హోమ్ /వార్తలు /బిజినెస్ /

Anant Ambani, Radhika Merchant's Engagement: రేపే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఎంగేజ్మెంట్.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

Anant Ambani, Radhika Merchant's Engagement: రేపే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఎంగేజ్మెంట్.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ (ఫైల్ ఫొటో)

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ (ఫైల్ ఫొటో)

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఎంగేజ్మెంట్ వేడుక రేపు ముంబాయిలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఎంగేజ్మెంట్ వేడుక రేపు ముంబాయిలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు హాజరయ్యే వారిని భారత సంప్రదాయ దుస్తువుల్లో హాజరవ్వాలని కోరారు. మంగళవారం వధువు మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వేడుకను గోల్ దానాగా పిలవనున్నారు. గుజరాతీ సంప్రదాయం ప్రకారం వేడుకకు హాజరైన అతిథులకు బెల్లం, కొత్తిమీర గింజలను అందిస్తారు. అందుకు ఈ వేడుకను గోల్ దానాగా పిలుస్తారు. ఈ వేడుక రేపు సాయంత్రం 7 గంటలకు అల్టామౌంట్ రోడ్, ముంబాయిలో జరగనుంది.

ఇదిలా ఉంటే.. మంగళవారం వీరి మెహందీ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వధువు కాబోయే రాధికా మర్చంట్‌ను ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్లు అబి జానీ, సందీప్ ఖోస్లా మెహెందీ వేడుక కోసం తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా రాధిక అభిమానులు కొందరు ఆమె ఫోటోలతో కూడిన క్లిప్‌ను తమ ఖాతాల్లో షేర్ చేశారు. అలాగే మెహందీ వేడుకలో రాధికా మర్చంట్ డ్యాన్స్ చేసిన వీడియో కూడా వైరల్ అవుతోంది. కళంక్ చిత్రంలోని ఆలియా భట్ యొక్క ఘర్ మోర్ పర్దేశియా పాటపై ఆమె డ్యాన్స్ చేసింది.

అంబానీ కుటుంబానికి చెందిన చిన్న కోడలు రాధిక తన అందం మరియు అద్భుతమైన నృత్యా ప్రదర్శనతో అందరి హృదయాలను గెలుచుకుంది. ఆమె మల్టీకలర్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో కూడిన పింక్ కలర్ లెహంగా ధరించింది. దీనికి మిర్రర్ వర్క్ మరియు దిగువన గోల్డెన్ బ్యాండ్ కూడా ఉన్నాయి. దీనితో పాటు ఆమె హాఫ్ స్లీవ్‌లు ఉన్న మ్యాచింగ్ బ్లౌజ్‌ని ధరించింది. ఆమె ధరించిన దుపట్టా కూడా పింక్ కలర్‌లో ఉంది, చుట్టూ విశాలమైన బ్యాండ్ లెహెంగా వర్క్ మరియు మధ్యలో గోల్డెన్ థ్రెడ్ వర్క్ ఉంది.

First published:

Tags: Anant Ambani and Radhika Merchant Wedding, Mukesh Ambani, Radhika Merchant

ఉత్తమ కథలు