Income Tax: ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? ఈ ఐదు తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి..

ప్రతీకాత్మక చిత్రం

ఫైలింగ్ పోర్టల్‌లోని టెక్నికల్ ప్లాబ్లం వల్ల ఇన్‌క‌మ్ రిటర్న్స్ (Income Returns) దాఖలు చేసే ప్రక్రియ కష్టతరంగా మారుతుంది. ఇలాంటి క్లిష్టమైన ప్రక్రియ పూర్తి చేసేప్పుడు.. కొన్ని తప్పులు దొర్లే అవకాశాలు చాలా ఎక్కువ. మరి ఆ తప్పులు చేయకుండా ఎలా జాగ్రత్త పడాలో చూద్దాం.

  • Share this:
ఇన్‌క‌ం ట్యాక్స్ రిటర్న్స్ (Income tax returns) ఫైల్ చేయడం ఒక సవాలేనని చాలామంది భావిస్తుంటారు. పాత చెల్లింపుదారులు కూడా ఇన్‌క‌మ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో చాలా ఇబ్బందులు పడిపోతుంటారు. గజిబిజిగా ఉండే ఎక్కువ పేపర్ వర్క్ తో పాటు.. ఫైలింగ్ పోర్టల్‌లోని టెక్నికల్ ప్లాబ్లం వల్ల ఇన్‌క‌మ్ రిటర్న్స్ (Income Returns) దాఖలు చేసే ప్రక్రియ కష్టతరంగా మారుతుంది. ఇలాంటి క్లిష్టమైన ప్రక్రియ పూర్తి చేసేప్పుడు.. కొన్ని తప్పులు దొర్లే అవకాశాలు చాలా ఎక్కువ. మరి ఆ తప్పులు చేయకుండా ఎలా జాగ్రత్త పడాలో చూద్దాం.

1. రెసిడెన్షియల్ స్టేటస్ తప్పుగా డిక్లేర్ చేయడం

చాలామంది పన్ను చెల్లింపుదారులు (tax payers) తమ రెసిడెన్షియల్ స్టేటస్ తప్పుగా రిపోర్ట్ చేస్తుంటారు. పోయిన ఆర్థిక సంవత్సరంలో ఒక భారతీయ వ్యక్తి లేదా భారతీయ మూలాలున్న వ్యక్తి  182 రోజులు, అంతకన్నా ఎక్కువ రోజులు ఇండియాలో నివసించినట్లయితే.. వారిని రెసిడెంట్ (resident)గా పరిగణిస్తారు. ఈ ప్రకారం రెసిడెన్షియల్ స్టేటస్ నమోదు చేయాల్సి ఉంటుంది. రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ (resident and ordinary resident), రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ (resident but not ordinary resident) అనే విషయాలను కూడా రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడే చాలామంది తప్పులు (mistakes) చేస్తుంటారు.

ఇన్‌క‌ం ట్యాక్స్ డిపార్ట్మెంట్ 'రెసిడెన్షియల్ స్టేటస్ (residential status)' మార్గదర్శకాలను తెలుసుకోవడం ద్వారా మీరు ఏ కేటగిరిలోకి వస్తారో నిర్ధారించుకోవచ్చు. తప్పుడు రిపోర్టుల వల్ల సీరియల్ ట్యాక్స్ (serial tax) విధించే ప్రమాదం ఉంది. అలాగే ఫారం ఐటీఆర్-2లో విదేశీ ఆస్తులు (Foreign assets), ఖాతాల గురించి రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఇతర దేశాల్లో సంపాదించిన ఆదాయంపై కూడా పన్ను కట్టాల్సి ఉంటుంది అనేది గమనించాలి.

2. లిస్టుకాని షేర్ల గురించి ఇన్ఫర్మేషన్ దాచడం

మీరు ఒక ప్రైవేట్ లేదా లిస్టుకాని ఏదైనా ఓ కంపెనీ (company)లో వాటా కలిగి ఉన్నట్లైతే.. ఆ వాటాతో పాటు దాని క్రయవిక్రయాల లావాదేవీలు తెలియజేయాలి. మీరు ఎంత డబ్బుతో వాటాను కొనుగోలు చేశారనే విషయాన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో జరిమానాలు (fine) పడే అవకాశం ఉంది.

3. పొదుపు ఖాతా వడ్డీని తెలపకపోవడం

సేవింగ్స్ బ్యాంక్ (savings bank) తన కస్టమర్లు దాచుకున్న డబ్బుపై ప్రతి త్రైమాసికంలో వడ్డీ (Interest)ని చెల్లిస్తుందనే విషయం తెలిసిందే. అయితే ఈ వడ్డీ మొత్తం గురించి ఫారం-16లో పొందుపరిచేలా పన్ను చెల్లింపుదారులు నిర్ధారించుకోవాలి. ఫిక్స్ డ్ డిపాజిట్ వడ్డీ (Fixed deposit interest) అనేది కూడా "ఇన్‌క‌ం ఫ్రమ్ అథర్ సోర్సస్" అనే సెక్షన్ లో తెలియజేయాలి.

4. జాబ్ మారారా.. అయితే ఒక పూర్తి ఏడాది శాలరీని రిపోర్ట్ చేయడం మర్చిపోకండి

2020-21 ఆర్థిక సంవత్సరంలో మీరు ఉద్యోగాలు (job) మారినట్లయితే మునుపటి యజమాని జారీ చేసిన ఫారమ్-16 (from 16)ని తీసుకోవడం మరువకండి. ప్రస్తుత, మునుపటి యజమానులు జారీ చేసిన రెండు ఫారంలను ఐటీఆర్ సమయంలో దాఖలు చేయకపోతే మీకు ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ (Income tax department) నుంచి నోటీసు వచ్చే ప్రమాదం ఉంది.

5. డివిడెండ్ ఇన్‌క‌మ్ వెల్లడించకపోవడం

ఈ అసెస్‌మెంట్ సంవత్సరం నుంచి వర్తించే డివిడెండ్ ఇన్‌క‌మ్ (dividend income) చాలామంది డిక్లేర్ చేయడం మిస్సయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కొందరు వ్యక్తిగత పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్‌లు, స్టాక్‌లపై సంపాదించిన డివిడెండ్ ఆదాయాన్ని డిక్లేర్ చేసినా.. ఈ ఇన్‌క‌మ్ ని లెక్కించేటప్పుడు తప్పులు చేయవచ్చు. ఎందుకంటే అలాంటి డివిడెండ్ పెట్టుబడిదారుల వద్ద ఉన్నప్పుడు.. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచే పన్ను విధిస్తారు.
Published by:Prabhakar Vaddi
First published: