Home /News /business /

WHO HAS TO FILE INCOME TAX RETURN ON EARNINGS OF DECEASED HERE IS THE ANSWER NS GH

Income Tax Return: మరణించిన వ్యక్తి ఆదాయంపై ట్యాక్స్ వర్తిస్తుందా? ఎవరు ఐటీఆర్​ దాఖలు చేయాలి? తెలుసుకోండి

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కొందరు చనిపోయాక కూడా వారి పేరు మీద ఆదాయం వస్తూ ఉంటుంది. అయితే మరణించిన వ్యక్తి పన్ను రిటర్న్​ ఎలా దాఖలు చేయగలడనే సందేహాం సాధారణంగా వ్యక్తమవుతూ ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానమిదే..

ఉద్యోగులు, వ్యాపారులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్న్​ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే కొంత మంది చనిపోయాక కూడా వారి పేరు మీద ఆదాయం వస్తుంటుంది. మరి మరణించిన వ్యక్తి పన్ను రిటర్న్​ ఎలా దాఖలు చేయగలడు? అనే కదా మీ సందేహం. వారి తరఫున చట్టబద్దమైన వారసుడు పన్ను చెల్లించడం, ఐటీఆర్​ దాఖలు చేయడం వంటివి పూర్తి చేయాల్సి ఉంటుంది. చట్టబద్దమైన వారసుడే దీనికి పూర్తి బాధ్యత వహిస్తాడు. కోవిడ్-19 కారణంగా చాలా మంది తమ ప్రియమైన వారిని కోల్పోయారు. అటువంటి వారి చట్టబద్ధమైన వారసులు ఐటిఆర్ దాఖలు చేయడం, పన్నులు చెల్లించడం వంటి బాధ్యతల గురించి తెలుసుకోవాలి. మరణించిన వ్యక్తి పేరు మీద వచ్చే ఆదాయం కనీస మినహాయింపు పరిమితికి మించి ఉంటే ఐటిఆర్ దాఖలు చేయాలి. దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. మరణించిన వ్యక్తి విదేశీ ఆస్తిని కలిగి ఉండి, ఆర్థిక సంవత్సరంలో రూ.1 కోటికి పైగా కరెంట్ ఖాతాలో జమ చేసి ఉంటే ఐటీఆర్​ దాఖలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక ఫారెన్​ ట్రిప్​కు రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే.. వారు కూడా పన్ను పరిధిలోకి వస్తారు.
Monsoon Insurance: వర్షాకాలంలో తప్పక ఉండాల్సిన ఇన్సూరెన్సులు ఇవే.. ఏ కష్టమొచ్చినా భరోసా

నిర్ణీత తేదీలోపు ఐటిఆర్ దాఖలు చేయాల్సిన బాధ్యత చట్టపరమైన వారసుడిదే. దాఖలు చేయడంలో ఏదైనా ఆలస్యం జరిగితే, చట్టపరమైన వారసుడు జరిమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 159 ప్రకారం, మరణించిన వ్యక్తికి సంబంధించిన చట్టబద్దమైన వారసుడు దీనికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందువల్ల ఐటిఆర్ దాఖలు చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరణించిన వ్యక్తి ఆదాయాన్ని స్పష్టంగా లెక్కించి ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.

ఐటిఆర్ ఎలా దాఖలు చేయాలి?
మరణించిన వ్యక్తికి సంబంధించిన ఐటిఆర్ దాఖలు చేయడానికి, ముందుగా చట్టబద్ధమైన వారసుడు ఆదాయపు పన్ను దాఖలు పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. పోర్టల్​లో మరణించిన వ్యక్తి పాన్ కార్డు నెంబర్, పేరు, మరణించిన తేదీ, మరణ ధ్రువీకరణ పత్రం వంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు వారసుడి పాన్ నంబర్‌, బ్యాంక్ ఖాతా వివరాలు, వారసుడిగా రుజువు కాపీ అవసరం. వీటిని అప్​లోడ్​ చేసి సబ్​మిట్​ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ‘రిజిస్ట్రేషన్​ ఆఫ్​ లీగల్​ హెయిర్​’ రిక్వెస్ట్​ పూర్తవుతుంది. ఆ తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Corona, Corona deaths, Death, Income tax

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు