ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి పెళ్లి నిశ్చయమైన విషయం అందరికీ తెలిసిందే. విరెన్ మర్చెంట్, శైల దంపతుల కూతురైన రాధికా మర్చంట్‌ను (Radhika Merchant) అనంత్ అంబానీ (Anant Ambani) పెళ్లిచేసుకోబోతున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ రోకా వేడుక (నిశ్చితార్థం) రాజస్తాన్‌లోని నథ్‌ద్వారాలో శ్రీనాథ్‌జీ ఆలయంలో ఘనంగా జరిగింది. అనంత్ అంబానీ వివాహం చేసుకోబోతున్న రాధికా మర్చంట్ ఇప్పటికే పాపులర్ అయ్యారు. ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా వివాహ వేడుకలో రాధికా మర్చంట్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు నిశ్చితార్థం జరగడంతో రాధికా మర్చంట్ ఎవరు అని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు నెటిజన్లు.
ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈఓ విరెన్ మర్చంట్, శైలా మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్. ఆమె ముకేశ్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య. రాధికాకు అనంత్‌తో చాలా కాలంగా స్నేహం ఉంది. 24 ఏళ్ల రాధికా శ్రీ నిభా ఆర్ట్స్ నుంచి భరతనాట్యంలో శిక్షణ పొందారు. రాధికా మర్చంట్ తన పాఠశాల విద్యను ముంబైలోని కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్, ఎకోల్ మొండియాల్ వరల్డ్ స్కూల్‌లో పూర్తి చేశారు. అనంతరం న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పాలిటిక్స్, ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
Anant Ambani: రాధికా మర్చంట్‌ను పెళ్లిచేసుకోనున్న అనంత్ అంబానీ
2017లో రాధికా మర్చంట్ ఇస్ప్రవా టీమ్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగంలో చేరారు. ఆమెకు చదవడం, ట్రెక్కింగ్, ఈత కొట్టడం చాలా ఇష్టం. అదే విధంగా రాధికా కాఫీని ఎక్కువగా ఇష్టపడుతారు. ప్రస్తుతం ఆమె కొన్ని ఎన్జీవోలతో కలిసి సేవలు అందిస్తున్నారు. తండ్రి కంపెనీ తరఫున సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. 2018లో అనంత్, రాధికా మర్చంట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ జంట ఫోటోలో మ్యాచింగ్ గ్రీన్ దుస్తులతో కనిపించింది. ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ వివాహ వేడుకలకు అంబానీ కుటుంబంతో కలిసి రాధికా మర్చంట్ హాజరయ్యారు.
Anant Ambani: ఘనంగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ నిశ్చితార్థం
రాధికా మర్చంట్‌కు చిన్న వయసు నుంచే శాస్త్రీయ నృత్యం అంటే ఇష్టం. ప్రముఖ డ్యాన్సర్ భావనా థాకర్ వద్ద ఆమె భరతనాట్యంలో శిక్షణ కూడా తీసుకున్నారు. ఇటీవలే రాధికా మర్చంట్ భరతనాట్యం శిక్షణ పూర్తి చేసుకున్నారు. దీంతో అంబానీ కుటుంబం ఆమె కోసం ఘనంగా అరంగేట్రం కార్యక్రమం నిర్వహించింది. జూన్ 5న ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అట్టహాసంగా కార్యక్రమం జరిగింది.
దేశవ్యాప్తంగా పలు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల సమక్షంలో రాధిక చేసిన భరతనాట్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ వేడుకకు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. రాధికా మర్చంట్ భరతనాట్యం వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో రాధికా మర్చంట్ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆమె గురించి అందరికీ పరిచయమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anant Ambani and Radhika Merchant Wedding, Mukesh Ambani, Nita Ambani, Radhika Merchant