హోమ్ /వార్తలు /బిజినెస్ /

Govt Schemes: మీకు ఏ ప్రభుత్వ స్కీమ్ వర్తిస్తుంది? ఈ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు

Govt Schemes: మీకు ఏ ప్రభుత్వ స్కీమ్ వర్తిస్తుంది? ఈ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు

Govt Scheme: మీకు ఏ ప్రభుత్వ స్కీమ్ వర్తిస్తుంది? ఈ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు
(ప్రతీకాత్మక చిత్రం)

Govt Scheme: మీకు ఏ ప్రభుత్వ స్కీమ్ వర్తిస్తుంది? ఈ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

Govt Schemes | కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకాల్లో మీకు ఏ ప్రభుత్వ స్కీమ్ వర్తిస్తుందో తెలుసా? మై స్కీమ్ పోర్టల్‌లో (My Scheme Portal) ఈ వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కేంద్ర ప్రభుత్వం పౌరుల కోసం అనేక పథకాలను (Govt Schemes) అందిస్తోంది. వేర్వేరు వర్గాలకు వేర్వేరు స్కీమ్స్‌ను రూపొందిస్తూ ఉంటుంది. అయితే ఈ పథకాల గురించి అవగాహన లేకపోవడం వల్ల వీటి ప్రయోజనాలను ప్రజలు పొందలేకపోతున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మై స్కీమ్ పోర్టల్ (My Scheme Portal) రూపొందించింది. ఈ పోర్టల్‌లో ప్రజలు తమకు ఏఏ ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయో తెలుసుకోవచ్చు. అన్ని ప్రభుత్వ పథకాల వివరాలు ఇందులో ఉంటాయి. ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడానికి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ స్మార్ట్‌ఫోన్‌లో లేదా కంప్యూటర్‌లో సింపుల్‌గా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకోవచ్చు.

మై స్కీమ్ పోర్టల్ ప్రభుత్వ పథకాలను సెర్చ్ చేయడానికి వేదికగా నిలుస్తోంది. వేర్వేరు ప్రభుత్వ వెబ్‌సైట్లు సెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఒక్క వెబ్‌సైట్‌లోనే స్కీమ్స్ వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు. ఇంగ్లీష్‌తో పాటు హిందీలో వివరాలు చూడొచ్చు. త్వరలో ఇతర భారతీయ భాషల్లో కూడా ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ పోర్టల్‌లో మీకు ఏ ప్రభుత్వ పథకం వర్తిస్తుందో తెలుసుకోండి.

IRCTC Rann Utsav: తెల్లని ఎడారిలో రణ్ ఉత్సవ్... టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

మై స్కీమ్ పోర్టల్‌లో పథకాలను సెర్చ్ చేయండి ఇలా

Step 1- ముందుగా మై స్కీమ్ పోర్టల్ https://www.myscheme.gov.in/ ఓపెన్ చేయండి.

Step 2- హోమ్ పేజీలో Find Schemes For You పైన క్లిక్ చేయండి.

Step 3- మీ జెండర్, వయస్సు సెలెక్ట్ చేసి తర్వాతి పేజీలోకి వెళ్లండి.

Step 4- ఆ తర్వాత మీ రాష్ట్రం పేరు, మీరు ఉంటున్న ప్రాంతం పట్టణమా, గ్రామమా అనే వివరాలు సెలెక్ట్ చేసి తర్వాతి పేజీలోకి వెళ్లాలి.

Step 5- ఆ తర్వాత మీ సామాజిక వర్గాన్ని సెలెక్ట్ చేసి తర్వాతి పేజీలోకి వెళ్లాలి.

Step 6- మీరు దివ్యాంగులు అయితే Yes పైన క్లిక్ చేయండి. లేకపోతే No అని సెలెక్ట్ చేయాలి.

Step 7- మీరు మైనారిటీ అవునో కాదో సెలెక్ట్ చేసి తర్వాతి పేజీలోకి వెళ్లాలి.

Step 8- విద్యార్థి అవునో కాదో సెలెక్ట్ చేయాలి.

Step 9- మీ ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్ వెల్లడించాలి.

Step 10- తర్వాతి పేజీలో వృత్తిని సెలెక్ట్ చేసి తర్వాతి పేజీలోకి వెళ్లాలి.

Step 11- మీకు ఏఏ ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయో శాఖల వారీగా తెలుస్తాయి.

New Rule: ఆ స్కీమ్‌లో ఉన్నవారికి షాక్... అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్

ఈ ప్లాట్‌ఫామ్‌లో వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలకు చెందిన 7 పథకాలు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్‌కు చెందిన 38 పథకాలు, బిజినెస్ అండ్ ఆంట్రప్రెన్యూర్‌షిప్‌కు సంబంధించిన 17 పథకాలు, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్‌కు చెందిన 39 పథకాలు, హెల్త్ అండ్ వెల్‌నెస్‌కు చెందిన 21 పథకాలు, హౌజింగ్ అండ్ షెల్టర్‌కు సంబంధించిన 8 పథకాలు, ప్రజా భద్రత, చట్టం న్యాయం విభాగంలో 2 పథకాలు, సైన్స్, ఐటీ, కమ్యూనికేషన్స్‌కు సంబంధించిన 3 పథకాలు, స్కిల్ అండ్ ఎంప్లాయ్‌మెంట్‌కు చెందిన 22 పథకాలు, సామాజిక సంక్షేమం, సాధికారతకు చెందిన 70 పథకాలు, స్పోర్ట్స్ అండ్ కల్చర్‌కు సంబంధించిన 3 పథకాలు, రవాణా, మౌలిక సదుపాయాలకు చెందిన 3 పథకాలు, ట్రావెల్ అండ్ టూరిజంకు చెందిన 2 పథకాలు, యుటిలిటీ, శానిటైజేషన్‌కు చెందిన 15 పథకాల వివరాలు తెలుస్తాయి. ఈ పథకాల వివరాలను ఇదే పోర్టల్‌లో డీటెయిల్డ్‌గా తెలుసుకోవచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Ayushman Bharat Health Scheme, National Pension Scheme, NPS Scheme, PM Kisan Scheme, PM Ujjwala Scheme, Schemes

ఉత్తమ కథలు