హోమ్ /వార్తలు /బిజినెస్ /

Crorepati: కేవలం రూపాయితో రూ.54 కోట్లు.. ఇదెక్కడి మ్యాజిక్ రా మావ!

Crorepati: కేవలం రూపాయితో రూ.54 కోట్లు.. ఇదెక్కడి మ్యాజిక్ రా మావ!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Money | ఒక్క రూపాయి ప్రత రోజూ డబుల్ అవుతూ వస్తే.. ఎంత అవుతుందో తెలుసా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలి. నెల రోజుల్లోనే మీరు ఊహించనంత డబ్బుగా మారుతుంది. రూపాయి రోజు రోజుకు రెట్టింపు అవుతూ వస్తే.. ఒక నెలలో ఎంత అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Investment | మీకు ఒక్క రూపాయి కావాలా? లేదంటే రూ. 5 కోట్లు కావాలా? అంటే ఎవరైనా రూ. 5 కోట్లు కావాలనే కోరుకుంటారు. అదే ఒక్క రూపాయి ప్రతి రోజూ డబుల్ అవుతుందని చెబితే? అప్పుడు ఆ ఒక్క రూపాయి (Rupee) తీసుకుంటారా? లేదంటే రూ. 5 కోట్లు తీసుకుంటారా? ఇప్పుడు కొంచెం ఆలోచిస్తారు. ఎందుకంటే రూపాయి ప్రతి రోజు రెట్టింపు అవుతూ వస్తే.. నెల రోజుల్లోనే ఎంత డబ్బు వస్తుందో తెలుసుకోవాలి. అప్పుడు రూ. 5 కోట్లు తీసుకుంటే మంచిదా? రెట్టింపు అయ్యే ఒక్క రూపాయి తీసుకుంటే మేలా? అని తెలుస్తుంది. ఇప్పుడు మనం అదే విషయాన్ని తెలుసుకోబోతున్నాం.ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఎంత చిన్న మొత్తం అయినా సరే ప్రతి రోజూ పెరుగుదల ఉంటే దాన్ని ఎంచుకోవడం ఉత్తమం. మీరు ప్రతి రోజూ డబుల్ అయ్యే ఒక్క రూపాయి తీసుకోకుండా రూ. 5 కోట్లు తీసుకుంటే.. మీరు రూ.48.5 కోట్లు నష్టపోయినట్లు అవుతుంది. ఎలా? అని ఆలోచిస్తున్నారా? అయేత ఈ విషయం తెలుసుకోవాలి. రూపాయి రెండో రోజు రూ.2 అవుతుంది. అలాగే మూడో రోజు రూ. 4 అవుతుంది. నాలుగో రోజు రూ.8గా మారుతుంది. ఇలా రూపాయి పెరుగుతూ వస్తుంది. అసలు వియం 18వ రోజు ఉంటుంది. ఎందుకంటే ఆ రోజున రూపాయి రూ. 1,31,072 అవుతుంది. ఇక్కడి నుంచి డబ్బులు భారీ పెరుగుతూ వస్తాయి. తర్వాతి 12 రోజుల్లో రూపాయి విలువ ఏకంగా రూ. 53.7 కోట్లుకు చేరుతుంది. అంటే 30 రోజుల్లో రూపాయి విలువ ప్రతి రోజూ డబుల్ అవుతూ వస్తే.. దాదాపు రూ. 54 కోట్లు అవుతుంది.
కేంద్రం స్కీమ్.. నెలకు రూ. 75 వేల పెన్షన్ పొందండిలా!
దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌ కూడా ఇదే సూత్రాన్ని అనుసరించారు. ఆయన ఇప్పుడు ప్రపంచ కుబేరుడిగా నిలవడానికి ఆయన ముందు నుంచే ఇన్వెస్ట్ చేస్తూ రావడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మనం ఇదే సూత్రాన్ని పర్సనల్ ఫైనాన్స్‌కు కూడా వర్తింపజేసుకోవచ్చు. ఉదాహరణకు రూ. 5 లక్షలు ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే.. ఇది రూ. 15 లక్షలు కావడానికి 11 ఏళ్ల 6 నెలలు సమయం పడుతుంది. ఇక్కడ వార్షిక వడ్డీ రేటు 10 శాతంగా తీసుకున్నాం. ఇంకా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ద్రవ్యోల్బణం వంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి.
రూ.30 వేలకే తులం బంగారం.. కొంటే కలిగే లాభాలివే.. అదొక్కటే మైనస్


అలాగే ఇక్కడ మరో విషయాన్ని కూడా గుర్తించుకోవాలి. ఈ రోజు రూపాయి రేపటి రూపాయి కన్నా చాలా విలువైందని గుర్తించుకోవాలి. అలాగే ఈరోజు ఇన్వెస్ట్ చేసిన రూపాయి ఇంకా విలువైందని చెప్పుకోవచ్చు. అందుకే ఎవరైనా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని యోచిస్తే మాత్రం.. వీలైనంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాలి. అప్పుడే దీర్ఘకాలంలో ఎక్కువ ప్రయోజనం పొందటానికి అవకాశం ఉంటుంది.

First published:

Tags: Indian rupee, Investments, Money, Rupee value, Savings

ఉత్తమ కథలు