హోమ్ /వార్తలు /బిజినెస్ /

WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్..త్వరలో ప్రైవేట్ న్యూస్‌లెటర్ టూల్ లాంచ్

WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్..త్వరలో ప్రైవేట్ న్యూస్‌లెటర్ టూల్ లాంచ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వాట్సాప్, న్యూస్‌లెటర్ (Newsletter) పేరుతో కొత్త ఫీచర్ తీసుకొచ్చే పనిలో పడింది. ఈ న్యూస్‌లెటర్ అనేది సమాచారాన్ని బ్రాడ్‌కాస్టింగ్ చేయడానికి ఒక సాధనంగా ఉంటుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఒకేసారి ఎక్కువమందితో కమ్యూనికేట్ అయ్యేందుకు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. మొదట్లో గ్రూప్స్, ఆ తర్వాత కమ్యూనిటీస్ & బ్రాడ్‌కాస్టింగ్ ఫీచర్లను పరిచయం చేసిన సంస్థ, ఇప్పుడు న్యూస్‌లెటర్ (Newsletter) పేరుతో కొత్త ఫీచర్ తీసుకొచ్చే పనిలో పడింది. ఈ న్యూస్‌లెటర్ అనేది సమాచారాన్ని బ్రాడ్‌కాస్టింగ్ చేయడానికి ఒక సాధనంగా ఉంటుంది. స్థానిక అధికారులు, క్రీడా బృందాలు లేదా ఇతర సంస్థలు, గ్రూప్స్‌ నుంచి ఉపయోగకరమైన అప్‌డేట్స్‌ పొందడాన్ని సులభతరం చేయనుంది. వ్యాపారాలు, వ్యక్తులు నేరుగా వాట్సాప్ ప్లాట్‌ఫామ్ ద్వారా న్యూస్‌లెటర్స్‌ క్రియేట్ చేసి వాటిని పంపించడానికి వీలు కల్పించనుంది. ఈ అప్‌కమింగ్ ఫీచర్ గురించి మరిన్ని వివరాలను వాట్సాప్ ట్రాకర్ WABetaInfo వెల్లడించింది.

వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం, ప్రైవేట్ న్యూస్‌లెటర్స్‌ క్రియేట్ చేయడానికి యూజర్లకు వీలు కల్పించే కొత్త ఫీచర్‌ను జోడించాలని ప్రస్తుతం కంపెనీ యోచిస్తోంది. ఈ ఫీచర్‌తో వినియోగదారులు సబ్‌స్క్రైబ్ చేయగల బ్రాడ్‌కాస్ట్‌ చాట్‌ను (Broadcast chat) సృష్టించవచ్చు. రీడిజైన్డ్‌ స్టేటస్ ట్యాబ్ ద్వారా ఈ చాట్‌ను యాక్సెస్‌ చేయవచ్చు. ఫీచర్ ఇంకా అభివృద్ధిలో దశలో ఉన్నా.. ఇది ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ లేటెస్ట్ వాట్సాప్ బీటా 2.23.7.17 అప్‌డేట్‌లో కనిపించిందని WABetaInfo తెలిపింది. దీనికి సంబంధించిన ఒక స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకుంది. ఆ స్క్రీన్‌షాట్‌ ప్రకారం, వాట్సాప్‌లో న్యూస్‌లెటర్‌ను సృష్టించడానికి, యూజర్ దానికి ఒక పేరు ఇచ్చి వివరణ రాయాల్సి ఉంటుంది. యూజర్‌నేమ్‌ను ఎంచుకునే ఆప్షన్ కూడా అందుబాటులో ఉండవచ్చు.

WhatsApp: వాట్సాప్ కొత్త అప్‌డేట్.. త్వరలో ఎడిట్ ఫీచర్ లాంచ్.. ప్రత్యేకతలు ఇవే..

న్యూస్‌లెటర్‌ను క్రియేట్ చేశాక, అది స్టేటస్ ట్యాబ్‌లో కనిపిస్తుంది. ఇతరులు ఇన్వైట్ లింక్‌ ద్వారా లేదా వాట్సాప్‌లో యూజర్‌నేమ్‌ను ఎంటర్ చేయడం ద్వారా ఆ న్యూస్‌లెటర్‌లో చేరవచ్చు. ఇవి ఆప్షనల్‌గా అందుబాటులోకి వస్తాయి. అంటే న్యూస్‌లెటర్‌లో చేరాలా, వద్దా అనేది యూజర్ల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. అల్గారిథమిక్ రికమండేషన్స్‌ కూడా ఉండవు కాబట్టి యూజర్లకు వాట్సాప్ ఏ న్యూస్‌లెటర్‌ని సూచించదు. ప్రైవేట్ న్యూస్‌లెటర్‌ అనే కొత్త ఫీచర్ వాట్సాప్‌ని సోషల్ నెట్‌వర్క్‌గా మార్చడం లేదని, ఇది కేవలం ప్రైవేట్ మెసేజింగ్‌కు ఒక పొడిగింపుగా అందుబాటులోకి రానుందని వాట్సాప్ బీటా ఇన్ఫో వివరించింది. ఇది సాధారణ చాట్‌ల నుంచి వేరుగా ఉంటుంది. అలానే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ప్రైవసీతో వస్తుంది.

ఇంకా న్యూస్‌లెటర్ ఫీచర్‌తో యూజర్లు ఇమేజ్‌లు, వీడియోలు, టెక్స్ట్‌తో న్యూస్‌లెటర్స్‌ క్రియేట్ చేసుకోవచ్చు. వినియోగదారులు వివిధ టెంప్లేట్లు, డిజైన్ ఎంపికలను ఉపయోగించి వారి న్యూస్‌లెటర్ రూపాన్ని మార్చుకునే అవకాశం ఉంది. ఈ ఫీచర్‌తో వినియోగదారులు వారి న్యూస్‌లెటర్స్‌ను నిర్దిష్ట సబ్‌స్క్రిప్షన్ గ్రూప్స్‌కి పంపవచ్చు. అలానే నిర్దిష్ట ప్రేక్షకులకు తమ న్యూస్‌లెటర్స్‌ను లక్ష్యంగా చేసుకోవడం కుదురుతుంది. ప్రస్తుతానికి న్యూస్‌లెటర్‌ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉంది. ఇది యాప్ ఫ్యూచర్‌ అప్‌డేట్‌లో రిలీజ్ కావచ్చు.

First published:

Tags: Whatsapp

ఉత్తమ కథలు