• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • WHEN JEFF BEZOS TOLD ALEXA TO SHOOT YOURSELF IN THE HEAD FOR ITS LACK OF INTELLIGENCE MK GH

Jeff Bezos: నీ తలపై తుపాకీతో కాల్చుకో...జెఫ్ బెజోస్ అంత మాట అనేశాడా..ఎందుకంటే...

Jeff Bezos: నీ తలపై తుపాకీతో కాల్చుకో...జెఫ్ బెజోస్ అంత మాట అనేశాడా..ఎందుకంటే...

జెఫ్ బిజోస్

ఒకానొక సమయంలో దీని పేలవమైన పనితీరుతో సహనం కోల్పోయిన అమెజాన్​ సీఈఓ జెఫ్​ బెజోస్ “అలెక్సా నీ తలపై కాల్చుకో” అంటూ గట్టిగా అరిచాడట. దీన్ని చూసి ఖంగుతున్న ప్రాజెక్ట్​ ఇంజనీర్లంతా ఇక ఈ ప్రాజెక్ట్​ అటకెక్కినట్లేనని భావించారట.

  • Share this:
అలెక్సా.. ప్లే మ్యూజిక్​.. అంటే చాలు చక్కటి సంగీతాన్ని వినిపిస్తుంది. టీవీ, ఏసీ, లైట్స్​ ఇలా ఏ ఎలక్ట్రానిక్​ పరికరాన్నైనా సరే​ అలెక్సాతో క్షణాల్లో కంట్రోల్​ చేయవచ్చు. ప్రముఖ సంస్థ అమెజాన్​ తెచ్చిన ఈ పాపులర్​ వర్చువల్​ అసిస్టెంట్ ‘‘అలెక్సా’’ ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందింది. చాలా మంది టెక్​ యూజర్స్​ లైఫ్​లో ఇప్పుడు ఇదొక భాగమైపోయింది. అలెక్సాతో కూర్చున్న చోటే కదలకుండా పనులన్నీ చక్కబెట్టే వెసుబాటు ఉండటంతో దీని యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఇంతటి పాపులారిటీ సంపాదించిన అలెక్సా సృష్టి వెనుక పెద్ద కష్టమే దాగి ఉంది. దీన్ని రూపొందించే క్రమంలో ఇంజినీర్లు ఎన్నో ఫెయిల్యూర్స్​ ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో దీని పేలవమైన పనితీరుతో సహనం కోల్పోయిన అమెజాన్​ సీఈఓ జెఫ్​ బెజోస్ “అలెక్సా నీ తలపై కాల్చుకో” అంటూ గట్టిగా అరిచాడట. దీన్ని చూసి ఖంగుతున్న ప్రాజెక్ట్​ ఇంజనీర్లంతా ఇక ఈ ప్రాజెక్ట్​ అటకెక్కినట్లేనని భావించారట. కానీ, జెఫ్​ బెజోస్​ ప్రోత్సాహంతో ఒక్కో తప్పిదాన్ని సరిచేసుకుంటూ ఎట్టకేలకు 2014లో ఈ పరికరాన్ని గ్లోబల్​ మార్కెట్​లోకి విడుదల చేశారు.

ఈ వివరాలన్నింటినీ అలెక్సా రూపకర్త బ్రాడ్ స్టోన్ తన పుస్తకంలో రాసుకొచ్చారు. ఆయన స్వయంగా రాసిన ‘‘అమెజాన్ అన్​బౌండ్: జెఫ్ బెజోస్ అండ్ ది ఇన్వెన్షన్ ఆఫ్ ఎ గ్లోబల్ ఎంపైర్’’ అనే పుస్తకంలో ఈ విషయాలను ప్రస్తావించారు. 2013లో అలెక్సా కోసం ‘డాప్లర్’ అని పిలిచే ఓ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. ఈ ప్రాజెక్ట్​లో పనిచేసిన ఇంజినీర్ల మనోగతాన్ని, అలెక్సాను రూపొందించడంలో వారు ఎదుర్కొన్న సవాళ్లను ఈ పుస్తకంలో వివరించాడు.

అలెక్సాకు ఆ పేరెలా వచ్చింది?
సాధారణంగా పలు కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చినప్పుడు వాటికి రకరకాల పేర్లు పెడుతుంటాయి. వాటిలో చాలా వరకు పాపులర్​ అవుతుంటాయి. అలా అమెజాన్​ పెట్టిన అలెక్సా పేరు కూడా పాపులర్​ అయ్యింది. అయితే, అసలు అలెక్సా అనే పేరు ఎందుకు పెట్టారనే ఆసక్తికర విషయాన్ని తన పుస్తకంలో వివరించాడు బ్రాడ్​ స్టోన్​. తొలుత ఈ డివైజ్​కు సమంతా అని పేరు పెడదాం అనుకున్నారట. ఆ తర్వాత, ఇలాంటి అనేక పేర్లను పరిశీలించిన జెఫ్​ బెజోస్​ ఎట్టకేలకు అలెగ్జాండ్రియా పేరులో నుంచి ‘‘అలెక్సా’’ తీసుకొని దాన్నే ఈ డివైజ్​కు పెట్టారట. అలెక్సా మొదటి వెర్షన్ 2014లో విడుదలైంది. కేవలం ఐదేళ్ళలో ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా డివైజెస్​ను విక్రయించగలిగింది అమెజాన్​. కరోనా మహమ్మారి సమయంలో అలెక్సా పరికరాల వాడకం విపరీతంగా పెరిగింది. ప్రజలు ఎక్కువగా ఇంట్లోనే ఉంటున్నందున వీటి విక్రయాలు కూడా అమాంతం పెరిగాయి. ప్రజలు ఎక్కువగా.. ఇవాళ ఏ వారం? కరోనా టీకా స్లాట్​ బుకింగ్ ఎలా చేయాలి? అనే విషయాలను ఎక్కువగా అలెక్సాను అడిగి తెలుసుకుంటున్నారని అమెజాన్​ పేర్కొంది.
Published by:Krishna Adithya
First published: