హోమ్ /వార్తలు /బిజినెస్ /

Aadhaar Card: మీ ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నెంబర్ లింక్ చేశారు? 2 నిమిషాల్లో తెలుసుకోండిలా

Aadhaar Card: మీ ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నెంబర్ లింక్ చేశారు? 2 నిమిషాల్లో తెలుసుకోండిలా

Aadhaar Card: మీ ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నెంబర్ లింక్ అయింది? 2 నిమిషాల్లో తెలుసుకోండిలా
(ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Card: మీ ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నెంబర్ లింక్ అయింది? 2 నిమిషాల్లో తెలుసుకోండిలా (ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Card | ఆధార్ సేవలు పొందేందుకు ఓటీపీ రావట్లేదా? అసలు మీ ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నెంబర్ లింక్ చేశారు? 2 నిమిషాల్లో తెలుసుకోండిలా.

ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయడం ద్వారా ఆథెంటికేషన్ సులువు అవుతోంది. అంటే ఎక్కడైనా మీ ఆధార్ నెంబర్‌ను ఉపయోగించినప్పుడు, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీని ద్వారా ఆధార్ నెంబర్‌ను ఇతరులు దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవచ్చు. అయితే ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసిన సమయంలో ఏ మొబైల్ నెంబర్ ఇచ్చాం అన్న సంగతి చాలామందికి గుర్తుండదు. ఒకరి దగ్గరే రెండు మూడు ఫోన్ నెంబర్లు ఉండటం లేదా ఫోన్ నెంబర్లు మార్చి కొత్తవి తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీంతో ఓటీపీ విషయంలో తిప్పలు తప్పవు. అసలు ఏ నెంబర్‌కు ఓటీపీ వెళ్తుందో తెలియదు. మరి ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నెంబర్ లింక్ అయిందన్న విషయం తెలుసుకోవడం ఎలా? ఆధార్ కార్డు హోల్డర్లను వేధించే ప్రశ్న ఇది. చాలా సులువుగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఈ స్టెప్స్ ఫాలో అవండి.

Aadhaar PVC Card: పాన్ కార్డ్ సైజులో ఆధార్ కార్డ్... సింపుల్‌గా ఆర్డర్ చేయండి ఇలా

Aadhaar Card: గుడ్ న్యూస్... ఇక ఈ మార్పులన్నీ ఆన్‌లైన్‌లోనే... ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు

Aadhaar Card: మొబైల్ నెంబర్ వెరిఫై చేయండి ఇలా


ముందుగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయండి.

My Aadhaar సెక్షన్‌లో Aadhaar Services లో Verify Email / Mobile Number ఆప్షన్ సెలెక్ట్ చేయండి.

కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత Send OTP పైన క్లిక్ చేయాలి.

మీరు సరైన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే The Mobile Number xxxxxxxxxx matches with our records అని వస్తుంది.

మీరు ఆధార్ నెంబర్‌కు లింక్ లేని మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే The Mobile number you had entered does not match with our records అని వస్తుంది.

ఇలా వచ్చినప్పుడు మీరు మరో నెంబర్‌తో ట్రై చేయాలి.

మీరు ఇలాగే ఇమెయిల్ ఐడీని కూడా వెరిఫై చేయొచ్చు.

Aadhaar Card: మీ ఆధార్ కార్డులో ఏదైనా సమస్య ఉందా? ఈ నెంబర్‌కు కాల్ చేయండి

Aadhaar-PAN: మీ పాన్ కార్డు, ఆధార్ కార్డులో పేర్లు వేర్వేరుగా ఉంటే సరిచేయండి ఇలా

అసలు మొబైల్ నెంబర్ ఏదో ఏమాత్రం ఐడియా కూడా లేకపోతే ఎలా తెలుసుకోవాలన్న సందేహం ఉంటుంది. ఇది కూడా సాధ్యమే. యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో మీరు మీ ఆధార్ నెంబర్‌కు ఏ మొబైల్ నెంబర్ లింక్ చేశారో సులువుగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఈ స్టెప్స్ ఫాలో అవండి.

ముందుగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయండి.

My Aadhaar సెక్షన్‌లో Aadhaar Services లో Verify an Aadhaar Number పైన క్లిక్ చేయండి.

ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.

Proceed to Verify పైన క్లిక్ చేయండి.

Aadhaar Number xxxxxxxxxxxx Exists అని వస్తుంది.

దాంతో పాటు మొబైల్ నెంబర్ దగ్గర ఫోన్ నెంబర్ చివరి 3 అంకెలు కనిపిస్తాయి.

దీని ద్వారా మీరు ఏ మొబైల్ నెంబర్ లింక్ చేశారో క్లూ దొరుకుతుంది.

మొబైల్ నెంబర్ దగ్గర ఖాళీగా ఉంటే ఆ ఆధార్ నెంబర్‌కు ఏ ఫోన్ నెంబర్ లింక్ కాలేదని అర్థం.

First published:

Tags: Aadhaar, Aadhaar card, AADHAR, UIDAI

ఉత్తమ కథలు