HRA and Home Loan: హోం లోన్‌, హెచ్‌ఆర్‌ఏలను పన్ను మినహాయింపు కోసం క్లెయిమ్‌ చేయవచ్చా?

ప్రతీకాత్మక చిత్రం

నిబంధనలను అనుసరించి ఉద్యోగులు ఒకేసారి హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌ (హెచ్‌ఆర్‌ఏ), హోం లోన్‌ చెల్లింపును ఆదాయపు పన్ను మినహాయింపు కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే నిబంధనలను అతిక్రమిస్తే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ చర్యలు తీసుకుంటుంది.

  • Share this:
రాజేష్‌ హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో ఉంటాడు, వాళ్ల తల్లిదండ్రులు సొంతూళ్లో రాజేష్‌ కట్టుకున్న ఇంటిలో ఉంటారు. మరి దీనిపై ఆదాయపు పన్ను మినహాయింపు కోరవచ్చా? సురేష్‌ విశాఖపట్నంలో సొంతింటిలో ఉంటున్నాడు. అయితే ఆదాయపు పన్ను మినహాయింపు కోసం హెచ్‌ఆర్‌ఏ కూడా పెట్టుకున్నాడు. అలా పెట్టుకోవచ్చా రమేష్‌ అద్దెకుండే ఇంటి అద్దెను ఆయన భార్య చెల్లిస్తుంటుంది. మరి ఆదాయపు పన్ను మినహాయింపులో హెచ్‌ఆర్‌ఏను రమేష్‌ చూపించుకోవచ్చా? మీకూ ఆదాయపుపన్ను విషయంలో ఇలాంటి ప్రశ్నలే ఉన్నాయా? అయితే ఈ కథనం చదివేయండి... మీ అనుమానాలు నివృత్తి చేసుకోండి. భారత పన్ను చట్టాల ప్రకారం చూసుకుంటే... నిబంధనలను అనుసరించి ఉద్యోగులు ఒకేసారి హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌ (హెచ్‌ఆర్‌ఏ), హోం లోన్‌ చెల్లింపును ఆదాయపు పన్ను మినహాయింపు కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే నిబంధనలను అతిక్రమిస్తే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఇలా రెండూ ఆదాయపు పన్ను మినహాయింపు కోసం అప్లై చేసేటప్పుడు చట్టాల్లోని ఈ అంశాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.

పన్ను చట్టాలు ఏం చెబుతున్నాయంటే...
సెక్షన్‌ 24(బి) కింద ప్రతీ ఉద్యోగి ఒక ఆర్థిక సంత్సరంలో హోం లోన్‌ ఇంట్రస్ట్‌ పేమెంట్‌లో రూ. రెండు లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు కింద క్లెయిమ్‌ చేసుకోవచ్చు. సెక్షన్‌ 80 (సి) కింద రూ. 1.5 లక్షలు వరకు హోం లోన్‌ ప్రిన్సిపల్‌ రీపేమెంట్‌ను ఆదాయపు పన్ను మినహాయింపు కింద క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అయితే ఈ దిగువ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.

పాటించాల్సిన నిబంధనలు
-హోంలోన్‌ పేమెంట్‌ను ఆదాయపు పన్ను మినహాయింపులో క్లెయిమ్‌ చేసుకునేటప్పుడు.. తీసుకున్న లోన్‌ మొత్తం మీ పేరు మీద కచ్చితంగా ఉండాలి.
-లోన్‌ తీసుకున్న ఇళ్లు నిర్మాణంలో ఉంటే ట్యాక్స్‌ బెనిఫిట్స్‌ క్లెయిమ్‌ చేసుకోలేరు.
-ఒకవేళ లోను తీసుకున్న ఇల్లు జాయింట్‌ ప్రాపర్టీ అయితే, ట్యాక్స్‌ బెనిఫిట్‌... లోన్‌లో మీ షేర్‌ ఎంత అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అంతేకానీ ప్రాపర్టీలో మీ షేర్‌ ఎంత అనేది ఇక్కడ వర్తించదు.

ఎప్పుడు వర్తిస్తుంది అంటే...
నగరాల్లో అద్దె ఇంట్లో ఉంటూ, సొంతూరులో లోన్‌తో కట్టుకున్న ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నప్పుడు హెచ్‌ఆర్‌ఏ, హోం లోన్‌ రీపేమెంట్‌ను ఆదాయపు పన్ను మినహాయింపులో క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ రెండు ఇళ్లులూ ఒకే ఊళ్లో ఉన్నా మినహాయింపు వర్తిస్తుంది. సొంతిళ్లు ఉండి.. వేరే ఇంట్లో అద్దెకు ఉన్నప్పుడు కూడా పన్ను మినహాయింపు కోసం హెచ్‌ఆర్‌ఏ, హోం లోన్‌ రీపేమెంట్‌ను పన్ను మినహాయంపు కోసం క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అయితే ముందుగా చెప్పుకున్నట్లు క్లెయిమ్‌ నిబంధనలకు అనుగుణంగా లేకపోతే చట్టప్రకారం చర్యలకు మీరే బాధ్యులవుతారు. కాబట్టి ఇలాంటి రెండు బెనిఫిట్లు పొందేటప్పుడు ఒకటికి రెండుసార్లు నిబంధనలు చదివాల్సి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published: