుకుంది. ఈరోజు జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ ఏజీఎం సమావేశంలో గూగుల్ పెట్టుబడుల గురించి ప్రకటించారు ముఖేష్ అంబానీ. టెక్ దిగ్గజం గూగుల్.. జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.33,737 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇది జియో కుదుర్చుకున్న 14వ డీల్.

  ఇలాంటి రెండు దిగ్గజ కంపెనీలు ఇప్పుడు భారత కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. దానికి కారణం భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ మార్కెట్ కావడమే. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న చైనాలో ఈ రెండు కంపెనీలు బ్యాన్‌లో ఉన్నాయి. అలాగే, చైనా అతి తెలివితేటలను అమెరికా, ఇతర ప్రపంచ దేశాలు కూడా తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో కంపెనీలకు టెక్ కంపెనీలకు భారత్ యుద్ధ క్షేత్రంగా మారుతోంది. మరే ఇతర దేశంలో కూడా ఇంత తక్కువ ధరకు డేటా లభించడం లేదు. దీని వల్ల 300 మిలియన్ల నుంచి 400 మిలియన్ల యూజర్లకు ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చారు.

  ఈ కామర్స్, ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ రిటైల్, డెలివరీ, వీడియో కాన్ఫరెన్సింగ్‌లో జియో ఇంకా పూర్తిస్థాయిలో డబ్బు సంపాదించే సంస్థగా రూపాంతరం చెందలేదు. కానీ, ఇందులో రూ.2,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకొచ్చాయి. జియో అనేది టెలికం కంపెనీగా మాత్రమే కాకుండా డబ్బు సంపాదించే టెక్ కంపెనీగా మారుతుందని వారి నమ్మకం.

  ఇండియా డిజిటలైజేషన్‌లో గూగుల్ పెడుతున్న మొదటి పెట్టుబడి అని గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ సంజయ్ గుప్తా తెలిపారు. వచ్చే ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో డిజిటల్ ఎకానమీని వృద్ధి చేసేందుకు దోహదపడుతుందన్నారు. గూగుల్, జియో ప్లాట్ ఫాం సంయుక్తంగా ఎంట్రీ లెవల్, ఆండ్రాయిడ్, ప్లే స్టోర్ ఫీచర్స్‌తో తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ తయారు చేసేందుకు ఒప్పందం కుదర్చకున్నట్టు తెలిపారు. దీని ద్వారా మిలియన్ల మంది భారతీయులు స్మార్ట్ ఫోన్ కలిగి ఉండేందుకు అవకాశం లభిస్తుందన్నారు. టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణల ద్వారా 50 కోట్ల మంది భారతీయులను ఆన్ లైన్లోకి తీసుకురావడానికి అవకాశం లభిస్తుందన్నారు. ఇప్పటికీ భారత్‌లో చాలా మందికి ఇంటర్నెట్ అందుబాటులో లేదని, కొందరు మాత్రమే స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నారని, గూగుల్, జియో ఒప్పందం ద్వారా వారందరికీ ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ చేరువ అవుతుందన్నారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Reliance, Reliance Digital, Reliance Industries, Reliance Jio, Reliance JioMart

  ఉత్తమ కథలు