Home /News /business /

Passive Mutual Funds: ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ ఉండాల్సిందేనా? వీటిలో బెస్ట్ ఫండ్స్‌ ఏవి?

Passive Mutual Funds: ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ ఉండాల్సిందేనా? వీటిలో బెస్ట్ ఫండ్స్‌ ఏవి?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

రెండేళ్ల క్రితం వరకు అసెట్ మేనెజ్మెంట్ కంపెనీలు ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్‌పై అంతగా ఆసక్తి చూపలేదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఈమధ్య కాలంలో ఈ ప్యాసివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌పై ఏఎంసీలు ఎక్కువగా గురిపెడుతున్నాయి.

మ్యూచువల్ ఫండ్ల (Mutual funds)లో పెట్టుబడులు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. కొత్తగా పెట్టుబడులపై దృష్టిపెట్టే యువత వీటిని ఎంచుకుంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం వరకు అసెట్ మేనెజ్మెంట్ కంపెనీలు (AMC) ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్‌పై అంతగా ఆసక్తి చూపలేదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఈ మధ్య కాలంలో ఈ ప్యాసివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌పై (Passive Investment Instruments) ఏఎంసీలు ఎక్కువగా గురిపెడుతున్నాయి. ఫలితంగా భారత్‌లో ఫండ్ ఇన్వెస్టర్లు కూడా అయోమయంలో పడ్డారు. ప్యాసివ్ ఫండ్స్‌ (passive funds)లో ఏవి మంచి పథకాలో అర్థం చేసుకోలేకపోతున్నారు.

* ఇండియన్ ఇండెక్స్ ఫండ్స్‌లో వేటిని ఎంచుకోవాలి?
మార్కెట్ క్యాపిటల్ సిగ్మెంట్స్ ఆధారంగా కొన్ని ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు.

లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్..

చాలా మంది పెట్టుబడుదారులు నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ ఆధారంగా నడిచే ఇండెక్స్ ఫండ్స్ కు కట్టుబడి ఉండాలి. కొంచెం రిస్క్ తీసుకునేవారు నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్ ను ఎంచుకుంటే మంచిది. ఇండెక్స్ ఫండ్స్ కు ఇంత జనాదరణ రావడానికి ప్రధాన కారణం యాక్టివ్ లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇండెక్స్ ను అధిగమించలేకపోవడమే.

మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్..

మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ (Small cap Index) లో ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. ఇవి మార్కెట్ విభాగంలోని సూచీలతో పోలిస్తే యాక్టివ్ ఫండ్స్ ఇప్పటికీ బాగానే పనిచేస్తున్నాయి. కాలక్రమంలో పెరుగుతున్న ధరల కారణంగా యాక్టివ్ ఫండ్స్ (Active funds) పనితీరు తగ్గే అవకాశముంటుంది. అయితే ఇప్పటికీ ఈ పరిధిలో ప్యాసివ్ ఫండ్స్ కు మంచి ట్రాక్ రికార్డులు లేవు. కాబట్టి అప్పటి వరకు యాక్టివ్ మిడ్ క్యాప్ ఫండ్స్ ను పెట్టుబడుదారులు ఎంచుకోవడం మంచిది.

స్మాల్ క్యాప్ ప్యాసివ్ ఫండ్స్..

ఎక్కువ మంది పెట్టుబడిదారులకు స్మాల్ క్యాప్ ఫండ్స్ (Small cap funds) అవసరం లేదు. అయితే ఈ స్పేస్ లో యాక్టివ్, ప్యాసివ్ రెండూ ఎంపికలు ఉన్నాయి.

* గ్లోబల్ ఇండెక్స్ ఫండ్స్ లో వేటిని ఎంచుకోవాలి?

వివిధ దేశాల్లో పలు రకాల ప్యాసివ్ ఫండ్స్ లాంచ్ (passive Funds launch) అయ్యాయి. అయితే మీరు అన్ని ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. దేశీయ స్కీముల కంటే అంతర్జాతీయ పథకాలపైనే ఎక్కువ దృష్టి పెట్టే సమయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. చాలావరకు పెట్టుబడిదారులు ఒకటి లేదా రెండు ఫండ్స్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఇందులో అమెరికన్ ఫండ్స్ (American) కు మార్కెట్లో తగినంత ప్రాధాన్యత ఉంది. మీరు రిస్క్ తీసుకునేవారయితే సరైన అవగాహనతో అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి సారించి పెట్టుబడి పెట్టాలి.

* సెక్టోరల్ లేదా ఫోకస్డ్ ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి?

ప్రత్యేకమైన, వినూత్నమైన థీమ్స్ కలిగిన ఎన్నో ఫండ్స్ అంతర్జాతీయంగా లాంచ్ (launch) అయ్యాయి. అయితే చాలామంది పెట్టుబడిదారులు ఫోకస్డ్ థీమ్స్ ఫండ్స్ (Focused themes funds) లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి భారత్ వెలుపల ఉండే కొన్ని అస్పష్టమైన సూచీలు. కాబట్టి లాభ, నష్టాలను బేరీజు వేసుకొని తగిన నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి ఫండ్స్ అధునాతన ఇన్వెస్టర్లకు సరిపోతాయి.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Investment Plans, Mutual Funds

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు