జెఫ్ బెజోస్, ఆయన భార్య... మధ్యలో ఆమె ఎవరో తెలుసా?

లారెన్ సాన్షేతో స్నేహం కాస్తా సాన్నిహిత్య సంబంధంగా మారింది. ఇద్దరూ రహస్యంగా టూర్లకు ప్రైవేట్ విమానాల్లో టూర్లకు వెళ్లారని ఆ మ్యాగజైన్ బయటపెట్టింది. జెఫ్ బెజోస్, లారెన్ సాన్షేల మధ్య ఎఫైర్ మ్యాగజైన్‌లో రావడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి.

news18-telugu
Updated: January 11, 2019, 4:16 PM IST
జెఫ్ బెజోస్, ఆయన భార్య... మధ్యలో ఆమె ఎవరో తెలుసా?
జెఫ్ బెజోస్, ఆయన భార్య... మధ్యలో ఆమె ఎవరో తెలుసా?
news18-telugu
Updated: January 11, 2019, 4:16 PM IST
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన అంశం అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ విడాకుల వ్యవహారమే. జెఫ్ బెజోస్ విడాకులకు అతని గాళ్ ఫ్రెండ్ లారెన్ సాన్షేతో ఎఫైరే కారణమన్న ప్రచారం జరుగుతోంది. లారెన్ సాన్షేతో జెఫ్ బెజోస్‌కు ఎఫైర్ ఉందంటూ నేషనల్ ఎంక్వైరర్ మ్యాగజైన్ ఫోటోలు రిలీజ్ చేయడం పెద్ద దుమారాన్నే రేపింది. ఆ వ్యవహారమే భార్యాభర్తల మధ్య దూరం పెంచి, చిచ్చుపెట్టడానికి కారణమైందని అంతా అనుకుంటున్నారు. అసలు లారెన్ సాన్షే ఎవరు? ఆమెకు జెఫ్ బెజోస్‌తో ఎలా పరిచయమైంది? వీరిద్దరి మధ్య ఎఫైర్ నిజమేనా? అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.

అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ గాళ్ ఫ్రెండ్ లారెన్ సాన్షే ఎవరు?


లారెన్ సాన్షే KCOP-TVలో డెస్క్ అసిస్టెంట్‌గా తన కెరీర్ ప్రారంభించారు. అనేక పదవుల్లో పనిచేశారు. KTVK-TVలో రిపోర్టర్, యాంకర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఫాక్స్ స్పోర్ట్స్ నెట్‌లో చేరారు. ఆమె మీడియా పర్సనాలిటీ, నటి, ప్రొడ్యూసర్, ఎంటర్‌టైన్‌మెంట్ రిపోర్టర్, పైలట్, ఆంట్రప్రెన్యూర్. ఎమ్మీ అవార్డ్ విన్నింగ్ అమెరికన్ న్యూస్ యాంకర్. పలు సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించారు కూడా. 2005లో హాలీవుడ్ ప్రముఖుడు ప్యాట్రిక్ వైట్‌సెల్‌ని పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు ఆమెకు టోనీ గాన్జలెజ్‌‌తో సంబంధాలుండేవి. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. ప్యాట్రిక్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత మరో కొడుకు, కూతురు పుట్టారు. లారెన్ సాన్షే ఏరియల్ ఫిల్మింగ్‌లో సర్టిఫైడ్ హెలికాప్టర్ పైలట్. సొంతగా ఏరియల్ ఫిల్మ్ అండ్ ప్రొడక్షన్ కంపెనీ ఏర్పాటు చేశారు.

లారెన్ సాన్షేతో జెఫ్ బెజోస్‌కు ఎఫైర్ ఎలా మొదలైంది?


అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్‌కు బ్లూ ఆరిజన్ పేరుతో మరో కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఏరియల్ ఫిల్మ్ షూటింగ్ కోసం లారెన్ సాన్షేకు కాంట్రాక్ట్ ఇఛ్చారు. అప్పుడే లారెన్ సాన్షేతో జెఫ్ బెజోస్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారింది. సాన్షే భర్త పాట్రిక్ కూడా జెఫ్ బెజోస్‌కు స్నేహితుడే. అందరూ పార్టీలు చేసుకునేవాళ్లు. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా హాలిడేలకు వెళ్లేవాళ్లు. అయితే లారెన్ సాన్షేతో స్నేహం కాస్తా సాన్నిహిత్య సంబంధంగా మారింది. ఇద్దరూ రహస్యంగా టూర్లకు ప్రైవేట్ విమానాల్లో టూర్లకు వెళ్లారని ఆ మ్యాగజైన్ బయటపెట్టింది. జెఫ్ బెజోస్, లారెన్ సాన్షేల మధ్య ఎఫైర్ మ్యాగజైన్‌లో రావడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఆ గొడవలు కాస్తా విడాకులకు దారితీశాయి. మరోవైపు సాన్షే కూడా తన భర్త పాట్రిక్‌కు విడాకులు ఇచ్చిందన్న ప్రచారం కూడా ఉంది.ఇవి కూడా చదవండి:

Work From Home: స్మార్ట్‌ఫోన్‌తో ఇంట్లో కూర్చొని రూ.40 వేలు సంపాదించండి ఇలా
Loading...
కార్డు నెంబర్, సీవీవీ లేకుండా పేమెంట్స్ సాధ్యం... ఎలాగో తెలుసుకోండి

తప్పకుండా చూడాల్సిన పర్యాటక ప్రాంతాల్లో రెండో స్థానంలో హంపి

CES 2019: 'సెక్స్ టాయ్' వివాదం... ఇచ్చిన అవార్డు వెనక్కి తీసుకున్న నిర్వాహకులు
First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...