గత కొంతకాలం నుంచి నిత్యావసరాల రేట్లు భారీగా పెరుగుతున్నాయి. దీన్నే బిజినెస్ పరిభాషలో ద్రవ్యోల్బణం అంటారు. సగటు మధ్య తరగతి కుటుంబాలు ఏదైనా కొనుగోలు చేయాలంటే అధిక డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. ఈ సమయాల్లో పొదుపు సొమ్ము ఎంతో ఆసరాగా ఉంటుంది. ప్రతివ్యక్తి సురక్షితమైన భవిష్యత్తు కోసం వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటాడు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ లేదా క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టడం వంటి అనేక ఎంపికలు ఉన్నప్పటికీ ఇవి రిస్క్‌తో కూడుకున్నవి. దీంతో చాలా మంది వెనకడుగు వేస్తారు. ఈ కారణంగా చాలా మంది బ్యాంకు లేదా పోస్టాఫీస్ స్కీమ్స్ (Post office schemes)లో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు.
పెట్టుబడి (Investment) పెట్టడానికి ప్రస్తుతం ఉన్న ఉత్తమైన స్కీమ్‌లను (Best Schemes) పరిశీలిద్దాం. ఇందులో ప్రధానంగా రికరింగ్ డిపాజిట్ (Recurring Deposit) ఒకటి. ఇది స్థిర పెట్టుబడి పథకం. పెట్టుబడిదారుడు ప్రతి నెలా ఖాతాలో నిర్ణీత మొత్తాన్ని జమ చేసి సేకరించిన కార్పస్‌పై రాబడిగా వడ్డీని పొందవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే రిటర్న్ రేట్లు సాధారణంగా మెరుగ్గా ఉంటాయి. రికరింగ్ డిపాజిట్ ఖాతాను బ్యాంకుల్లో (banks) లేదా పోస్టాఫీసుల్లో (Post Office) తెరవవచ్చు.
* ఫోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (Post Office Recurring Deposit) ఖాతాను 10 ఏళ్ల వయస్సు పైబడిన పిల్లల నుంచి పెద్దల వరకు తెరవచ్చు. నెలవారీ డిపాజిట్ కోసం కనీస మొత్తం రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ ప్రకారం డిపాజిట్ చేసే వ్యక్తి కనీస మొత్తాన్ని రూ. 10 రూపంలో కూడా చెల్లించవచ్చు. రికరింగ్ డిపాజిట్లపై పోస్ట్ ఆఫీసులు సంవత్సరానికి 5.8 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఇది ఏప్రిల్ 2020 నుండి అమలులోకి వచ్చింది. ఈ వడ్డీ రేటు (Interest rate) త్రైమాసికానికి కలిపి ఉంటుంది. ఖాతా తెరిచిన తేదీ నుండి ఐదు సంవత్సరాలు లేదా 60 నెలల తర్వాత రికరింగ్ డిపాజిట్ మెచ్యూర్ అవుతుంది.
డిపాజిటర్ మూడు సంవత్సరాల తర్వాత పోస్టాఫీసులో RD ఖాతా క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే ఖాతా తెరిచిన తేదీ నుండి ఒక సంవత్సరం తర్వాత 50 శాతం వరకు రుణం తీసుకోనే అవకాశం కూడా ఉంటుంది. మెచ్యూరిటీకి ఒక రోజు ముందు కూడా ఖాతా క్లోజ్ చేయాలనుకున్నా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా ఆధారంగా వడ్డీ రేట్లు వర్తించనున్నాయి. అలాగే మెచ్యూరిటీ తేదీ నుండి 5 సంవత్సరాల వరకు పోస్టాఫీస్ RD ఖాతాను డిపాజిట్ లేకుండా కూడా కొనసాగించవచ్చు.
* బ్యాంకు రికరింగ్ డిపాజిట్
ఖాతా (Account) యాక్టిక్‌లో ఉండాలంటే పెట్టుబడిదారు నెలవారీ మొత్తాన్ని చెల్లించాలనే ప్రాథమిక నియమం బ్యాంక్ రికరింగ్ డిపాజిట్‌లకు (Bank recurring Deposit) కూడా వర్తిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో రికరింగ్ డిపాజిట్ ఖాతాలపై వడ్డీ రేటే పబ్లిక్, సీనియర్ సిటిజన్ల టర్మ్ (Senior citizens Term)డిపాజిట్లకు వర్తిస్తుంది. ఎస్‌బీఐలో వడ్డీ రేట్లు సంవత్సరానికి 2.90 శాతం నుండి ప్రారంభమై.. 5.40 శాతం వరకు అందించనున్నాయి. ఈ వడ్డీ రేటు త్రైమాసికానికి కలిపి ఉంటుంది.
HDFC బ్యాంకులో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఆ బ్యాంకు వెబ్‌సైట్ ప్రకారం రూ.1,000 పెట్టుబడితో రికరింగ్ డిపాజిట్లను ప్రారంభించవచ్చు. ఆ తర్వాత రూ.100 మల్టిపుల్‌తో ప్రారంభించవచ్చు. రికరింగ్ డిపాజిట్ ఖాతాలో గరిష్టంగా నెలకు రూ. 1,99,99,900 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీ రేటు సంవత్సరానికి 4 శాతం నుండి 6.35 శాతం వరకు ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Post office scheme, Recurring Deposits