• Home
 • »
 • News
 • »
 • business
 • »
 • WHO IS SCHAUNA CHAUHAN HOW SHE BECOMES SUCCESSFULL BUSINESS WOMAN NK

షానా చౌహాన్... సక్సెస్‌కి చిరునామా...

షానా చౌహాన్ ఫ్యామిలీ (credit - insta - schaunachauhan)

Schauna Chauhan : ఫ్రూటీ, యాపీ ఫిజ్ వంటివి మనం చూస్తూనే ఉన్నాం. మరి వాటి వెనక ఓ సక్సెస్‌ఫుల్ బిజినెస్ వుమన్ ఉన్నారని మనకు తెలియకపోవచ్చు. ఆమె ఎవరో, ఎలా సక్సెస్ అయ్యారో తెలుసుకుందాం.

 • Share this:
  Schauna Chauhan : షానా చౌహాన్ (43) ఇండియాలో మోస్ట్ పవర్‌ఫుల్ బిజినెస్ వుమెన్‌లో ఆమె ఒకరు. పార్లీ ఆగ్రో కంపెనీకి CEO అయిన ఆమె... 2006లో తన తండ్రి నుంచీ కంపెనీ పగ్గాలు తీసుకున్నారు. ఏడాదికి రూ.600 కోట్ల బిజినెస్ చేసే కంపెనీని... రూ.4,200 కోట్ల బిజినెస్ చేసే కంపెనీగా మార్చేశారు. ప్రస్తుతం పార్లీ ఆగ్రోకి 13 చోట్ల ఉత్పాదక యూనిట్లు ఉన్నాయి. ప్యాకేజ్‌డ్ వాటర్, యాప్పీ ఫిజ్ డ్రింక్స్, స్నాక్స్, ఫ్రూటీ ఇలా... ఎన్నో ఉత్పత్తులు. ఏకైక ఐదేళ్ల జహాన్‌కి చౌహాన్... తల్లి కూడా. అసలు ఆమె సక్సెస్ యాత్ర ఎలా మొదలైంది? ఎలా శక్తిమంతమైన మహిళా వ్యాపార వేత్తగా ఎదిగారు? ఆమె సక్సెస్ సీక్రెట్స్ ఏంటి? ఇలాంటి అంశాల్ని తెలుసుకుందాం. తద్వారా కొత్తగా కొత్తగా పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే వారికి ఆమె జీవితం కొంతైనా ఇన్స్‌పిరేషన్ అవ్వొచ్చు.

  షానా చౌహాన్ ఫ్యామిలీ (credit - insta - schaunachauhan)


  2006లో పార్లీ సీఈఓ కాగానే... ఆల్రెడీ తెలిసిన కంపెనీయే కావడంతో చౌహాన్ ఈజీగానే నిలదొక్కుకున్నారు. ఐతే... కంపెనీలో ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో గుర్తించారు. ఆల్రెడీ ఉన్న టీమ్‌లో ఉత్సాహం నింపారు. అలాగే... కొత్తవాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగులను అమితంగా గౌరవిస్తూ... వాళ్ల సలహాలు, సూచనలూ తెలుసుకునేవాళ్లు. కుటుంబ సభ్యులతో కంటే... కంపెనీలో ఉద్యోగులతోనే ఆమె ఎక్కువ సేపు ఉండసాగారు. అందువల్ల కంపెనీలో ఉద్యోగులు కూడా ఆమె పట్ల అంతే గౌరవంతో మెలగసాగారు.

  షానా చౌహాన్ ఫ్యామిలీ (credit - insta - schaunachauhan)


  నిజానికి చౌహాన్ తండ్రికి ముగ్గురు కూతుళ్లు. ముగ్గురిలో పెద్ద కూతురైన చౌహాన్‌కే కంపెనీ బాధ్యతలు అప్పగించాలని ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడాక నిర్ణయం తీసుకున్నారు. ఐతే... ఈ విషయంలో ఆయన రెండో మాట లేకుండా ఒకటే మాటకు కట్టుబడ్డారు. ఫలితంగా చౌహాన్‌పై పెద్ద బాధ్యత పడింది. చౌహాన్ మొదటి చెల్లి అలిషా చౌహాన్... కంపెనీ కోసం ఫిలాంత్రోపీ చేశారు. చిన్న చెల్లి నదియా చౌహాన్... రీసెర్చ్, డెపలప్‌మెంట్, సేల్స్, మార్కెటింగ్ స్ట్రాటజీ, కొత్త మార్కెట్ల అభివృద్ధి వంటివి చూసుకుంటున్నారు. ఇలా ముగ్గురికీ వేర్వేరు బాధ్యతలు అప్పగించిన చౌహాన్ తండ్రి... ఇక వాళ్ల పనుల్లో జోక్యం చేసుకోలేదు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఫలితంగా చౌహాన్ తనను తాను తీర్చిదిద్దుకుంటూ వచ్చారు.

  షానా చౌహాన్ ఫ్యామిలీ (credit - insta - schaunachauhan)


  చౌహాన్ లీడర్‌షిప్‌లో ఫ్రూటీ... మ్యాంగో డ్రింక్స్ సెగ్మెంట్‌లో దూసుకెళ్లింది. పెప్సీ, కోకోకోలా లాంటి MNC బ్రాండ్లు, ఇతరత్రా గట్టి పోటీ ఇచ్చినా... ఆమె ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. మనం ఏం చేస్తున్నాం... ఏం చెయ్యాలి అని ఆలోచించారు. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ కంపెనీని విస్తరిస్తూ పోయారు. ప్రధానంగా వినియోగదారుల రుచులు, టేస్టులు, అభిప్రాయాలకు అనుగుణంగా... తమ ప్రొడక్ట్స్‌లో మార్పులు చెయ్యడంతో... ఆమె విజయం వైపు నడవగలిగారు.

  ఫిజ్ యాడ్ (credit - insta - schaunachauhan)


  నెక్ట్స్ టార్గెట్ ఇదీ : 2022 నాటికి టర్నోవర్‌ను డబుల్ చెయ్యాలని చౌహాన్ టార్గెట్ పెట్టుకున్నారు. అదే సమయంలో తన కొడుకు తనతో రోజూ ఎంతో కొంత సేపు గడిపేలా కూడా ప్లాన్ వేసుకున్నారు. రోజూ చేసే పనుల్లో ప్రతీ దానికీ టైమ్ ఫ్రేమ్ సెట్ చేసుకున్నారు. చౌహాన్ కొడుక్కి కార్ల బొమ్మలంటే చాలా ఇష్టం. ఇది గమనించిన ఆమె... ఆ పిల్లాణ్ని... వీలైనన్ని కార్ల షోరూంలకు తీసుకెళ్తున్నారు. మనకు ఏది ఇష్టమో దాన్నే తల్లిదండ్రులు మనకు దగ్గర చేస్తే... అందులో విజయం సాధిస్తామన్న నమ్మకం ఆమెకు ఉంది. తన తండ్రి చిన్నప్పుడు రెగ్యులర్‌గా తనను కంపెనీ ఫ్యాక్టరీకి తీసుకెళ్లేవారనీ, అందువల్ల తనకు కంపెనీ పనులు, డ్రింక్స్ తయారీ వంటి వాటిపై ఆసక్తి కలిగిందన్న చౌహాన్... తన కొడుకు పెద్దయ్యాక ఆటో మొబైల్ రంగంపై ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.


  Pics : అందాల తార అర్తనా బిను క్యూట్ ఫొటోస్  ఇవి కూడా చదవండి :

  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాబ్డే ప్రమాణస్వీకారం...

  ఒంటరి యువతిపై రేప్... చికెన్ బిర్యానీ ఇచ్చి...

  అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్? నెక్ట్స్ ఏమవుతుంది?

  స్కూళ్లకు సెలవులు ఇవ్వండి... ప్రభుత్వానికి పేరెంట్స్ విజ్ఞప్తి

  నేడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాబ్డే ప్రమాణం... ఇవీ కీలక అంశాలు
  Published by:Krishna Kumar N
  First published: