Jio: ఐయూసీ చార్జీల నుంచి మినహాయించిన కాల్స్ ఇవే...

లాండ్ లైన్ ఫోన్లు, వాట్సప్, ఫేస్ టైమ్ లాంటి ఇంటర్నెట్ వాయిస్ బేస్డ్ ప్లాట్ ఫామ్‌లకు సైతం ఈ నిబంధన వర్తించదని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.

news18-telugu
Updated: October 9, 2019, 9:11 PM IST
Jio: ఐయూసీ చార్జీల నుంచి మినహాయించిన కాల్స్ ఇవే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, జియో నుంచి జియో నెట్ వర్క్ కు కాల్ చేస్తే ఎలాంటి ఐయూసీ చార్జీలు వర్తించవు. అలాగే ఇన్ కమింగ్ కాల్స్‌కు సైతం ఈ చార్జీలు వర్తించవు. దీంతో పాటు లాండ్ లైన్ ఫోన్లు, వాట్సప్, ఫేస్ టైమ్ లాంటి ఇంటర్నెట్ వాయిస్ బేస్డ్ ప్లాట్ ఫామ్‌లకు సైతం ఈ నిబంధన వర్తించదని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. ఇక పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు సైతం ప్రతి నిమిషానికి 6 పైసల ఐయూసీ చార్జీ బిల్లులో కలుపుతుండగా, అందుకు తగ్గట్టుగానే ఉచిత డేటాను సైతం అందించనున్నట్లు ప్రకటనలో తెలిపారు. అలాగే టారిఫ్ లో ఎలాంటి పెరుగుదల ఉండదని కంపెనీ తెలిపింది.

కాగా జనవరి 1, 2020 నుంచి కాల్ టర్మినేషన్ చార్జీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ఇప్పటికే ట్రాయ్ ప్రకటించింది. కాగా ఈ వ్యవధిని పునస్సమీక్షించాలని కొన్ని టెలికాం సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు, ల్యాండ్‌లైన్ నుంచి ల్యాండ్‌లైన్‌కు కాలింగ్‌పై ఎప్పటిలాగే టర్మినేషన్ చార్జీలుండవని గతంలోనే నియంత్రణ మండలి స్పష్టం చేసింది.

First published: October 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading