Joint home loan: సింగిల్ కంటే జాయింట్ హోమ్ లోన్ ఎంతో బెటర్.. ఎందుకో తెలుసా..? 

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా ఇంటి రుణం తీసుకునే విషయంలో చాలామంది సింగిల్ లోన్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. రుణాలు అందించే ముందు బ్యాంకులు క్రెడిట్ స్కోర్, ఆదాయం, ఎంప్లాయిమెంట్, వయసు లాంటి ఎన్నో విషయాలను పట్టించుకుంటాయి. ఒకవేళ వీటిలో ఏ ఒక్కటి తగ్గినా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అందుకే హోమ్ లోన్ విషయంలో సింగిల్ కంటే జాయింట్ లోన్ తీసుకోవడం మంచిది.

  • Share this:
సాధారణంగా ఇంటి రుణం తీసుకునే విషయంలో చాలామంది సింగిల్ లోన్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. రుణాలు అందించే ముందు బ్యాంకులు క్రెడిట్ స్కోర్, ఆదాయం, ఎంప్లాయిమెంట్, వయసు లాంటి ఎన్నో విషయాలను పట్టించుకుంటాయి. ఒకవేళ వీటిలో ఏ ఒక్కటి తగ్గినా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అందుకే హోమ్ లోన్ విషయంలో సింగిల్ కంటే జాయింట్ లోన్ తీసుకోవడం మంచిది. మీతో పాటు మీ దగ్గరి వారు అంటే భార్య, కూతురు, కొడుకు వంటివారిని కో అప్లికెంట్లుగా చేర్చుకొని జాయింట్ హోమ్ లోన్ కి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొన్ని బ్యాంకులు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లను కో అప్లికెంట్లుగా ఒప్పుకోవట్లేదు. ఇది చూసి అప్లై చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే.. కో- అప్లికెంట్‌ను చేర్చుకోవడం వల్ల వారి ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది.

లోన్ ఎలిజిబిలిటీ కూడా పెరుగుతుంది. ఇలా ఇద్దరు కలిసి లోన్ తీసుకున్నప్పుడు.. మీకు ఆ లోన్ పై ఎంత బాధ్యత ఉంటుందో, కో- అప్లికెంట్ కి కూడా అంతే ఉంటుంది. అందువల్ల బ్యాంకులు రిస్క్ తక్కువగా ఉంటుందని భావిస్తాయి. కో- అప్లికెంట్ ని చేర్చుకోవడం వల్ల ఎక్కువ మొత్తంలో లోన్ రావడం, ఈఎంఐ లు తక్కువగా ఉండడం వంటి లాభాలు ఉన్నాయి. మీ వయసు ఎక్కువగా ఉంటే లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అదే కో అప్లికెంట్ ని చేర్చితే ఇలా రిజెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సాధారణంగా ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్ రావడం కష్టంగా మారుతుంది. కానీ ఇద్దరిలో ఒకరి క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే మీ రుణం వచ్చే అవకాశాలతో పాటు వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది.

ట్యాక్స్ బెనిఫిట్స్..
ప్రైమరీ అప్లికెంట్, కో- అప్లికెంట్ ఇద్దరూ హోమ్ లోన్ ఈఎంఐ కడుతున్నప్పుడు ట్యాక్స్ బెనెఫిట్స్ పొందవచ్చు. సంవత్సరానికి రూ. రెండు లక్షల చొప్పున ట్యాక్స్ బెనెఫిట్ పొందే వీలుంటుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24బి కింద ఈ మినహాయింపును ఇద్దరూ పొందవచ్చు. దీంతో పాటు 80సి కింద మరో 1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనెఫిట్స్ పొందవచ్చు. అయితే దీనికి ఇద్దరు వ్యక్తులు ఇంటికి యజమానులుగా ఉండాల్సి ఉంటుంది. చాలా సంస్థలు మహిళలకు ప్రత్యేకంగా తక్కువ వడ్డీ రేటుకే రుణాలను అందిస్తున్నాయి. మామూలు వడ్డీ కంటే మహిళలకు 5 బీపీఎస్ పాయింట్లు తక్కువ వడ్డీకి అందిస్తున్నాయి. వారి పేరును కూడా జాయింట్ హోమ్ లోన్‌లో చేర్చుకోవడం వల్ల తక్కువ వడ్డీకి రుణాలు అందుతాయి.
Published by:Veera Babu
First published: