Home /News /business /

WHERE YOUR FIXED INCOME AND HOME LOAN RATES CAN BE IN THE NEXT ONE YEAR UMG GH

RBI: మరోసారి రెపో రేటు పెంచనున్న ఆర్‌బీఐ..? వచ్చే ఏడాది వివిధ వడ్డీ రేట్లు ఎలా ఉంటాయంటే..!

మళ్లీ రెపో రేటు పెంచనున్న ఆర్‌బీఐ

మళ్లీ రెపో రేటు పెంచనున్న ఆర్‌బీఐ

శుక్రవారం జరిగే మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) రెపో రేటును వరుసగా మూడోసారి పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రేట్ల పెంపు తప్పకపోవచ్చని మీడియా నివేదికలు తెలిపాయి. కమర్షియల్‌ బ్యాంకులకు ఆర్‌బీఐ వడ్డీకి రుణాలు ఇచ్చే రేటును రెపో రేటు అంటారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
శుక్రవారం జరిగే మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) రెపో రేటును వరుసగా మూడోసారి పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రేట్ల పెంపు తప్పకపోవచ్చని మీడియా నివేదికలు తెలిపాయి. కమర్షియల్‌ బ్యాంకులకు ఆర్‌బీఐ వడ్డీకి రుణాలు ఇచ్చే రేటును రెపో రేటు అంటారు. రాబోయే పాలసీలో సెంట్రల్ బ్యాంక్ 25-50 బేసిస్ పాయింట్ల రేటు పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంకు డిపాజిట్లు, రుణ రేట్లపైనా ప్రభావం పడుతుందని చెబుతున్నారు.

* ఆర్‌బీఐ రెపో రేటును పెంచినప్పుడు ఎఫ్‌డీ, లోన్‌ వడ్డీ రేట్లపై పడే ప్రభావం ఏంటి?
రెపో రేటు పెరిగినప్పుడు బ్యాంకులు హోమ్ లోన్‌, కార్‌, పర్సనల్ లోన్‌లపై వడ్డీ రేట్లను పెంచుతాయి. వినియోగదారులు ప్రతినెలా చెల్లించే ఈఎంఐలపై ఈ ప్రభావం కనిపిస్తుంది. అయితే బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఆకర్షణీయంగా మారతాయి. గత రెండు పాలసీలలో, సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో బ్యాంకులు డిపాజిట్ రేట్లను పెంచాయి.

* రాబోయే నెలల్లో రెపో రేటు ఎంత ఉండవచ్చు?
ఆర్‌బీఐ ఈ ఏడాది మేలో రెపో రేటులో 40 బేసిస్ పాయింట్ల పెంపును ప్రకటించింది. జూన్‌లో మరో 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇప్పటివరకు ఆర్‌బీఐ రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు పెంచింది.
ఆగస్టులో రెపో రేటు 25-50 బేసిస్ పాయింట్లు పెరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:  ఓరి నీ సర్ప్రైజ్ పాడుగాను.. హారం పోయిందని పెళ్లికొడుకు నాటకం.. చివరికి ఏం జరిగిందంటే !


* రెపో రేటు మళ్లీ పెరిగితే హోమ్ లోన్‌, ఎఫ్‌డీ రేట్లు ఎలా ఉండవచ్చు?
రెపో రేటు పెంచితే హోమ్‌ లోన్‌, వెహికల్‌ లోన్‌లు మరింత ఖరీదైనదిగా మారవచ్చు. కాబట్టి స్థిర ఆదాయం, హోమ్ లోన్‌ రేట్లలో మార్పుల పరిమాణం ఆర్‌బీఐ రేట్ల పెంపుతో సమానంగా ఉండాలి. రాబోయే 12 నెలల్లో రెపోరేటు ప్రస్తుత 4.9 శాతం నుంచి 6 శాతానికి చేరవచ్చని చెప్పారు బ్యాంక్‌బజార్ సీఈవో ఆదిల్ శెట్టి. ప్రస్తుత పరిస్థితుల్లో రేట్లు పెంపు ఉంటుందని, బ్యాంకులు ముందస్తుగా రేట్లను పెంచడంతో తక్కువ ప్రభావం కనిపించవచ్చని ఆయన తెలిపారు. దీనివల్ల రుణ రేట్లతో పాటు డిపాజిట్ రేట్లలో మార్పులు తప్పవని పేర్కొన్నారు.

పైసాబజార్, హెడ్ ఆఫ్ హోమ్ లోన్స్ రతన్ చౌదరి మాట్లాడుతూ..‘ద్రవ్యోల్బణం రేట్లు ఆర్‌బీఐ టోలరెన్స్ బ్యాండ్‌ను మించిపోతున్నాయి. దీంతో రుణ వడ్డీ రేట్లు పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన కేంద్ర బ్యాంకులు తమ సంబంధిత పాలసీ రేట్లను పెంచుతూనే ఉంటాయి. కాబట్టి ఈఎంఐలు క్రమంగా పెరుగుతాయి.’ అని చెప్పారు.

* హోమ్‌లోన్‌ తీసుకున్న వారు ఏం చేయాలి?
వడ్డీ రేట్లు పెరిగినప్పుడు, ఇప్పటికే ఉన్న రుణగ్రహీతలు బ్యాంకులను సంప్రదించి టెన్యూర్‌ను పెంచమని కోరవచ్చు. ఈఎంఐ పెంచమని కూడా కోరవచ్చు. ఈఎంఐ పెంచమనే ఆప్షన్‌ కంటే.. టెన్యూర్‌ పెంచమనే ఆప్షన్‌ ఎంచుకుంటే ఎక్కువ వడ్డీ భారం భరించాలి. ప్రస్తుత ఫ్లోటింగ్ రేట్ రుణగ్రహీతలు తమ హోమ్ లోన్‌లను ముందస్తుగా చెల్లించడానికి ప్రయత్నించాలి. వడ్డీ వ్యయంలో ఎక్కువ సేవ్‌ చేయడానికి టెన్యూర్‌ తగ్గింపు ఆప్షన్‌ ఎంచుకోవాలి. హోమ్ లోన్ తీసుకున్నవారు పరిమిత లిక్విడిటీ ఉన్నవారు హోమ్ సేవర్ ఆప్షన్‌ ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ సదుపాయం కింద, సేవింగ్స్‌, లేదా కరెంట్ అకౌంట్‌ ఫార్మ్‌లో ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్ ఓపెన్‌ చేస్తారు. ఇక్కడ రుణగ్రహీత అతని/ఆమె సర్ప్లస్‌ను ఉంచుకోవచ్చు. ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఉపసంహరించుకోవచ్చు. పొదుపు/కరెంట్ ఖాతాలో ఉంచిన మిగులు మొత్తాన్ని బకాయి ఉన్న హోమ్ లోన్ మొత్తం నుంచి తీసివేసిన తర్వాత వడ్డీ లెక్కిస్తారు. ఇది హోమ్‌ లోన్‌ తీసుకున్నవారు తమ లిక్విడిటీని త్యాగం చేయకుండా ముందస్తు చెల్లింపులు చేయడం వల్ల ప్రయోజనం పొందేందుకు వీలు కల్పిస్తుంది.

* ప్రస్తుత ఎఫ్‌డీ, హోమ్‌లోన్ రేట్లు ఎలా ఉన్నాయి?
ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఐదు సంవత్సరాల వరకు స్థిర లేదా టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 2.9- 5.5 శాతం రేంజ్‌లో ఉన్నాయి.

* కీలక బ్యాంకులు అందించే ఎఫ్‌డీ రేట్లు ఇవే..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్‌డీలపై సాధారణ కస్టమర్లకు 2.90% నుంచి 5.50%, సీనియర్‌ సిటిజన్లకు 3.40% నుంచి 6.30% అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 2.75% నుంచి 5.75% , సీనియర్‌ సిటిజన్లకు 3.25% నుంచి 6.50% చెల్లిస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ సాధారణ కస్టమర్‌లకు 2.50% నుంచి 5.90%, సీనియర్‌ సిటిజన్లకు 3.00% నుండి 6.40%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాధారణ కస్టమర్‌లకు 3.00% నుంచి 5.60%, సీనియర్‌ సిటిజన్లకు 3.50% నుంచి 6.10%, కెనరా బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 2.90% నుంచి 5.75%, సీనియర్‌ సిటిజన్లకు 2.90% నుంచి 6.25%, యాక్సిస్ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 2.50% నుంచి 5.75%, సీనియర్‌ సిటిజన్లకు 2.50% నుంచి 6.50% అందిస్తోంది.



* హోమ్‌లోన్‌ వడ్డీ రేట్లు..

వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం హోమ్‌లోన్‌ వడ్డీ రేట్ల వివరాలు ఇవే..

- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.55%

- సిటీ బ్యాంక్ 6.65%

- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.40%

- బ్యాంక్ ఆఫ్ బరోడా 7.45%

- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.40%

- బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.90%

- యాక్సిస్ బ్యాంక్ 7.60%

- కెనరా బ్యాంక్ 7.05%
Published by:Mahesh
First published:

Tags: Banks, FD rates, Interest rates, Rbi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు