Andy Jassy: అమెజాన్‌ కొత్త సీఈవో ఆండీ జెస్సీ గురించి మీకు తెలుసా? 

Andy Jassy: అమెజాన్‌ కొత్త సీఈవో ఆండీ జెస్సీ గురించి మీకు తెలుసా?

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్.. సంస్థ సీఈవో బాధ్యతల నుంచి వైదొలిగారు. ఆ స్థానంలో కొత్తగా ఆండీ జాసీ నియమితులయ్యారు. అమెజాన్‌ లాంటి దిగ్గజ టెక్‌ కంపెనీకి సీఈవో అయ్యారు అంటే.. అతనిలో ఏదో స్పెషాలిటీ ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఏంటా ప్రత్యేకత? వంటి వివరాలు..

  • Share this:
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్.. సంస్థ సీఈవో బాధ్యతల నుంచి వైదొలిగారు. ఆ స్థానంలో కొత్తగా ఆండీ జాసీ నియమితులయ్యారు. అమెజాన్‌ లాంటి దిగ్గజ టెక్‌ కంపెనీకి సీఈవో అయ్యారు అంటే.. అతనిలో ఏదో స్పెషాలిటీ ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఏంటా ప్రత్యేకత? జెఫ్‌ బెజోస్‌ తర్వాత ఆ స్థానానికి ఆండీ జాసీని ఎందుకు ఎంచుకున్నారు? అతని గురించి వాళ్ల ఆఫీసులో ఏమంటున్నారు? వంటి వివరాలు..

ఆండీ జాసీ 1997లో అమెజాన్‌లో ఉద్యోగిగా చేరారు. సీఈవో కాకముందు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌కు చీఫ్‌గా విధులు నిర్వర్తించారు. ఆయన ఉద్యోగిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు తోటి ఉద్యోగులతో చాలా కలుపుగోలుగా ఉంటారని చెబుతుంటారు. ఇదే సమయంలో జెఫ్‌ బెజోస్‌లా విభిన్నంగా ఆలోచిస్తారని కూడా చెబుతున్నారు. అలాగే అమెజాన్‌ ఎప్పటి నుంచో నమ్మి ఆచరిస్తున్న ‘వినియోగదారుడు ముందు, వేగంగా ఆలోచించి నిర్ణయం తీసుకో, పొదుపుగా ఉండు’ అనే నియమాన్ని పాటిస్తుంటారట. అమెజాన్‌ మార్గదర్శకాలను రూపొందించే సమయంలో బెజోస్‌.. ఆండీ జాసీ, ఇతర ప్రతినిధులతో కలసి పని చేశారట.

అమెజాన్‌ మ్యూజిక్‌ సర్వీసెస్‌ను తీసుకొచ్చిన కొత్తలో జాసీ ఆ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండేవారు. ఆ క్రమంలో తన టీమ్‌లో కాంపిటేటివ్‌నెస్‌ను పెంచే దిశగా చిన్న చిన్న గేమ్స్‌ ఆడించేవారు. దీంతోపాటు జాసీ అమెజాన్‌ డైలీ ఆపరేషన్స్‌ ఎక్కువగా యాక్టివ్‌ ఉండేవారు. ప్రెస్‌ రిలీజ్‌ల ఎడిటింగ్‌, మార్కెటింగ్‌ మెటీరియల్ష్‌ తయారీ లాంటి పనులు కూడా చూసేవారు. వస్తువుల ధరలు కూడా నిర్ణయించడం, అమెజాన్‌ ట్విటర్‌ ఖాతాను మెయింటైన్‌ చేయడం లాంటివి కూడా చేసేవారు జాసీ. ఇంకొందరైతే జాసీని ఏదైనా విషయంలో ఒప్పించడం అంత సులభం కాదని చెబుతున్నారు. దాని కోసం వారాలు, నెలల తరబడి పని చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసుకుంటున్నారు.

కొత్త సీఈవోగా ఆండీ జాసీ ముందు చాలా సవాళ్లే ఉన్నాయి. ఆయన ముందు ఉన్న తక్షణ లక్ష్యం యూరోపియన్‌ ఎంక్వైరీస్‌ను ఎదుర్కోవడం. స్టెల్లార్‌ డేటాను వినియోగించారంటూ అమెజాన్‌ మీద యూరోపియన్‌ ఎంక్వైరీస్‌ విచారణ చేపట్టనుంది. దీంతోపాటు యూఎస్‌ ప్రభుత్వం చెప్పినట్లుగా అమెజాన్‌ రిటైల్‌ వింగ్‌ నుంచి లాజిస్టిక్స్‌ వింగ్‌ను వేరు చేయాలి. ఇది కాకుండా కొలంబియా డిస్ట్రిక్‌ వేసిన యాంటీ ట్రస్ట్‌ లా సూట్‌ను కూడా హ్యాండిల్‌ చేయాలి. ధరలు ఎక్కువ చేసి అమ్ముతున్నారని అమెజాన్‌ మీద కొలంబియా దావా వేసిన విషయం తెలిసిందే. ఇవన్నీ పక్కనపెడితే... అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్స్‌ సంఖ్యను పెంచాల్సి ఉంది. దీని కోసం ఆయనేం చర్యలు చేపడతారో అని అందరూ ఎదురుచూస్తున్నారు.
Published by:Krishna Adithya
First published: