WhatsApp: నవంబర్ 1 నుంచి ఆ స్మార్ట్‌ఫోన్‌లకు సపోర్ట్‌ను నిలిపివేయనున్న వాట్సాప్.. జాబితాలో మీ ఫోన్ మోడల్‌ ఉందేమో చూసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

నవంబర్ నుంచి వాట్సాప్ రన్ చేయడానికి అనుకూలంగా లేని డివైజ్‌ల జాబితాను సంస్థ ఇంతకు ముందే విడుదల చేసింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్, ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పనిచేసే వివిధ రకాల ఫోన్ మోడళ్లు ఈ జాబితాలో ఉన్నాయి.

  • Share this:
యాన్యువల్ అప్‌గ్రేడ్ (Annual upgrade) పాలసీలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది వాట్సాప్‌ (WhatsApp). నవంబర్ (November) నుంచి కొన్ని స్మార్ట్‌ఫోన్‌లకు సపోర్ట్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు (withdraw) ప్రకటించింది. దీంతో ఆ స్మార్ట్‌ఫోన్‌ల యూజర్లు వాట్సాప్ వాడేందుకు కొత్త డివైజ్‌కు అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. నవంబర్ తర్వాత వాట్సాప్ రన్ చేయడానికి అనుకూలంగా లేని డివైజ్‌ (device)ల జాబితాను సంస్థ ఇంతకు ముందే విడుదల చేసింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్, ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌ (Operating system)లతో పనిచేసే వివిధ రకాల ఫోన్ మోడళ్లు ఈ జాబితాలో ఉన్నాయి.

పాత ఓఎస్​ ఫోన్లకు..

వచ్చే నెల నుంచి ఆండ్రాయిడ్ వెర్షన్ 4.1 (Android version 4.1), ఆ తరువాత వచ్చిన ఓఎస్‌ (operating system)లతో పనిచేసే డివైజ్‌లలో మాత్రమే వాట్సాప్ పనిచేయనుంది. అలాగే iOS 10, ఆ తరువాత వచ్చిన కొత్త వెర్షన్‌లతో పనిచేసే ఐఫోన్‌లలో మాత్రమే వాట్సాప్ (WhatsApp) సపోర్ట్ చేస్తుంది. దీంతోపాటు KaiOS 2.5.0, ఆ తరువాత వచ్చిన ఓఎస్‌ డివైజ్‌లు, JioPhone, JioPhone 2 డివైజ్‌లలో మాత్రమే వాట్సాప్ పనిచేయనుంది. అందువల్ల పాత ఓఎస్ డివైజ్‌ (old OS version)లు వాడే యూజర్లు వాట్సాప్‌ వాడటానికి ఓఎస్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓఎస్ అప్‌డేట్‌కు సపోర్ట్ చేయని స్మార్ట్‌ఫోన్ (smart phone) యూజర్లు కొత్త డివైజ్‌లకు మారాల్సిందే.

సపోర్ట్‌ (support)ను ఉపసంహరించుకోవడం వల్ల ఈ స్మార్ట్ ఫోన్ల (smart phones)లో యాప్ పనిచేయడం వెంటనే ఆగిపోదు. కానీ ఈ డివైజ్‌(device)లకు సెక్యూరిటీ, ఇతర ఫీచర్ అప్‌డేట్‌ల విడుదలను వాట్సాప్ ఆపేస్తుంది. చివరికి యూజర్లు యాప్‌ను ఉపయోగించడంలో అవరోధాలు ఎదుర్కొంటారు.

* జాబితాలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే
ఐఫోన్ 6, ఐఫోన్ 6S ప్లస్, ఐఫోన్ SEలకు వాట్సాప్ సపోర్ట్‌ను ఉపసంహరించుకోనుంది. తరువాత వచ్చిన ఐఫోన్ మోడల్స్ (I phone models) అన్నింట్లో అప్‌గ్రేడ్ చేసిన iOS ఉంటుంది. దీంతో వాటిలో వాట్సాప్ ఎప్పటిలాగే పనిచేస్తుంది.

ఆండ్రాయిడ్ ఎకో సిస్టమ్‌లోని చాలా స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్ సపోర్ట్‌ను నిలిపివేయనుంది. శామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ లైట్, గెలాక్సీ ట్రెండ్ II, గెలాక్సీ SII, గెలాక్సీ S3 మినీ, గెలాక్సీ ఎక్స్‌కవర్ 2, గెలాక్సీ కోర్, గెలాక్సీ ఏస్2 వంటి ఏడు శామ్‌సంగ్ ఫోన్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. ZTE గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్, ZTE V956, గ్రాండ్ X క్వాడ్ V987, గ్రాండ్ మెమో... వంటి నాలుగు ZTE డివైజ్‌లు సైతం ఇందులో ఉన్నాయి.

LG నుంచి విడుదలైన లూసిడ్ 2, ఆప్టిమస్ F7, ఆప్టిమస్ F5, ఆప్టిమస్ L3 II డ్యుయల్, ఆప్టిమస్ F5, ఆప్టిమస్ L5, బెస్ట్ L5 II, ఆప్టిమస్ L5 డ్యుయల్, బెస్ట్ L3 II, ఆప్టిమస్ L7, ఆప్టిమస్ L7 II డ్యుయల్, బెస్ట్ L7 II, ఆప్టిమస్ ఎఫ్ 6, ఎన్‌యాక్ట్, ఆప్టిమస్ L4 II డ్యుయల్, ఆప్టిమస్ F3, బెస్ట్ L4 II, బెస్ట్ L2 II, ఆప్టిమస్ నిట్రో HD, ఆప్టిమస్ 4X HD, ఆప్టిమస్ F3Q డివైజ్‌లకు వాట్సాప్‌ సపోర్ట్‌ను ఆపేయనుంది.

సోనీ ఎక్స్‌పీరియా మిరో, ఎక్స్‌పీరియా నియో L, ఎక్స్‌పీరియా ఆర్క్ S డివైజ్‌లలో కూడా నవంబర్ 1 తర్వాత వాట్సాప్ పనిచేయదు. హువావే, అల్కాటెల్, లెనోవో, THL వంటి కంపెనీల స్మార్ట్‌ఫోన్లు సైతం ఈ జాబితాలో ఉన్నాయి. ఈ డివైజ్‌లు వాడేవారు నవంబర్ 1 లోపు చాట్ డేటాను బ్యాకప్ చేసుకోవడం మంచిది.
Published by:Prabhakar Vaddi
First published: