లోన్ కోసం వెతుకుతున్నారా ?... పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ రెండింట్లో ఏది బెటర్...

తక్షణ అవసరాలకు మాత్రం చాలా మంది గోల్డ్ లేదా పర్సనల్ లోన్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. మరి పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్ రెండింట్లో ఏది బెటర్ ఆప్షనో చూద్దాం..

news18-telugu
Updated: March 26, 2019, 3:35 PM IST
లోన్ కోసం వెతుకుతున్నారా ?... పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ రెండింట్లో ఏది బెటర్...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 26, 2019, 3:35 PM IST
లోన్ కోసం వెతుకులాడుతున్నప్పుడు సాధారణంగా కనిపించే ఆప్షన్స్ పర్సనల్ లోన్ అలాగే గోల్డ్ లోన్ వైపు జనం ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. అయితే బ్యాంకులు మాత్రం ఎక్కువగా రకరకాల లోన్స్ ను మనముందు ఉంచుతాయి. వాటిలో క్రెడిట్ కార్డ్ లోన్స్, వెహికిల్ లోన్స్, హోమ్ లోన్స్, ఎడ్యుకేనల్ లోన్స్ వంటి ఆప్షన్స్ ఇస్తుంటాయి. అయితే తక్షణ అవసరాలకు మాత్రం చాలా మంది గోల్డ్ లేదా పర్సనల్ లోన్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. గోల్డ్ లోన్స్ విషయానికి వస్తే మనదేశంలో ప్రతీ ఇంట్లో అందుబాటులో ఉండే అస్సెట్..అర్జెంటుగా నగదు అవసరం అయినప్పుడు గోల్డ్ లోన్స్ మనముందు ఉన్న ఆప్షన్ అనే చెప్పవచ్చు. అలాగే క్రెడిట్ స్కోర్ బాధలు కూడా గోల్డ్ లోన్స్ పై ఉండవు.

ఈ నేపథ్యంలో పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్ రెండింట్లో ఏది బెటర్ ఆప్షనో చూద్దాం...

గోల్డ్ లోన్స్ అనుకూలతలు :

1. సులభమైన ప్రాసెసింగ్ : గోల్డ్ లోన్స్ విషయంలో ప్రాసెసింగ్ చాలా వేగంగా ఉంటుంది. రుణదాతలు బంగారం తనాఖా పెట్టుకొని వెంటనే నగదు ఇస్తుంటారు. కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు జెట్ స్పీడ్ తో బంగారం లోన్స్ ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నాయి.2. సులభ రీపేమెంట్: బంగారం మీద అప్పు తీర్చే ప్రాసెస్ చాలా సులభంగా ఉంటుంది. వడ్డీ చెల్లింపుల విషయంలో పెద్దగా పట్టింపులు ఉండవు. అసలు చెల్లించి నెమ్మదిగా వడ్డీ చెల్లించుకోవచ్చు.

3. అందుబాటులో వడ్డీ రేట్లు: ఇతర లోన్ల వడ్డీ రేట్లతో పోల్చితే గోల్డ్ లోన్స్ మీద వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. అందుకే జనం ఎక్కువగా బంగారం మీద అప్పు కోసం ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.

గోల్డ్ లోన్స్‌లో ప్రతికూలతలు :

1. ఎక్కువ మార్జిన్ ఉండటం : బ్యాంకులు సాధారణంగా బంగారం మొత్తం వేల్యూ మీద కేవలం 75 శాతం మాత్రమే నగదును రుణంగా ఇస్తాయి. అంటే సుమారు 25 శాతం బంగారం మీకు ఉపయోగం లేకుండా తనఖా పడిపోతుంది.

2. బంగారం శాశ్వతంగా కోల్పోవచ్చు : కొన్ని పరిస్థితుల్లో మీరు రుణం తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో, తనాఖా పెట్టిన బంగారం శాశ్వతంగా బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ ఆధీనంలోకి వెళ్లిపోతుంది.

3. తక్కువ కాల వ్యవధి : సాధారణంగా బంగారు నగల తనఖా గరిష్టంగా 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఇది కూడా గోల్డ్ లోన్స్‌ విషయంలో ప్రతికూలాంశం.

ఇక పర్సనల్ లోన్స్ విషయంలో అనుకూలతలు, ప్రతికూలతలు ఏంటో చూద్దాం..

పర్సనల్ లోన్స్ అనుకూలతలు :
1. సులభ డాక్యుమెంటేషన్ : పర్సనల్ లోన్స్ పొందేందుకు ప్రస్తుతం అన్ని బ్యాంకులు పేపర్ వర్క్ ను తగ్గించేశాయి. దీంతో సులభమైన డాక్యుమెంటేషన్ పర్సనల్ లోన్స్ విషయంలో అందుబాటులోకి వచ్చింది.

2. తనఖా పెట్టాల్సిన అవసరం లేదు : పర్సనల్ లోన్ పొందేందుకు ఎలాంటి సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం లేదు. గోల్డ్ లోన్ తో పోల్చితే ఇది సానుకూలాంశమే అని చెప్పవచ్చు.

3. అలాగే పర్సనల్ లోన్స్ అవసరానికి తగ్గట్లు పొందే వీలుంది. ముఖ్యంగా పెళ్లిల్లు, ఇతర ఆర్థిక అవసరాలకు పర్సనల్ లోన్స్ ఉపయోగపడుతాయి.

పర్సనల్ లోన్స్ ప్రతికూలతలు :
1. అధిక వడ్డీరేట్లు : పర్సనల్ లోన్స్ సాధారణంగా అధిక వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. ఇదే పర్సనల్ లోన్స్ పొందేందుకు ప్రధాన అడ్డింకిగా ఉంది.

2. అలాగే పర్సనల్ లోన్ పొందాలంటే కచ్చితంగా క్రెడిట్ స్కోర్ ప్రామాణికంగా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ ఆధారంగానే లోన్ పొందే అవకాశం ఉందా లేదా తేల్చేస్తారు.

3. ముందుగానే లోన్ చెల్లించేస్తే పెనాల్టీలు సైతం విధించేందుకు బ్యాంకులు వెనకడ్డం లేదు. ఇది కూడా పర్సనల్ లోన్స్ విషయంలో ప్రధాన అడ్డంకి అనే చెప్పవచ్చు.
First published: March 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...